
నిన్నటి బ్లాగులో శ్రీ ముళ్లఫూడి వెంకటరమణగారి పుట్టిన రోజు అని వ్రాస్తే కొందరు
                              మితృలు తప్పుగా వ్రాశావు, జయంతి అని వ్రాయాలి అన్నారు.  కానీ నా దృష్టిలోనే
                              కాదు రమణగారి అశేష అభిమానుల దృష్టిలో రమణగారు మన మధ్యే వున్నారు.
                              తన చమత్కారాల మాటలతో మనలను నవ్విస్తూ పలకిరిస్తూనే వున్నారు. అది
                              నిజమని నిన్ననే రుజువయింది ! 

                              బెంగుళూరు నుంచి మితృలు శ్రీ బి.విజయవర్ధన్ వారం రోజులక్రితం నాకు కొరియర్
                              చేసిన బాపు బొమ్మలకొలువు ప్రత్యేక సంచిక, మార్చి 6న మద్రాసులో జరిగిన బాపు
                              గారింట్లో జరిగిన సభ సిడీ , చికాగో నుంచి నా కజిన్ డాక్టర్ యం.యల్.హనుమదాస్
                              యం.డిపంపిన రమణగారి కోతికొమ్మచ్చిఆడియో సిడీ నిన్ననే ఆయన పుట్టిన రోజునే
                              నాకు చేరడం శ్రీ రమణగార్కి నా పై ఉన్న అపారమైన అభిమానానికి గుర్తు కాదా!
                              గత జనవరి  26న ఆయన పెళ్ళి రోజు శుభాకాంక్షలు పంపితే " నామీద మీకెంత
                              ప్రేమండీ ?" అంటూ ఫోనులో రమణగారు అన్న మాటలు ఇంకా నా చెవుల్లో విని
                              పిస్తూనే వున్నాయి. అవును, అందుకే ఆయన తన పుట్టిన రోజుకు తన అభిమాన
                              అభిమానినైన నాకు ఈ కానుకలను పంపించారు. ధన్యుణ్ణి రమణగారు.
                                      ( శ్రీ రమణగారి నవ్వుల తలపులు పంచుకుంటూ శ్రీ చంద్రశేఖర్, నేను, శ్రీ బాపు,
                                ప్రఖ్యాత కన్నడ చిత్ర నిర్మాత శ్రీ భక్త-- ఫొటొ శ్రీ బి.విజయవర్ధన్ , నిన్ననే
                                విడుదలయిన రమణగారి "ముక్కోతి కొమ్మచ్చి")


































 
 
 
 
 
 
 
 
 








