అవును రమణగారు బుడుగుతో మాటలాడించినా , అది హాస్యమాటయినా,సినిమా
డై "లాగ" యినా ఆపాత్రకు సరిపోయేటట్లు కుట్టి తొడిగే నిపుణుడైన టైలర్! పత్రికా
విలేఖరిగా సినిమా సమీక్షరాసినా అందులో చమత్కారాల ఘాటు వుండాల్సిందే!
డూండీగారు రక్తసంబంధం తీస్తూ మాటలు వ్రాయడానికి శ్రీముళ్ళపూడిని నిర్ణయిస్తే
పరిశ్రమలోని వారంతా ఆత్రేయలాటి వారు వ్రాయల్సిన ఈ సినిమాకు కామెడీలు
వ్రాసే అతనా అంటూ చెవులుకొరుక్కొని ఆనక సినిమాలో డైలాగులు చూశాక అదే
విన్నాక మళ్ళీ మరో మాటానలేక నోర్లు మూతపడ్డాయట! మాటలే కాదు "ప్రేమించి
చూడు" లాంటి సినిమాలకూ "బుచ్చబ్బాయ్ పని కావాలోయ్" లాటి పాటలూ అంత
నేర్పుగానూ వ్రాశారు.
వారం వారం స్వాతిలో తన ఆత్మకధను "కోతికొమ్మచ్చి"గా ఒక ఆత్మకధగా గాక
నవ్వులు కురిపిస్తూ తను ఎదుర్కొన్న కష్టాలను, మోసాలను కళ్ళకు కట్టినట్లు
పాఠకుల ఎదుట నిలిపి, అలా వచ్చే కష్టాలను ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో ఎలా
ఎదగాలో నేటి తరానికి చూపించారు. రమణగారు వ్రాసిన ఈ కోతికొమ్మచ్చి ఆడియో
సిడీగా విడుదలయిన మొదటి ఆత్మకధ అనే చెప్పాలి. ఈ ఆడియోకి యస్పీ బాల
సుబ్రహ్మణ్యం,కెఐ.వరప్రసాదరెడ్డి లాంటి ప్రముఖులు తమ గాత్రాన్ని అందించటం
మరో ప్రత్యేకత. అమెరికాలో పెరిగి తెలుగు మాట్లాడటమే తప్ప చదవటం అంతగా
రాని అభిమానులకోసం ఈ కోతికొమ్మచ్చి వచ్చి,ఈ ఆడియో ఎంతగానో ఆదరణ
పొందింది.
రమణగారు నేనంటే చాలా ఆత్మీయత చూపించేవారు. మా అమ్మాయి ఇంటికి చెన్నై
వెళ్ళీనప్పుడు ప్రతి సారీ ఆయన్ను ,బాపుగారిని కలసి రావటం అలవాటయింది. ఇక
ఆయనే కనీసం నెలకు ఒకటి రెండుసార్లయినా ఫోను చేసి కబుర్లు చెప్పేవారు. నా
కార్టూన్ల పుస్తకానికి ఆయన చేత ముందు మాట వ్రాయించాలని కోరిక వున్నా
అడిగే ధైర్యం లేక చాలాకాలం వరకు అడగలేదు. చివరకు ఒకసారి అడిగ్గానే వ్రాసి
పంపి రెండు రోజుల తరువాత మరొకటి వ్రాసి " ఇంతకు ముందు పంపినది అందినా
ఇదే వాడండి" అంటూ మరొకటి వ్రాసి పంపిన మహానుభావుడు. అందులో ఆయన
ఒక చోట ఇలా వ్రాశారు. "పొగపీలుస్తూ చక్కని కార్టూన్ పుస్తకాలు చూడడం- ద
అల్టిమేట్ జాయ్ ! దీనికి తోడు వెనకనించి-విన-బడే గులాం పాట...." ఇక్కడ ఆయన
బడేగులాంకు "విన" చేర్చి "వినబడే "గా చమత్కరించారు ! స్వాతిలో రమణగారి
అమ్మాయి శ్రీమతి అనూరాధ "నాన్న మామ మేము అను తోకకొమ్మచ్చి" వ్రాస్తూ
".......రాముడి పని పూర్తిచేశారుకాని...మరి నాపనో" అన్న మాటలు చదివగానే మళ్ళీ
కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. కారు డ్రైవరును వాళ్ళమ్మాయి షాపింగ్ చేస్తూఆలస్యంగా
భోజనానికి పంపిదన్న కోపంతో తను భోజనం ఛెయకుండా పడుకున్నారంటే రమణ
గారు తోటి మనుషులపై చూపించే ఆప్యాయత తెలుస్తుంది. రమణగారు ఎక్కడికీ
వెళ్ళలేదు.మన మన్నాంధ్యనే ఉంటూ నవ్వుతూ పలకరిస్తూనే వున్నారుఅని ధైర్యం
చెప్పుకుంటూ బ్రతికేస్తు
ఔనండీ నిజం
ReplyDeleteఆఖరి వాక్యాలు వ్రాస్తూ మీరే స్థితిలో
ఉన్నారో ఊహి౦చగలను
surekha garu, meeku telisina baapu gari maritu ramana gaari pustakaala perlu cheputaara? ee saari hyderabad vellinapudu konalnukuntunnu kani naaku a pustkaal vivaralu teliyadu
ReplyDeleteహైద్రాబాదు సుల్తాన్ బజారులో విశాలాంధ్ర బుక్ షాపుకు వెళితే శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారి దాదాపు అన్ని పుస్తకాలు దొరుతాయి. ముళ్ళపూడి
ReplyDeleteసాహితీ సర్వస్వం పేరిట ఆయన రచనలు అన్నీ బుడుగుతో సహా ఎనిమిది సంపుటాలుగా వెలువడ్డాయి. ఇటివలే బాపూరమణీయం పునర్ముద్రణ
విడుదలయింది.