అవునండి ! ఈ రోజు మన బుడుగు వెంకట(రావు)రమణగారి పుట్టినరోజు పండుగ!
రమణగారి గురించి ఎన్ని సార్లు చెప్పుకున్నా అది నిత్య నూతనమే ! రమణగారు
తన కధను చిన్ననాటి నుంచి జరిగిన విశేషాలను కష్టాలను నష్టాలను కోతికొమ్మచ్చి
లాడినంత అందంగా ఆనందంగా చెప్పారు.ఆయన అంటారు--
"రెండు వందలు ఖర్చుపెట్టిన మేడలోంచి రెండు రూపాయల అద్దెకి ఒక మెట్ల
గదిలాటి దాంట్లో దిగాం....మెట్లమీద సామానులు సద్ది మెట్ల దారి మీదే పడు
కొనే వాళ్ళం. నలుగురు పడుకుంటే ఈ గోడనించి ఆ గోడకి సరిగ్గా సరిపోయేది"
అలా చిన్న మెట్లగదిలో పడుకున్న ఆయన పెద్ద విశాలమైనపాలరాతి మెట్లున్న భవంతిలో
తన మితృడు బాపుగారి ఇంటి పైన ఇల్లుకట్టుకొని వున్నారు.వాళ్ళిద్దరు ఒకరి గుండెల్లో
ఒకరు ఎలాగోఇళ్ళు కట్టుకున్నారు కదా!
రమణగారి మొదటి కధ "ఆకలి-ఆనందరావు ". 1953 లో ఆంధ్రప్రభ వార పత్రికలో అచ్చయిన
ఆ కధలో మద్రాసు నగరంలో ఓ నిరుద్యోగ యువకుడు ఓ కప్పు టీ కోసం, నీళ్ళకోసం చేసిన
సాహసాల ఇతివృత్తం !. ఆ కధతో శ్రీముళ్ళపూడి రచయితగా ఆరితేరారు. తరువాత 1954లొ
ఆంధ్రపత్రికలో చేరారు. ఆ రోజుల్లో ఆయన వ్రాసిన కధలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి.
" ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు", "ఏకలవ్యుడు", "రాధాగోపాళం", "ఋణానందలహరి",
"విక్రమార్కుడిమార్కు సింహాసనం", కధలు యాభైయ్యో దశకంలో ఆంధ్రవారపత్రికలో వచ్చి
అశేష పాఠకులకు రమణగారు అభిమాన రచయిత అయ్యారు.
రమణగారి చేత మొదటి సినిమా స్క్రిప్టు రాయించిన వారు శ్రీ డి.బీ.నారాయణ. " దాగుడు
మూతలు" చిత్రానికి ఆయన మాటలు వ్రాశారు. కాని ఆయన మాటలు వ్రాసిన రెండో చిత్రం
" గుడిగంటలు " ముందుగా విడుదలయింది. విషాద కధా చిత్రానికి ముళ్ళపూడి మాటలు
వ్రాయడమేమిటని విమర్శించినవాళ్ళే చిత్రంలోని ఆ సంభాషణలు చూసి ఆశ్చర్యపోయారు
మితృడు శ్రీ బాపుతో కలసి పూర్తి ఔట్ డోర్లో "సాక్షి" సినిమాతీశారు. ఆయన వ్రాసిన "బుడుగు-
చిచ్చుల పిడుగు" తొ పెద్దల,పిల్లల అభిమానాన్ని పొందారు. ఈటీవీలో శ్రీ రామోజీరావుగారు
బాపు దర్శకత్వంలో నిర్మాణమైన శ్రీ భాగవతం నకు సంభాషణలు, కొన్ని పాటలు సమకూర్చారు.
త్వరలొ రాబోయే "శ్రీరామరాజ్యం" చిత్రానికి స్కిప్ట్ అందించారు. శ్రీ రమణగారిని 2005 నుంచి
ఏడాదికి రెండు సార్లు కలిసే అదృష్టం నాకు కలిగింది. కనీసం నెలకు రెండు సార్లయినా ఆయన
నాకు ఫోను చేస్తుండేవారు. శ్రీ రమణగారు మంచి మనసుకు ఎన్నో ఉదాహరణలు. " హాసం"
పత్రికాధిపతులు పత్రికను వారికి పంపితే , ఉచితంగా వద్దంటూ చందాను పత్రికకు పంపారు.
రాజమండ్రి నుంచి వెలువడే ఓ పత్రిక సంపాదకుడు తన పత్రిక కాపీలను పంపితే మనీ
ఆర్డరు పంపుతూ M.O.ఫారం మీద ఇలా వ్రాశారు.
" భక్తి ప్రచారం కోసం మీరు చేస్తున్న కృషి పట్ల గౌరవంతో రెండు ఉద్ధరిణెలు@
పంపిస్తున్నాను. ఒకటిగానే భావించి ఒక్క కాపీయే పంపండి.ఇద్దరికీ చాలు"
ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే ! రమణగారు నాలాటి ఎందరో అభిమానుల గుండెల్లో
చిరంజీవిగా కలకాలం నిలచి ఉంటారు.
( @ ఉద్ధరిణె అంటే ఆయన దృష్టిలో సంచిక చందా 120 రూపాయలు !!)
baga rasaaru
ReplyDelete''అభిమాన అబిమాని''
ReplyDeleteఎంత బాగా రాసారు...
బాగా రాసారండి .
ReplyDeleteజీవితంలో కష్టాలు రుచి చూసి...వాటిలోంచి నవ్వుకోగలగడం...నవ్వించకలగడం
ReplyDeleteముళ్లపూడి వారికే చెల్లు..కోతికొమ్మచ్చి పుస్తకం టైటిల్ చూస్తే ఆట... లోపలకి వెళ్తే జీవిత సత్యాలు తెలిపే ఓ తాత్త్వికత దర్శనమిస్తుంది... M.V.Ramana గారిని M.V.Appa Rao గారూ ! మీ బ్లాగులో సంస్మరించడం బాగుంది..
chakkagaa- manasusuku haattukenelaa- mana ramana gaari gurinchi- smaristhoo-aayanaki namaskaristhoo raasaaru-apparao garu-aayana kalleduta 'darshanam'isthunnaaru naaku ee skshanamlo-meeku abhinanadanalandee -voleti venkata subbarao, vernon hills-IL/USA voleti306@gmail.com
ReplyDelete