RSS
Facebook
Twitter

Monday 26 December 2011

 శ్రీ వడ్డాది పాపయ్య  19వ వర్ధంతి నేడు.

            వపాగా ప్రఖ్యాతి పొందిన శ్రీ వడ్డాది పాపయ్య అలనాటి" బాల" పిల్లల పత్రికలో
            లటుకు చిటుకు శీర్షికకు బొమ్మలు వేశారు చందమామ పత్రికలో 1960నుంచి
             1991 వరకూ దాదాపు 470 పైగా ముఖచిత్రాలను చిత్రించి చందమామకు
           ఆకర్షణగా నిలిచారు. చక్రపాణి గారి సంపాదకత్వాన హైద్రాబాదునుండి వెలువడిన
           "యువ" మాసపత్రికలో ఎన్నో చిత్రాలను ముఖచిత్రాలుగా, లోపలి కవరు పేజీలలో
           చిత్రించారు




8 comments:

  1. వడ్డాది గారి చిత్రాలలో అరుదైన కొన్నిటిని "హరివిల్లు"లా ఒక్కచోట చక్కగా పొందిక పరచారు...

    ReplyDelete
  2. నాకు గుర్తున్నంతవరకూ, యువ పత్రిక ముఖ చిత్రాలు అన్నీ కూడా వడ్డాది పాపయ్య గారే వేశారు. ప్రతి దీపావళికి వచ్చే ప్రత్యేక యువ సంచికలో వేసిన రంగు బొమ్మలు అద్భుతంగా ఉందేవి. ప్రెస్స్ అకాడమీ వాళ్ళు స్కాన్ చేసి పాత యువ సంచికలు వాళ్ళ సైటులో ఉంచారు కాని, దీపావళి యువలు అందులో లేవు.

    మీ దగ్గర దీపావళి యువలు ఏమన్నా ఉంటే, అందులో పాపయ్య గారి బొమ్మలు స్కాన్ చేసి అదించగలిగితే వపా అభిమానుకు మీకు సదా కృతజ్ఞులై ఉంటారు.

    ReplyDelete
  3. సురేఖ గారు వపా వర్దంతి డిశంబర్ 30 న ... 27 న కాదు...
    మరికొన్ని విషయాలు ఇక్కడ చూడండి...
    http://64kalalu.com/neeraajanam

    బొమ్మలు చాలా బావున్నై.
    కళాసాగర్

    ReplyDelete
  4. అద్భుతం మాస్టారు!

    ReplyDelete
  5. కానీ నాకు ఆ చిత్రాలు నచ్చలేదు. ఆడవాళ్ళు సిగ్గుపడుతున్నట్టు వెయ్యడం ఆ చిత్రాలలోని పురుషాహంకారాన్ని సూచిస్తోంది. చిత్రాలలోని ఎక్స్‌ప్రెషన్స్ రచయిత యొక్క భావాలని సూచించవని అనుకోలేము కదా.

    ReplyDelete
  6. మంచి కళాకారులు ఎప్పుడూ లోక సహజమైన చిత్రాలే చిత్రిస్తారు. వెర్రి గీతలు గీసి, రంగు మరకలేసి, అదే కళ అని నమ్మించబూనే వాళ్ళనూ మనం చూస్తూనే ఉన్నాం. అల్లాంటివి మెచ్చుకునే "పేజ్ త్రీ" బాచ్ కూడ ఒకటి తయారయ్యింది ఈ లోకంలో.

    వడ్డాది పాపయ్య గారు లోక సహజమైన చిత్రాలు అద్భుతంగా చిత్రించారు. అందుకనే ఆయనకు అంత పేరు వచ్చింది. లోకంలో సహజంగా ఉండే అందాలను ఆస్వాదించగల "శక్తి" ఉన్న వాళ్ళందరూ వడ్డాది వారి చిత్రాలను ఆస్వాదిస్తూనే ఉన్నారు, ఉంటారు కూడా. పాపయ్యగారు తెలుగు వాడు కావటం మన అదృష్టం. ఆయన అద్భుత కళాకారుడు కాబట్టే, ప్రజల మనసులను తన చిత్ర కళతో రంజింపచేశారు కాబట్టే, వడ్డాది పాపయ్య గారి విగ్రహం శ్రీకాకుళంలో ప్రతిష్టించారు. ఈ కింది లింకు నొక్కి సహాయంతో చూడవచ్చు.

    http://www.hindu.com/2010/01/03/stories/2010010353570300.htm

    అద్భుత చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారికి ఆయన వర్ధంతి సందర్భంగా నా నివాళి.

    ఆయనే ఏ మోషకోవ్ అనో చింగ్ పాంగ్ అనో పేరు పెట్టుకుని బొమ్మలు వేస్తుండగా తన బ్రష్ తుడుచుకున్న గుడ్డల్ని బొమ్మలుగా లోకం మీదకి వదిలి ఉంటె ఎలా ఉండేదో మరి!!

    ReplyDelete
  7. చక్కగా చెప్పారు.ధన్యవాదాలు శివరామ ప్రసాద్ గారు. కొందరికి ఇలా ఏదో రంధ్రాన్వేషణ చేయటం అలవాటు. మీరన్నట్లుగా వాపా, మన బాపుగారు మరో
    రాష్ట్రం వారైతే మన వాళ్ళే ఆహా, ఓహో అనే వాళ్ళు!

    ReplyDelete
  8. సురేఖ గారూ మీకు ఒక వావ్ ...మీరు ధన్యులు మమ్మల్ని ధన్యులని చేసారు

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About