ఎవరీ బాల ? ఏమా కధ ?
పందొమ్మిది వందల నలభై ఏడు, ఏప్రియల్ "బాల" సంచికలోని "తెనుగు దేశం"
సంపాదకీయం (తెలుగువారికి ప్రత్యేక రాస్ట్రం) గురించి చెఫ్ఫాను. అసలీ "బాల" పత్రిక
గురించి ఈనాటి తరం వారికి కొందరికి తెలియక పోవచ్చు. "చందమామ" కు ముందు
"బాల" పత్రిక పందొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో పిల్లలకోసం శ్రీ న్యాయపతి
రాఘవరావు, శ్రీమతి న్యాయపతి కామేస్వరి గార్లచే ప్రారంభించబడింది. వీళ్ళెవరో తెలియని
వాళ్ళుండవచ్చోమోగాని బాలన్నయ్య,బాలక్కయ్య (రేడియో అన్నయ్య,ఆక్క్యయ్య) అంటె
ఆ తరం వాళ్ళమైన మాకు ముఖతా పరిచయంలేకపోయినా "బాల" ద్వారా, "బాలానందం"
రేడియో ప్రొగ్రాముల ద్వారా బాగా తెలుసు. ఆదివారం వచ్చిందంటే భాలానందం ప్రొగ్రాముల
కోసం ఎదురుచూసే వాళ్ళం.. ఆ రేడియో కర్యక్రమాలలో "పొట్టిబావ-చిట్టి మరదలు","మొద్దబ్బాయి"
లంటే చెవి కోసుకొనేవాళ్ళం. శ్రీ బాపు గారు గీసిన మొదటి బొమ్మ, శ్రీ ముళ్లపూడి గారి మొదటి
రచన "బాల " మొదటి సంచిక ( పందొమ్మిది వందల నలభై ఐదు) లో ప్రచురించారు !! " బాల"
లో రచనలన్నీ దేనికదే ప్రత్యేకత !! తెలుగుని ఇంగ్లీష్లో ఇప్పుడు వ్రాస్తున్నాం. యాభైరెండు జూన్
సంచిక సంపాదకీయం "ఆంగ్లం అక్షరాలలో తెలుగు " ఆ రోజుల్లోనే ప్రయోగం చేశారు. వడ్డాది
పాపయ్య గారు " లటుకు-చిటుకు " శిర్షికకు బొమ్మలేసేవారు..ఇక రాము-సోము "," సరళ-
విమల" లాంటి శీర్షికలు ఎంతో బాగుండేవి. ఆ బాల పత్రికలు చందమామ పత్రికలలా జాగ్రత్త
చేసుకోలేదే అని బాధ పడుతుండెవాడిని. "రచన" శాయి గారు ఆ లోటును తీర్చారు, "బాల ":
అభిమానులకోసం నాలుగు సంపుటాలుగా " బాల విహంగ వీక్షణ సంపుటి" ని ఆనాటి బాల
పేజీలు ఎలా వుండెవో అలాగే విడుదల చేశారు. మీరు తప్పక కొని చదివి ఆనందించండి.
ఒకే ఒక్కడు లాగా - ఒకే ఒక "బాల" పుస్తకం మా చినతాతయ్య దగ్గర ఉండేది. ఇప్పుడు అదీ లేదు...శాయిగారి సంపుటాలు ఎక్కడ దొరుకుతున్నాయో కొద్దిగా చెప్పండి...
ReplyDelete'న్యాపతి' కదా?
ReplyDeleteఅబ్రకదబ్ర గారు,
ReplyDeleteన్యాయపతి కరెక్ట్. బాలక్కయ్య,బాలన్నయ్య సంతకాలలో కూడా న్యాయపతి
అనే వ్రాశారు.
వంశి గారు,
" బాల " నాలుగు సంపుటాలు వాహిని బుక్ ట్రస్ట్, విద్యానగర్, హైద్రాబాద్
వారి వద్ద దొరుకుతాయి. మొత్తం పదమూడొందల ఐదు పేజీలు !
---------సురేఖ
23.9. 2018 ఇప్పుడు కూడా బాల సంపుటాలు అందుబాటులో ఉన్నాయా
ReplyDeleteవాటిని ఏ విధంగా కొనుగోలు చేయవచ్చో దయచేసి తెలియజేయండి.