ఈ రోజుల్లోనే కాదు ఆరోజుల్లోకూడా రకరకాల హాబీలుండేవి. అందులో రకరకాల స్టాంపుల
సేకరణ..మా నాన్నగారు ఎన్నోరకాల స్టాంపులూ, నాణేలు సేకరించారు. నేను శ్రమపడకుండా
అవన్నీ జాగ్రత్త చేయడం మాత్రం నాకదో హాబీ. ఈ స్టాంపుల్లో ఎన్ని రకాలవో !! పక్షులు,
జంతువులే కాకుండా ఆర్ట్ పైకూడా వున్నాయి. అందులో మధుబని మిధిలా పెయింటింగ్
మీద 5, 10 రూపాయల స్టాంపు రెండూ కలపి ఒకటిగానే విడుదలవడం ఓ విశేషం!!.మనం
ఐదు రూపాయల స్టాంపు మాత్రమే వాడాలంటే సగానికి చింపి ( చిరగటానికి వీలుగా చిల్లులు
వుంటాయ్) వాడుకోవచ్చు, లేక పోతే మరో సగం పదిరూపాయల స్టాంపు ఒకటి మాత్రమే
వాడుకోవచ్చు.
మరికొన్ని స్టాంపులు కుడి ఎడమైతే పొరబాటులేదోయ్ అంటూ కుడి ఎడమగా తప్పుగా
అచ్చయి జనాలమీదకి అచ్చేసి వదలినవీ వున్నాయి. దానికి ఉదాహరణ మీరు చూస్తున్న
ఈ భోదిస్వత్తుడి బొమ్మ స్టాంపు. కొన్ని అందమైన కొండలూ తటాకాలతో చిత్రపటంలా వుంటే
మరికొన్ని నిలువుగా నిలుచున్నమ్యూనిచ్ ఒలింపిక్ స్టాంప్స్.
నా దేశనాయకుల స్టాపుల కలెక్షన్స్ చూసిన మామిత్రులు ప్రఖ్యాత కార్టూనిస్ట్ డాక్టర్
జయదేవ బాబుగారికి ఈ నాయకుల స్టాంపులనగానే రబ్బరు స్టాంపులే గుర్తుకొచ్చిఇలా
కొసమెరుపుగా తమాషా చేసి చూపించారు! Indian Express లో శ్రీ రవిశంకర్ వేసిన
ఈ "రబ్బరు" స్టాంపు బొమ్మ మరీ బాగుంది కదూ !!
( Cartoon courtesy: Sri Ravi Shankar & The Indian Express)