నాకు నిత్య జీవితంలో హాస్యంగా మాట్లాడట మంటే చాలా ఇస్టం.బ్యాంకులో
కూడా కొలీగ్స్ తో,కస్టమర్ల తో అలానే మాట్లాడే వాడిని.ఒక సారి ఓ కస్టమర్ని
డిపాజిట్ వేయమని అడిగితే,"ఎలాగండి, డబ్బంతా ఇంటి మీద పెట్టేసాం,సార్"
అని అన్నాడు."అదేంటి?! ఇంటి మీద పెడితే గాలొచ్చినా,వానొచ్చినా ప్రమాదం
కదా? దయచేసి మా బ్యాంకులో పెడితే సురక్షితం!"అన్నాను.ఆయన పెద్దగా
నవ్వి మర్నాడు డిపాజిట్ ఇచ్చాడు.అలానే నే అవార్డు స్టాప్ఫ్ గా వున్నప్పుడు
మా కాష్ ఆఫీసర్ "ఈ రోజు కౌంటర్ చెయ్యండి" అంటే "కార్పెంటర్ చేత చేయించు
కోండి" అని నవ్వుతూ అనే వాడిని.ఐనా అవతలి వారిక్కూడాఆ సెన్స్సఫ్ హ్యూమర్
లేక పోతే ప్రమోదం ప్రమాదంగా మారి పోతుంది.శ్రీ వరప్రసాదరెడ్డి,యమ్బీయస్.ప్రసాద్
గారి ప్రోత్సాహంతో మా బాంకు మితృడు డివీ.హనుమంతరావు నేను మా ఇంటి డాబా
మీద ప్రసాద్ గారు,యస్వీ.రామారావు గారి అధ్వర్యంలో ప్రారంభించాము.ఆ నాటి నుంచి
ఈ నాటి వరకు ప్రతి నెలా 3వ ఆదివారమ్ విజయవంతంగా నిర్వహిస్తున్నము.మాకు
సాహిత్య అభిమాని,రిటైర్డ్ పోస్ట్ మాస్టార్ శ్రీ ఖాదర్ ఖాన్ తోడు గానిలచారు.
నవ్వటం నిజంగా నవ్వులాట కాదు. నవ్వుల పాలవ కుండా మరొకర్ని కులాల పేరిట,
మతాల పేరిట నవ్వులపాలు చెయ్యకుండా నవ్వించడం మా హాసం క్లబ్ ధ్యేయం.నవ్వు
సహజమైన పైన్ కిల్లర్!నవ్వటానికి మన ముఖం లోని 17 కండరాలు పనిచేస్తే కోపం
వచ్చిన ముఖానికి 43 కండరాలకు పని చెప్పాలట! గత ఏడాది మా హాసం క్లబ్ వార్షి
కోత్సవం లో శ్రీ రావి కొండలరావు గారిని సత్కరించాము.శ్రీ కె.ఐ.వరప్రసాద రెడ్డి నా
సురేఖార్టూన్స్ పుస్తకాన్ని,హనుమంతరావు,నేను ఖాన్ రాసిన"నవ్వుల పందిరి" స్కిట్స్
పుస్తకాలను అవిష్కరించారు.ప్రతి నెలా కార్యక్రమాలలో హాస్యప్రియులు సకుటుంబంగా
పాల్గుంటున్నారు.అలనటీ ఆపాత మధురాలను యస్.కృష్ణారావు,సత్యనారాయణ గార్లు
ప్రతి కార్యక్రమం లోను క్రమం తప్పకుండా ఆలపిస్తారు.
ఎదుట మనిషిది ఏ భాషైనా,ఏ దేశం ఐనా మనకు ఎదురైనప్పుడు చిరునవ్వు చిందిస్తే
మనం వారికి ఆప్తులవుతాం.
మీరూ మీ ఊర్లో ఇలాటి క్లబ్ లేకుంటే వెంటనే ప్రారంభిస్తారని ఆశిస్తూ,
"నవ్వే జనా సుఖినో భవంతు"
********************************************************
మా హాసం క్లబ్ కబుర్లు:
హసం హాస్య, సంగీత పక్ష పత్రిక 2001 అక్టోబర్ 1వ తేదీన మొదటి సంచికను
శాంతా బయోటెక్నిక్స్ అధిపతి పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాదరెడ్డి గారు,శ్రీ యమ్బీయస్
ప్రసాద్ గారు మేనేజింగ్ ఎడిటర్ గా ప్రారంభించారు.మొదటి సంపాదకీయంలో"మాకు
చేతనైన రీతిలో హాస్యాన్ని,సంగీతాన్ని వీలైనంత ఎక్కువ మందికి అందించే ప్రయత్నం
చేస్తున్నాం.వివిధ ప్రాంతాలలో ఉన్న వివిధ వర్గాల పాఠకులు ఏదో ఒక మార్గంలో ఈ
అవకాశాన్ని వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశ.ఆరోగ్యం
అని ఎందుకంటున్నామంటే సేద తీరే మార్గాలు ఎన్నున్నా సరే అవి మోతాదు మించితే
హాని చేస్తాయి.హాస్యం,సంగీతం విషయంలో ఆ భయాలు లేవు.పైగా అవి కుటుంబ
సమేతంగా ఆనందించ తగ్గవి...." ఇలాటి మంచి పత్రిక డిసెంబర్ 2004,16 వ తేది
సంచిక ఆఖరి సంచిక అని శ్రీ వరాప్రసాదరెడ్డి గారు భాధాతప్త హృదయంతో సంపాదకీయమ్
వ్రాసారు."హాస్య,సంగీతాలపై అభిరుచి ఉన్నవారందరికీ"హాసం" గురించి తెలిసి,ఆదరించి
వుండి వుంటే ఈ లేఖ రాసే సంధర్భం వచ్చేది కాదు. తెలుగులో మంచి పత్రికలు రావని,
మంచి సినిమాలు రావని వాపోయే వారికి"ఇదీ దీనికి కారణం.ఈ ప్రతికూల ఆలోచనా ధోరణి
మారినప్పుడే మనకు మంచి కాలం" అని చెప్పడమే ఈ లేఖ ఉద్దేశ్యం అని ఆయన అన్నారు.
కాని హాసం అభిమానులు మాత్రం చాలా ఆవేదన చెందారు.అంతకు ముందు ఏప్రియల్ నెల
ఉగాది రోజున ఉదయం 10.30 గంటలకు రాజమండ్రి లో శ్రీ రామ్ నగర్లో మా ఇంట్లో హాసం
క్లబ్ శ్రీ యమ్బీయస్స్.ప్రసాద్, శ్రీ యస్వీ రామారావు ప్రారంభించారు. ఆ విషయాలు మరునాడు
చెప్పుకుందామా మరి......
0 comments:
Post a Comment