సంగీత సామ్రాజ్ఞీ, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత,భారతరత్న శ్రీమతి
యం.యస్.సుబ్బులక్ష్మిగతించి ఈ డిసెంబర్ 11 తేదీకి ఐదేళ్ళు గడుస్తున్నాయి.
ఆ మహా గాయనికి స్మృతి కవిత పేరిట నవంబర్ 2006 లో కవితా
సంకలనం వెలువడింది.అందులో డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం,లకుమ,
డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు,తనికెళ్ళ భరణి,డా.శిఖామణి,మొహమ్మద్
ఖాదర్ఖాన్ మొదలైన వారి కవితలతో బాటు నేను వ్రాసిన కవిత కూడా
చోటుచేసుకొనే అదృస్టం కలిగింది. ఈ సంధర్భంలో ఆ కవితను మీ అందరితో
పాలుపంచుకుంటున్నాను.
గాన సరస్వతి
యం.యస్.సుబ్బులక్ష్మి!
నేడు అమృతం సేవించే దేవతలకు
గానా అమృతం పంచుతున్నది!!
గాన సరస్వతి ముక్కెర మెరుపులతో
నింగి లోని తారల తళుకులు మసక బారాయి!!
నిన్నటిదాకా పుణ్యాత్ముల నెలవు కాదు స్వర్గం-
ఆమె రాకతో స్వర్గమే పుణ్యం చేసుకున్నది!!!
**********సురేఖ
మీ మాటలు అక్షర సత్యాలు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు సుమండీ !
ReplyDeleteధన్యవాదాలు
మీరు వినే ఉంటారు. విశ్వ సంగీతం లో తెలుగు వాడికి నచ్చిన రాజాజీ గారి కలం నుండి జాలు వ్రాలి, సుబ్బ లక్ష్మి గారి గాన మాధుర్యం తో అజరా మరమైన తమిళ స్తోత్రం.....
ReplyDeletehttp://www.youtube.com/watch?v=NXufcyf5f7g