Sunday, 4 March 2012
" శ్రీరామరాజ్యం "-బాపు రమణ స్క్రిప్ట్ - స్టోరీ బోర్డ్ " శ్రీరామరాజ్యం "-బాపు రమణ స్క్రిప్ట్ - స్టోరీ బోర్డ్
Posted by Unknown on Sunday, March 04, 2012 with No comments
Saturday, 25 February 2012
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి స్మంస్మరణ
Posted by Unknown on Saturday, February 25, 2012 with 2 comments
ఈరోజు ప్రఖ్యాత కవి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వర్ధంతి.
ఆయన మా నాన్నగారు రాజమండ్రి లోమంచి మితృలు.
శ్రీ శాస్త్రిగారి షష్టిపూర్తి మహొత్సవ సంధర్భంగా 1942
ఆంధ్రవారపత్రికలో ప్రచురించబడిన ఈ ఆత్మబలి అనే ఈ
పెద్ద కధను పుస్తకరూపంగా కళాభివర్ధనీ పరిషత్తు వారు
(రాజమహేంద్రవరము) 1951 లో పుస్తక రూపంలో
ప్రచురించారు.
ఈ పుస్తకాన్ని శ్రీ శాస్త్రిగారు మా నాన్నగారు శ్రీ M.V.
సుబ్బారావుగారికి తను సంతకం (శ్రీ సుశాస్త్రి) చేసి
1-5-51 న ఇచ్చారు.
తెలుగు సాహితీలోకం తర్ఫున ఆ మహనీయుణ్ణి
స్మరించుకుంటూ శెలవు తీసుకుంటున్నాను.
వేదంలా ఘోషించే గోదావరి-అమరధామంలా రాణించే రాజమహేంద్రి !!
Posted by Unknown on Saturday, February 25, 2012 with 8 comments
రాజమండ్రి రైల్వే స్టేషన్
పుష్కర్ ఘాట్ లోగోదావరీ మాత విగ్రహం
పాత రైలు (మొదటి) వంతెన.
కొత్త రైలు వంతెన
లాహిరి లాహిరి లాహిరిలో -గోదావరిపై బోటు షికారు
ఆసియాలో పెద్దదైన రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ ( పైన రోడ్డు క్రింద రైలు మార్గం)
పుష్కరఘాట్ వద్ద శివలింగం షవర్ --కూడలిలో ఫౌంటెన్ వెనుక రైలు బ్రిడ్జ్
గోదావరి గట్టు పైన్ పార్కు ప్రక్క రోడ్డు.
పాత రైలు (మొదటి) వంతెన.
కొత్త రైలు వంతెన
లాహిరి లాహిరి లాహిరిలో -గోదావరిపై బోటు షికారు
ఆసియాలో పెద్దదైన రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ ( పైన రోడ్డు క్రింద రైలు మార్గం)
పుష్కరఘాట్ వద్ద శివలింగం షవర్ --కూడలిలో ఫౌంటెన్ వెనుక రైలు బ్రిడ్జ్
గోదావరి గట్టు పైన్ పార్కు ప్రక్క రోడ్డు.
Friday, 24 February 2012
మాటలతో ఆటలాడుకునే ముళ్లపూడి వెంకట రమణగారు
Posted by Unknown on Friday, February 24, 2012 with 3 comments
అవును రమణగారు బుడుగుతో మాటలాడించినా , అది హాస్యమాటయినా,సినిమా
డై "లాగ" యినా ఆపాత్రకు సరిపోయేటట్లు కుట్టి తొడిగే నిపుణుడైన టైలర్! పత్రికా
విలేఖరిగా సినిమా సమీక్షరాసినా అందులో చమత్కారాల ఘాటు వుండాల్సిందే!
డూండీగారు రక్తసంబంధం తీస్తూ మాటలు వ్రాయడానికి శ్రీముళ్ళపూడిని నిర్ణయిస్తే
పరిశ్రమలోని వారంతా ఆత్రేయలాటి వారు వ్రాయల్సిన ఈ సినిమాకు కామెడీలు
వ్రాసే అతనా అంటూ చెవులుకొరుక్కొని ఆనక సినిమాలో డైలాగులు చూశాక అదే
విన్నాక మళ్ళీ మరో మాటానలేక నోర్లు మూతపడ్డాయట! మాటలే కాదు "ప్రేమించి
చూడు" లాంటి సినిమాలకూ "బుచ్చబ్బాయ్ పని కావాలోయ్" లాటి పాటలూ అంత
నేర్పుగానూ వ్రాశారు.
వారం వారం స్వాతిలో తన ఆత్మకధను "కోతికొమ్మచ్చి"గా ఒక ఆత్మకధగా గాక
నవ్వులు కురిపిస్తూ తను ఎదుర్కొన్న కష్టాలను, మోసాలను కళ్ళకు కట్టినట్లు
పాఠకుల ఎదుట నిలిపి, అలా వచ్చే కష్టాలను ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో ఎలా
ఎదగాలో నేటి తరానికి చూపించారు. రమణగారు వ్రాసిన ఈ కోతికొమ్మచ్చి ఆడియో
సిడీగా విడుదలయిన మొదటి ఆత్మకధ అనే చెప్పాలి. ఈ ఆడియోకి యస్పీ బాల
సుబ్రహ్మణ్యం,కెఐ.వరప్రసాదరెడ్డి లాంటి ప్రముఖులు తమ గాత్రాన్ని అందించటం
మరో ప్రత్యేకత. అమెరికాలో పెరిగి తెలుగు మాట్లాడటమే తప్ప చదవటం అంతగా
రాని అభిమానులకోసం ఈ కోతికొమ్మచ్చి వచ్చి,ఈ ఆడియో ఎంతగానో ఆదరణ
పొందింది.
రమణగారు నేనంటే చాలా ఆత్మీయత చూపించేవారు. మా అమ్మాయి ఇంటికి చెన్నై
వెళ్ళీనప్పుడు ప్రతి సారీ ఆయన్ను ,బాపుగారిని కలసి రావటం అలవాటయింది. ఇక
ఆయనే కనీసం నెలకు ఒకటి రెండుసార్లయినా ఫోను చేసి కబుర్లు చెప్పేవారు. నా
కార్టూన్ల పుస్తకానికి ఆయన చేత ముందు మాట వ్రాయించాలని కోరిక వున్నా
అడిగే ధైర్యం లేక చాలాకాలం వరకు అడగలేదు. చివరకు ఒకసారి అడిగ్గానే వ్రాసి
పంపి రెండు రోజుల తరువాత మరొకటి వ్రాసి " ఇంతకు ముందు పంపినది అందినా
ఇదే వాడండి" అంటూ మరొకటి వ్రాసి పంపిన మహానుభావుడు. అందులో ఆయన
ఒక చోట ఇలా వ్రాశారు. "పొగపీలుస్తూ చక్కని కార్టూన్ పుస్తకాలు చూడడం- ద
అల్టిమేట్ జాయ్ ! దీనికి తోడు వెనకనించి-విన-బడే గులాం పాట...." ఇక్కడ ఆయన
బడేగులాంకు "విన" చేర్చి "వినబడే "గా చమత్కరించారు ! స్వాతిలో రమణగారి
అమ్మాయి శ్రీమతి అనూరాధ "నాన్న మామ మేము అను తోకకొమ్మచ్చి" వ్రాస్తూ
".......రాముడి పని పూర్తిచేశారుకాని...మరి నాపనో" అన్న మాటలు చదివగానే మళ్ళీ
కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. కారు డ్రైవరును వాళ్ళమ్మాయి షాపింగ్ చేస్తూఆలస్యంగా
భోజనానికి పంపిదన్న కోపంతో తను భోజనం ఛెయకుండా పడుకున్నారంటే రమణ
గారు తోటి మనుషులపై చూపించే ఆప్యాయత తెలుస్తుంది. రమణగారు ఎక్కడికీ
వెళ్ళలేదు.మన మన్నాంధ్యనే ఉంటూ నవ్వుతూ పలకరిస్తూనే వున్నారుఅని ధైర్యం
చెప్పుకుంటూ బ్రతికేస్తు
Thursday, 23 February 2012
ఇంద్రజాలం ! మహేంద్రజాలం !!
Posted by Unknown on Thursday, February 23, 2012 with No comments
ఈ రోజు ప్రపంచ ఇంద్రజాలికుల రోజు ! మన దేశంలో
పి.సి.సర్కార్ దేశవిదేశాల్లో ఐంద్రజాలికుల్లో అగ్రగణ్యుని
గాఖ్యాతిని పొందారు. ఆనాటి ఛందమామ పాఠకులకు
పి.సి.సర్కారు చిన్న చిన్న మాజిక్కులను ప్రతి నెలా
పాఠకులకు చెప్పేవారు. ఆయన కుమారుడు సర్కార్
జూనియర్ తండ్రి జాడలో నడుస్తుంటే ఆయన కుమార్తె
కూడా తండ్రితో పాటు మాజిక్ ప్రదర్శనలలో పాల్గొంటూ
రాణిస్తున్నారు ఆనాటి చందమామ సర్కార్ మాజిక్కులు
కధల రూపంలో కూడా కొంతకాలం ప్రచురించారు.
ఇక ఎందరో వివిధరంగాళ్ళొ వున్న వ్యక్తులు మాజిక్
కళను హాబీగా ఎంచుకొని ప్రజల్లో వున్న కొన్ని మూఢ
నమ్మకాలను తొలగించడానికి పయత్నిస్తున్నారు.
ప్రఖ్యాత సైకాలజిస్ట్ పట్టాభిరాం ఇంద్రజాలం ద్వారా
యువలోకాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నారు.
ప్రపంచ ఇంద్రజాల దినోత్సవ సంధర్భంగా ఇంద్రజాల
ప్రేమికులకు, ఇంద్రజాల మితృలకు శుభాభినందనలు..
Subscribe to:
Posts (Atom)


























