ఈనాటి తెలుగు దినపత్రికలలో పాఠకుల దృష్టి పడేది మొట్టమొదట
ఆనాటి కార్టూన్లమీదే! కార్టూన్లకోసం పత్రికలు కొనే నాలాంటి వాళ్ళు
చాలా మంది ఉంటారని నా నమ్మకం. నిన్న జరిగిన రాజకీయాలన్నీ
ఒక్క గీతలో మన కళ్ళముందు ప్రత్యక్షంచేస్తాడు కార్టూనిస్ట్ !. ఇది
వరలో రాజకీయ కార్టూన్లకు ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్ పిళ్లై గారి
"శంకర్స్ వీక్లీ " వుండేది. శ్రీ శంకర్ నెహ్రూ మీద వారం వారం ఎన్నో
కార్టూన్లు గీసేవారు. ఆ కార్టూన్లకోసం నెహ్రూజీ ఆతృతతో ఎదురు
చూసేవారట1 ఈనాటి నాయకులు తమపై వచ్చిన కార్టూన్లను చూసి
కిసుక్కున నవ్వు కోవడం మాని విసుక్కుంటున్నారు, నసుక్కుంటున్నారు.
ఈనాడు, ప్రముఖ వార్తా పత్రికలలో రాజకీయ వ్యంగ్య చిత్రాలు గీసే
శ్రీధర్(ఈనాడు), సురేంద్ర ( ది హిండూ), శేఖర్ (ఆంధ్రజ్యోతి) మన
తెలుగు వాళ్లయినందుకు గర్వించాలి. మీకు మరో విషయం తెలుసా
"ఈనాడు" ప్రారంభించిన కొత్తలో ప్రఖ్యాత రచయిత, కార్టూనిస్ట్
శ్రీ సుధామ (శ్రీ అల్లంరాజు వెంకటరావుగారు) పాకెట్ కార్టూన్లు వేసే
వారు. అలనాడు " ఈనాడు "లో శ్రీ సుధామ గీసిన పాకెట్ కార్టూన్
మీ కోసం.
ఇక్కడ మీరు చూస్తున్న కార్టూన్లు ఈనాడు, ది హిండూ, శ్రీ శేఖర్ గారి
పారాహూషార్ సౌజన్యంతో.
Apparaojee. I am sure you must be knowing about Oomen the Cartoonist in Andhra Patrika Weekly during 1960s and 1970s. If you know any details about that great Political Cartoonist, please share with all. Shri Jayadev had sometime back sent me a few details, which I compiled as an Article in my Blog. Recently, Shri Babu sent me a few of Oomen's cartoons. In my view Oomen was the first politcal Cartoonist known to Telugu people. Of course he was from Kerala and while he wrote captions in English, Shri Sivalenka Radhakrishna was used to put that into Telugu and everybody was thinking that he was a Telugu person. Read about Shri Oomen by following this link:
ReplyDeletehttp://saahitya-abhimaani.blogspot.com/2009/08/blog-post_02.html
Thank you,Sivaramaprasad gaaru ! Yes I too remember Sri Oomen cartoons in Andhra sachitra vara patrika.
ReplyDeleteసురేఖ గారికి: నమస్కారం. నేను రెండ్రోజుల బట్టి ఆరుద్ర గారు తలిశెట్టి రామారావు గారిపై రాసిన కూనలమ్మ పదంలో ప్రస్తావించిన ఇతర తొలి తరం కార్టూనిస్టులు ఎవరో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఆ పేర్లన్నీ ప్రస్తావించిన కూనలమ్మ పదం ఇక్కడ ఉంచాను. మీకేమన్నా తెలిస్తే సహాయం చేయగలరు.
ReplyDeletehttp://vbsowmya.wordpress.com/2011/07/20/talisettiramaraoarudra/
-Sowmya.