RSS
Facebook
Twitter

Friday, 31 December 2010

01-01-11/ఒకటీ, ఒకటీ,ఒకటొకటే !

అప్పుడే ఏడాది వెళ్ళి కొత్త ఏడాది వచ్చేస్తున్నది. కానీ ఎన్ని ఏడాదులు మారినా ఏమున్నది గర్వ కారణం ? గతానికి, ఇప్పటికీ ఏం మార్పూ లేదు ! నాయకులు మనల్ని ఏమార్పు చేశారు. మరికొందరు యువ నేతలు ఓదార్పులు చేశారు. సగటు మనిషి జీవితం అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే అని చెబుతున్నట్లు లేదూ రేపటితారీఖు !! ఎన్ని...

Wednesday, 29 December 2010

రాగ భావాల సరళి పింగళి

పింగళి నాగేంద్రరావుగారి పేరు గుర్తు రాగానే ఆయన విజయ చిత్రాలకు కూర్చిన అద్భుత సంభాషణలు, గీతాలకు కూర్చిన కమనీయ భావాలు మదిలో ఒక్కసారిగా మెదులుతాయి. పాతాళభైరవి చిత్రానికి మాంత్రికుడికి ఆయన వ్రాసిన సంభాషణలు యస్వీ రంగారావుకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు అందజేశాయి. "సాహసం శాయరా దీంగరి" అని తోటరాముడితో అనడం,అలానే రాణీగారి తమ్ముడి పాత్ర...

Tuesday, 28 December 2010

కాళీపట్నం రామారావు రచనలు

కారాగా పేరుగాంచిన శ్రీ కాళీపట్నం రామారావు గారి రచనలు మనసు ఫౌండేషన్ వారు చంద్రగారు గీసిన ముఖచిత్రం తో ప్రచురించారు. ఆయన శ్రికాకుళం లో కధానిలయం స్థాపించారు. ఈ సంపుటిలో 493 పేజీలొని "కాళీపట్నం రామారావు నేపధ్యం 2000" ను యధాతధంగా మీ ముందు వుంచుతున్నాను. <<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>...

Monday, 27 December 2010

నర్తన యజ్ఞాలు

హైదరాబాదులో వివిధ వయసులవారు "ధిల్లానా" నాట్యాన్ని ఏకకాలంలో 2800 మంది నృత్య కళాకారులు అభినయించి గిన్నిస్ సంస్థనుంచి ప్రపంచ రికార్డు ను అందుకొన్నారు. ఈ వార్త చదివిన తరువాత మా రాజమండ్రిలో గత పాతికేళ్ళనుండి విజయవంతంగా నిర్వహిస్తున్న డా" సప్పా దుర్గాప్రసాద్ గారి నటరాజ నృత్య నికేతన్ గురించి మీతో చెప్పాలనిపించింది...

Saturday, 25 December 2010

రాజమండ్రి సమీపంలోనున్న రావులపాలెంకు 26 కిలోమీటర్ల దూరం లో ఈ క్షేత్రం వుంది. అయినవిల్లి వినాయకుడు విఘ్నాలను తొలగించే స్వామిగా ప్రసిద్ధి చెందాడు. ఏ శుభకార్యం మొదలు పెట్టినా ఈ స్వామిని పూజిస్తే ఆ కార్యం జయప్రదం అవుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. గౌతమీ,వృద్ధ గౌతమీ గోదావరీ ప్రాంతంలో చల్లని కొబ్బరి తోటలమధ్య ఈ ఆలయం నిర్మించబడింది. విశాలమైన ఆవరణలో...

Wednesday, 22 December 2010

గణితంతో తధిగణితో !!

చిన్న వయసులోనే గణితంలో కీర్తి ప్రతిష్టలను పొందిన గొప్ప వ్యక్తి శ్రీనివాస రామానుజం పుట్టిన రోజు డిసెంబరు 22, 1887. ఆయన తమిళనాడులోని "ఈరోడ్" లో జన్మించారు. ఆయన తండ్రి ఓ వస్త్ర దుకాణం ( కుంభకోణం) లో గుమాస్తా పని చేసి కుటుంబాన్ని పోషించారు. పేద కుటుంబం లో పుట్టినా గణిత శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసిన ఆయన ప్రతిభను...

Monday, 20 December 2010

సలహాల్రావ్ సమాధానాలు !!

ఒకటో ప్రశ్న : పేనుపాలెం నుంచిశ్రీమతి మాతాశ్రీగారు తమ కుమారీశ్రీకి తలలో పేలు విపరీతంగా చేరాయని,ఎన్నోరకాల షాంపూలు, మందుల హేరాయిల్లు వాడినా పోవటంలేదనీ, మంచి సలహా చెప్పమని అడుగుతున్నారు. సలహాల్రావ్ : మాతశ్రీ గారు వాడల్సిన అసలైన మందు నే చెబ్తా! మీరు వెంటనే బ్రాందీగానీ,విస్కీగానీ...

Sunday, 19 December 2010

శ్రీ నండూరి రామమోహనరావు గారి ఆంగ్లనవలానువాదం గురించి నిన్న నేను చెప్పిన విషయాలకు మన బ్లాగరు మితృలనుంచి మంచి స్పందన వచ్చింది. సుజాతగారు టామ్ సాయర్ ప్రపంచయాత్ర గురించి గుర్తు చేశారు. హాసం ప్రచురణలు ప్రచురించిన ఆ పుస్తకంలో శ్రీ నండూరి రామమోహనరావు ముందు మాటగా చెప్పిన ""రచయిత మాట" మీ కోసం . ...

Saturday, 18 December 2010

1950-60 శకాలలో ఆంధ్రవారపత్రిక పాఠకులకు శ్రీ నండూరి రామమోహనరావు పేరు తెలియని వారుండరు. ఆ రోజుల్లో శ్రీ నండూరి ఆంధ్రవారపత్రికలో పిల్లల కోసం రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ " కాంచనద్వీపం" (TREASURE ISLAND) మార్క్ ట్వేన్ "టామ్ సాయర్", హకల్ బెరీ ఫిన్", "రాజూ పేద " ,"విచిత్రవ్యక్తి " (The Myysterious...

Friday, 17 December 2010

పుట్టినరోజు

"మీ పుట్టిన రోజు ఎప్పుడండీ?" అని అడిగితే " ప్రతి ఏడాదీ !" అన్నాడట ఓ చమత్కారరావు. నిన్న ( 15-12-10) మన బాపుగారి పుట్టిన రోజునే మన బ్లాగరు ఫణిబాబుగారి పుట్టిన రోజు కూడా ! నా పుట్టిన రోజు ముళ్లపూడి వారి పుట్టిన రోజుకు ఒక నెల ముందు , 10 సంవత్సరాల వెనుక! అంటే ఆయన పుట్టింది 28-జూన్1931, నేను పుట్టింది 28-మే,1941 !. ప్చ్! అలా మిస్సయ్యాను. ఐతేనేం విశ్వనట...

Thursday, 16 December 2010

నా " గందరగోళం" సీరియల్ నవల

ఆమావాస్యరాత్రి! రాత్రి పన్నెండయింది. కుమారి తన భర్త కోసం ఆతృతతో బాల్కనీలో నిలబడిఎదురుచూస్తున్నది. వెన్నెల నీడలో తోటలోని ఆశోక చెట్ల నీడలు దయ్యల్లా బాల్కనీ గోడల పై పడి భయం వేస్తున్నది. గాలికి కదిలే ఆ చెట్ల నీడలు మరింత భీభత్సంగా వున్నాయి. ఇంతలో కరెంటు పోయింది. హాల్లో సెల్ ఫోన్ మ్రోగింది. కుమారి ఆ చీకట్లోనే...

Wednesday, 15 December 2010

* అదేనండి , 15 డిసెంబరు 2010 మన బాపు గారికి రెండేళ్ళు (అంటే రమణ గారి చమత్కార మాటల్లో 77 అన్నమాట.) ఆయన 1945 " బాల" లో బొమ్మలు ( ఇక్కడ బాపు చిన్నప్పుడు "బాల"లో గీసిన బొమ్మ చూడొచ్చు) గీయటం ప్రారంభించి ఈరోజు అందాల బొమ్మాయిల సృస్ఠికర్త అవుతాడనీ, తెలుగు భాష రాత ,గీతలు రెండూ అపురూపంగా మారిపోతాయనీ,...

Tuesday, 14 December 2010

కమేరామాన్, దర్శకుడు, విక్రమ్ ఫిలిమ్స్ అధిపతి శ్రీ బిందినగబవాలే శ్రీనివాస్ అయ్యంగార్ తన 93వ ఏట చెన్నైలో కన్నుమూశారన్న వార్త "తెనాలి రామకృష్ణ" "అమరశిల్పి జక్కన" చిత్రాల అభిమాన ప్రేక్షకులకు బాధాకరమైన వార్త. ఎన్టీఆర్, ఏయన్నార్, శివాజీ గణేశన్, ఎమ్జీయార్, రాజ్ కుమార్ లాంటి ప్రముఖ నటులు ...

Monday, 13 December 2010

1950 జూన్లో మొదటి సారిగా ప్రచురించబడ్డ శ్రీశ్రీ "మహాప్రస్ఠానం" ఈ ఏడాది 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని షష్టి పూర్తి చేసుకొంటున్నది ! తెలుగులో ఇప్పటికి 30 సార్లు పునర్ముద్రణకు నోచుకొన్న పుస్తకం ఇదే కావొచ్చు. మహప్రస్థానం పుస్తకానికి "యోగ్యతాపత్రం" పేరిట ముందు మాటను ప్రఖ్యాత ...

Sunday, 12 December 2010

నిద్ర పోరా తమ్ముడా!

రాత్రవగానే మనం నిద్ర పోతాం. కొందరికి నిద్ర పట్టదు.ఆ లోచనలు ఎక్కువైనా, డబ్బు జబ్బు చేసినవాళ్ళకీ, నిద్ర పట్టదు. కొందరు ఆ నిద్రకోసం నిద్ర మాత్రలు వాడుతుంటారు. ఆకలి రుచెరెగదు , నిద్ర సుఖమెరుగదు అంటారు కదా! బాగా పని చేసాక గాఢ నిద్ర పడుతుంది. ఇంట్లో హాయిగా మెత్తని...

Saturday, 11 December 2010

గత చిత్రాలలో హాస్య సన్నివేశాలు, వాటిలోని పాత్రలు కధనంలో మిలితమయి వుండేవి. సినిమా చూసి ఇంటికి వచ్చాక ఆ దృశ్యాలను గుర్తుకు తెచ్చుకొని నవ్వికొనే వాళ్ళం! ఆ నవ్వుల ఘట్టాలు కలకాలం గుర్తుండిపోయేవి. వాటి కోసమే సినిమాలకు రిపీటెడ్ ఆడియన్స్ హాల్ల ముందు బారులు తీరే వారు. ...

Friday, 10 December 2010

బాపు - రమణ -బొమ్మలు - కధలు

శ్రీ బాపు, ముళ్లపూడి వెంకట రమణ గార్లు కలసి మెలసి 60 ఏళ్ళ క్రితం ( పత్రికా లోకంలో స్వర్ణ యుగమనే చెప్పాలి) వివిధ పత్రికలలో గీసి రాసిన ఆణిముత్యాలన్నీ పుట్టల్లాంటి పెట్టెల్లోంచి త్రవ్వి తీసి 464 పేజీల గట్టి " అట్ట " హాసం తో "మంద " హాసంగా అచ్చొత్తి రచన శాయి గారు అభిమానులకు అందించారు. 1960 ల నుంచి ...
  • Blogger news

  • Blogroll

  • About