కందుకూరి వీరేశలిగంగారు 1891లో రాజమండ్రి నడిబొడ్డున పురమందిరం (Town Hall )
నిర్మించారు. ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్నిచేరువ చేయడానికి తన
స్వంత ధనాన్ని వెచ్చించి గ్రంధాలయాన్నిఏర్పరిచారు.
ఇక్కడి గ్రంధాలయంలో పాత పత్రికలు, రీసెర్చ్ పుస్తకాలు, 1912 నుంచి ఆంధ్రపత్రికలు,
1920 నుంచి కృష్ణాపత్రికలు ఇక్కడ వుండెవి. ఇప్పుడో, ఈ పురమందిరం దీన స్థితి చూస్తే
తీరని బాధకలుగుతుంది. ఇక్కడ మన లిపి క్రీస్తు పూర్వం ఎలా వుందో తెలియజేస్తూ
గోడమీద వ్రాయబడి వుంది.
ఇప్పుడు ఇక్కడ శునకాలు విశ్రాంతి తీసుకుంటున్నాయంటే ఈ పురమందిరం నిర్వహణ
ఎంత గొప్పగా వుందో తెలుస్తుంది. మన ప్రజా ప్రతినిధులు, వారి భజనపరులు పదవుల
కోసం ప్రాకులాడటమే తప్ప వీరేశలింగం లాంటి మహనీయులు తమ ధనాన్ని వెచ్చించి
నిర్మించిన ఇలాటి నిర్మాణాలను రక్షించే ఆలోచనను చేయరు. మీ ఊరికి ఎయిర్ పోర్ట్
తెప్పించాం అంటూ గొప్పలు సభలు పెట్టి ఊదరగొడతారు తప్ప ఇలాటి పురాతన చిహ్నాలను
పదికాలాలబాటు భద్రపరచాలనే తలపే రాదు. భగవంతుడు మన రాజకీయనాయకులకు
మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ , కందుకూరి పురమందిరానికి పూర్వపు వైభవం
కలగడానికి పుర ప్రముఖులు కృషి చేస్తారని ఆశిస్తాను.
( చిత్రాలు ఈనాడు తూర్పుగోదావరి సౌజన్యంతో )
ప్చ్!
ReplyDeleteచాలా బాధాకరం. మా చిన్నప్పుడు ఇక్కడే వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు చాలా జరిగినపుడు వాటిలో పాల్గోడానికి వెళ్లేవాళ్లం. మళ్లీ ఆ స్మృతులు గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteఈ దీన స్థితి మన చారిత్రక సంపదను కాపాడలెని పాలకుల స్వార్థ రాజకీయాలకు,వారిని నిలదీసి పనులు జరిపించుకోలేని మన చాతకానితనానికి నిదర్శనం.
ReplyDelete