RSS
Facebook
Twitter

Friday, 28 June 2013


 బుడుగు వెంకట రమణగారి పుట్టినరోజు పండగంటే హాస్యాభిమాను
లందరికీ పండుగే.  ఋణానందలహరిలో ఆయన హీరో అప్పారావు
పేరే నాపేరైనందుకు ఇప్పుడు నాకెంత ఆనందమో !! చిన్నప్పుడు
నాకు మా తాతగారి పేరు (ఆయన పేరు వెంకటప్పయ్య పంతులు)
అప్పారావు పేరు పెట్టినందుకు తెగ బాధపడిపోయేవాడిని. స్కూల్లో
చాలా మంది పేర్లు కృష్ణ అనో, రామారావనో, ప్రభాకర్ అనో,రవి అనో
వుండేవి. తరువాత పెద్దయ్యాక మా రమణగారి హీరో పేరు ముందు
చూపుగా మా అమ్మ నాన్నగారు పెట్టినందుకు కాలరెత్తుకుంటున్నాను.
తన హీరో పేరయినంద్కే నేమో రమణగారికి నేనంటే అంత ప్రేమ.


రమణగారి మాటలన్నీ ముత్యాలమూటలే!! ఎన్నని చెబుతాం !!
ఒకటా రెండా ? ఋణానందలహరిలో నాయకుడు నా చేత (సారీ)
అప్పారావు చేత ఇలా అనిపిస్తారు. 
        "మంచీ చెడ్డా అనేవి రిలెటివ్. మనిషికీ మనిషికీ
         వుండే చుట్టరికాన్ని బట్టి వుంటాయి. నేనంటే మీకు
         గిట్టనప్పుడు నాకు మంచిదైంది మీకు చెడ్డది"
అందులోనే రమణగారు జంతువుల భాషను చెప్పారు !!
       కాకివి  "కావు కేకలు" అవి ఆవులిస్తే "కావులింతలు"
       కాకులకు "రెక్కాడితేగాని డొక్కాడదట"
ఇక చీమల భాష :
        చీమలవి " చిమ చిమ నవ్వులు" మన ముసి ముసి
నవ్వులన్నమాట! పాములు ఒకరితో ఒకరు " దోబుసలాడు
కోవడం"! అవి " కొంపదీసి" అనవట! వాటి భాషలో ఐతే "పుట్ట
తీసి" అని అంటాయట! ఇలా ఎన్నెన్ని చమత్కారాలో !!



           

శ్రీ బాపు, శ్రీ రమణల మొదటి సినిమా " సాక్షి " లో నాయకి
చుక్క ( విజయనిర్మల) నోట ఈ మాటలనిపిస్తారు.
    "మంచోళ్ళు, సెడ్డోళ్ళు అంటూ యిడిగా వుండరు
     మావా! మంచీ సెడ్డా కలిస్తేనే మనిసి"

     ఆంధ్రసచిత్ర వార పత్రికలో నవంబరు 1956 నుండి
ఏప్రియల్ 1957 వరకూ వచ్చిన "బుడుగు-చిచ్చుల
పిడుగు" ఆబాలగోపాలాన్ని అలరించింది. బుడుగు
అచ్చయిన రోజుల్లో బాపు బొమ్మలు తెలుసుగానీ
రచయిత ఎవరో మాకు తెలియదు. సీరియల్ ముగింపు
సంచికలో పై బొమ్మ అచ్చు భుడుగు మాటల్లాగే వేశారు.



     రమణగారికి కాస్త ఒంట్లో నలతగా వున్నప్పుడు నేను
ఫోను చేస్తే నవ్వుతూ " ఒళ్ళు కాస్త రిపేరు కొచ్చిందండీ"
అనేవారు. ఆయన వాసే ఉత్తరాల్లోనూ చమత్కారమే.
బాపుగారి సంతకం కూడా ఆయనే చేసేసి Authorised
forgery అని వ్రాస్తారు. మా రమణగారికి పుట్టిన రోజు
జేజేలు.


2 comments:

  1. ఈరోజు బంజారాహిల్స్ రోడ్ నెం. 1 లో గల్ 'లామకాన్ ' అను స్థలంలో ముళ్ళపూడి వారి జయంతి సందర్భంగా సమావేశమునందని ఇక్కడ http://www.lamakaan.com/events/628 వ్రాశారు. హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు లేదా రాగలిగిన వాళ్ళు వస్తే బుడుగులందరం కలిసుకోవచ్చు.

    http://www.saarangabooks.com/magazine/wp-content/uploads/2013/06/ramana.jpg

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About