
స్టేట్ గ్యాలరీ, మాదాపూర్ లో జూన్ 4, 5 ,6 తేదీల్లో బాపుగారి ఒరిజినల్
          బొమ్మలతో బొమ్మలకొలువు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల
          వరకు జరుగుతుందన్న ఆహ్వాన పత్రం చూశాక, 2001 , మార్చి స్మైల్
          సంచిక  16, 17 పేజీలలో చదివిన  " బాపు బొమ్మల కోసం కోటి రూపాయల
          మ్యూజియం " అన్న ఆర్టికల్ జ్ఞాపకం  వచ్చి ఆనాటి ఆ ఆర్టికల్
          మీ ముందు వుంచుతున్నాను. చదివి ఆ మ్యూజియం వివరాలు మరిన్ని
          తెలిస్తే అభిమానులెవరైనా తెలియజేస్తారని ఆశిస్తాను.

హైదరాబాదులోని శిల్పారామం ఎదురుగా బాపు బొమ్మల కోసం
           మ్యూజియం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.ఒక తెలుగు
           కార్టూనిస్టుకి ఇంతటి గౌరవం దక్కడం వెనుక ఇద్దరు అధికారుల కృషి,
           పట్టుదల వుంది. అసలు "బాపు బొమ్మలకోసం ఒక మ్యూజియం" వుండా
           లనే ఆలోచనకు సారధ్యం వహించింది, పునాది వేసింది ఐఎ ఎస్ అధికారి
           రాణి కుముదిని.మరో ఐ ఎ ఎస్ అధికారి హుడా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ
           పార్ధసారధి భాస్కర్ గారు మ్యూజియం కోసం శిల్పారామం ఎదురుగా ఐదు
           ఎకరాల స్థలంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మాణం ప్రారంభించారు.
           బాపు బొమ్మల మీద అభిమానంతో ఈ ఇద్దరు ఐ ఎ ఎస్ల కృషి వల్ల బాపు
           అపురూప చిత్రాలను కాపాడుకొనే అదృష్టం కలిగింది మనకి.
              మూడువేలకి పైగా కార్టూన్లు, లైన్ డ్రాయింగ్స్ కాక మరో ఐదు వందల
          కలర్ ఇల్లస్ట్రేషన్సుని ఈ మ్యూజియంలో తీర్చిదిద్దుతున్నారు. బాపు గీసిన
          కదలని బొమ్మలతో బాటు ఆయన తీసిన కదిలే బొమ్మల వివరాలు సీడీల్లో
          భద్రపరుస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకి మ్యూజియం. సిద్ధం అవుతుంది 
          అప్పటివరకూ ఎదురుచూసే ఓపిక లేక పోతే ఈ కార్టూన్లు చూసి నవ్వుకోండి.
                        ( "స్మైల్" మార్చి 2001 సంచిక నుంచి )

           అప్పుడే పదేళ్ళు దాటి పోయాయి. ఆ మ్యూజియం విషయం  అందరూ మర్చే
          పోయారు.బాపుగారి  ఒరిజినల్ బొమ్మలకొలువు జరుగుతున్న ఈ సంధర్భం
          లోనైనా ఈ మ్యూజియం విషయం ఆలోచిస్తే బాగుంటుంది.లేకపొతే ఆంధృల
          ఆరంభశూరత్వం మరోసారి బయటపడుతుంది. 
             (  కార్టూనిస్ట్ శ్రీ శ్యాంమ్మోహన్ " స్మైల్ " సౌజన్యంతో )
 



 
 
 
 
 
 
 
 
 









ఆంధ్రులకే కాదు...ఆరంభ శూరత్వం చాలా చోట్ల కనిపిస్తుంది..అంతకన్నా ముఖ్యంగా ఇంతమంది వున్నారుకదా...మనకేం పట్టింది అనే ధోరణి మానవనైజం...ఆలోచన మంచిది కనుక త్వరలో సాకారమవుతుంది ...కార్టూన్స్ గీయడం రాకపోయినా చూసి ఆనందించగలిగే నా బోంట్లకు నేత్రానందం త్వరలో కలుగుతుందని ఆశిస్తున్నాను...మీకు పరిచయమైన
ReplyDeleteకార్టూనిస్టులతో బాపూ గారి అభిమానులతో మీ బ్లాగు పరిచయాలతో జనాల్ని ఉత్సాహపరచండి...ఎందరో అభిమానుల కల నిజమౌతుంది... స్మైల్ శ్యాం గారి ద్వారా ఆ ఐ ఏ యస్ ఆఫీసర్స్ ను కాంటాక్టు చేయవచ్చేమో...ఆలోచించండి...నేనేమైనా చేయగలనంటే తెలియపరచండి....