మరో మంచి పుస్తకం - బాపు రమణ బొమ్మల కధలు
బాపు రమణలు 60 ఏళ్ళనుంచి చేసిన కళా (ధా) పోసన లన్నీ ఏర్చి కూర్చి ఒకే
పుస్తక రూపంలో రచన శాయిగారు తమ వాహిని బుక్ ట్రస్ట్ ద్వారా పెద్ద సైజులో
465 పేజీలతో ప్రచురించారు. తెలుగు పాఠకులకు ఇది పసందైన విందు. ఆంధ్ర
సచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ వార పత్రిక,ఆంధ్రజ్యోతి వీక్లీ, చందమామ,యివ,జ్యొతి,
విజయచిత్ర ఇలా ఎన్నెన్నొ ప్రముఖ పత్రికలలోని అద్భుత రచనలను,బొమ్మల
కధలను చూస్తూ చదవొచ్చు. ఆనాటి చందమామలో బాపుగారు వేసిన రంగుల
గలివర్ ట్రావల్సు బొమ్మల కధ, ఆంధ్రవారపత్రికలో వేసిన, రైతూ-రాజు, బంగారం-
సింగారం , బుడుగు "రాచ్చసుడూ పదమూడో ఎక్కం ఖధ", బాపుగారు గీ(రా)సు
కున్న పెళ్ళిపుస్తకం,శ్రీ నాధ కవి సార్వభౌముడు స్క్రీన్ ప్లేలు ,చెప్పినడ్రాయింగ్
పాఠాలు, పంచతంత్రం బొమ్మల కధ అన్నీ అపురూపాలే.
495/-రూపాయలవిలువ గల ఈ పుస్తకం వాహిని బుక్ ట్రస్ట్,1-9-286
వుద్యానగర్, హైదరాబాద్- 500 04 వారి వద్ద దొరుకుతుంది.
అయ్యా!
ReplyDeleteప్రచురించే ముందు కాస్త సరి చూసుకోరూ!
'....కళా (ధా) పోసన.....'
'యివ '
(రా)సు కున్న
చిరునామాలో తప్పులుంటే యెలాగండీ--అది 'విద్యానగర్ ' అయివుంటుందా? పిన్ కోడ్ '500 004' అయి వుంటుందా?
సరిగ్గా లేక పోతే, ఆ పుస్తకం యెలా తెప్పించుకోవడం?