నాడు వారం వారం వారపత్రికల్లో సీరియల్ కధలు
ఆరుద్ర గళ్ళనుడికట్లు,కవితలు
మరి నేడేరీ మరో వారం కోసం ఎదురు చూసే పఠితలు ?
గంట గంటకు సీరియస్గా సీరియల్గా ఏడిపించే
టీవీ వనితలు ఠీవిగా వచ్చేస్తున్నారు పిలవని
పేరంటానికి ఇంటింటికి!
ఇక దూరమవుతున్నారు మన వనితలు వంటింటికి !!
అమ్మో! ఓ రోజు కేబుల్ బందే ?!
అయ్యో!! ఈ జనాలకు తీరని ఇబ్బందే!!