ఈ రోజు నందమూరి తారక రామారావు గారి పుట్టిన రోజు. తెలుగువాళ్ళ
ఆత్మ గౌరవాన్ని నిజంగా తెలుగు నేలపై నిలబెట్టిన మహనీయుడాయన.
తెలుగు వాళ్లనే ఒక జాతి వుందనీ , ఉత్తరభారత దేశప్రజలకూ చాటి
చెప్పిన గొప్ప వ్యక్తి రామారావు. మనల్ని మద్రాసీలుగా పిలవబడుతుంటే
" తెలుగు " వాణిని పార్లమెంటులో వినిపించాడు. మామూలుగా దీనికి కూడా
మన తెలుగు వాళ్ళు కొందరు హర్షించలేదు. "తెలుగు తెగులు ": అంటూ
ఎగతాళి చేసి మనం తెలుగువాళ్ళమని నిరూపించుకొన్నారు. బాపు రమణ
గార్లచే పిల్లలకు తెలుగు పాఠాలు తయారు చేయించి, ఆ తెలుగు ప్రముఖులు
ఇద్దరినీ ఉచితరీతిన సత్కరించాడు.
ఇక నటుడిగా అనితర సాధ్యంగా వివిధ పాత్రలను తెరపై అవిష్కరించారు.
రాముడు, కృష్ణుడు ఇలానే ఉంటారు అని పించారు. ఇలాటి మహానటుడి
మైనం బొమ్మను ప్రదర్శనలో( Madame Tussaud) వుంచకబోవటం ఆయనా
.ఓ తెలుగు నటుడిగా పుట్టడమే !!
శ్రీ నందమూరి తారకరామారావు లాంటి ప్రముఖ తెలుగు వ్యక్తి పుట్టిన రోజునే
నా పుట్టిన రోజు కావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడి
ఈ ఫొటో నా చిన్ననాటిది. ఈ రోజుతో 70 సంవత్సరాలు పూర్తిచేసుకొని 71లోకి
అడుగు పెడుతున్నా ఇంకా నా ఆలోచనలు యవ్వనంగానే వున్నాయి. దీనికి
కారణం భగవంతుడు నాకు ఇచ్చిన మంచి కుటుంబం, నాపై అమిత ప్రేమాభి
మానాలు చూపించే మితృలు ! అందరికీ నా శుభాకాంక్షలు !!
అప్పారావు గారూ , మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అండి . ఈ మాట చాలా బాగున్నది అండి
ReplyDelete"ఈ రోజుతో 70 సంవత్సరాలు పూర్తిచేసుకొని 71లోకి
అడుగు పెడుతున్నా ఇంకా నా ఆలోచనలు యవ్వనంగానే వున్నాయి. దీనికి
కారణం భగవంతుడు నాకు ఇచ్చిన మంచి కుటుంబం, నాపై అమిత ప్రేమాభి
మానాలు చూపించే మితృలు !"
పదేళ్ళు పూర్తి చేసుకున్న మీకు జన్మదిన శుభాకాంక్షలు :)
ReplyDelete"ఇలాటి మహానటుడి మైనం బొమ్మను ప్రదర్శనలో( Madame Tussaud) వుంచకబోవటం"
ఆయన బొమ్మ ఎక్కడో ప్రదర్శనలో ఉంచడం అవసరమాండీ? ప్రతి తెలుగు వాడు రాముడు, కృష్ణుడు కోసం కళ్ళు మూసుకుని తలచుకోగానే కనిపించేది నిలువెత్తు ఈ బొమ్మ కాదూ?
ఇంకో యిన్నేళ్ళు గడిచినా మీ ఆలోచనలు యింత యవ్వనంగానూ వుండాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ,
ReplyDeleteపుట్టినరోజు శుభాకాంక్షలతో...
శ్రీలలిత..
Happy Birthday Sir.
ReplyDeleteసప్తతి పూర్తి చేసుకున్న అప్పారావుగార్కి..ముందుగా జన్మదిన శుభాకాంక్షలు....
ReplyDeleteమే 28 అంటే మాకు శ్రీ అప్పారావుగారి జన్మదినం గుర్తొస్తుంది...మీ హృదయంనిండా
హాస్యం...ఆ హాస్య హృదయాన్ని మీరు వింటూ...ఆ హాస్య హృదయానికి మీరు
'గీత'యోగం కల్పిస్తున్నారు, ఇంక మీకు వయస్సు ఎందుకు పెరుగుతుందండీ?...
మీలో రేఖామాత్రంగా వున్న కొద్దిపాటి హాస్యాన్నయినా సరే్ సు'రేఖ'గా మారుస్తూ
మా జీవనరేఖలను హాస్య రేఖలుగా తీర్చి దిద్దాలని ఈ శుభవేళ కోరుకుంటున్నాము.....
అవునూ..ఆ ఫోటో మీ చిన్నప్పటిదంటారా ? మేం నమ్మం..ప్రస్తుతం మీ ఇంట్లో వున్న
చిన్న మనుమని హెయిర్ స్టైల్ కొంచెం మార్చి...పాత ఫోటోగా చూపిస్తూ..హాస్యయోగం
కల్పిస్తున్నారని మా ఘా ఠ్ఠి ఢౌ ఠ్....
పై రచనంతా మా శ్రీమతి అన్ద్ మిమ్మల్ని అభిమానించే మీసోదరి
శ్రీమతి విజయలక్ష్మి కూడా ఎండార్స్ చేస్తున్నది.
అప్పారావు గారూ !
ReplyDeleteమీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
అప్పారావు గారూ !
ReplyDeleteమీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు.