RSS
Facebook
Twitter

Sunday, 31 January 2010

బాపు రమణ గార్లు ముత్యాల ముగ్గు ఎంత అందంగా తీసారో అంత ముచ్చట గా వంద రోజుల ఆహ్వానం వేసారు! కాంట్రాక్టర్ వంద రోజుల పండక్కి తన భాషలో పిల్చాడు . మిరే చిత్తగించండ...

Thursday, 28 January 2010

కినిమా పజిల్

1963 అంటే 47 ఏళ్ళక్రితం నేను మద్రాసు నుంచి మధుమూర్తిగారి సంపాదకత్వం లో వారపత్రికగా వెలువడిన "కినిమా" అనేపత్రికలో వారం వారం సినిమా పజిల్స్ వేసేవాడిని.ఆ నాటి నాపజిల్స్ రెంటిని ఇక్కడ ఇస్తున్నాను.అందులో ఒకటి సినీ నటిశ్రీమతి జమున పూర్తీ చేసి జవాబు పంపారు.రెండో పజిల్ చూడండి.ఇందులో మొదటి బొమ్మలో అక్కినేని,తరువాత లక్ష్మిదేవి వరాలు పొందుతున్నభక్తుడు,ఆఖరి బొమ్మలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్...

Wednesday, 27 January 2010

పద్మశ్రీలు

ఈ ఏడాది ప్రదానం చేసిన పద్మ అవార్డులు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చాలా నిరాశాజనకంగా ఉన్నాయి.అన్యధా భావించకపోతే ప్రభుత్వం దృష్టిలో చొక్కాలు విప్పుకొని అర్ధనగ్న ప్రదర్శన చేసే హీరోలే (ఈ మధ్య ఆందోళన లలో కూడా అర్ధనగ్న ప్రదర్శన కూడా ఓ ఫాషనై పోయింది) ఈ బిరుదులకు అర్హులేమో!నిన్న దిగవంతులైన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వీళ్ళ దృస్టికి రాక పొవడం మన తెలుగువాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం కాక మరేమిటి?...

Tuesday, 26 January 2010

Happy Annivarsary Ramana garu

ఈ రోజు 26-01-2010 న 46వ వివాహ వార్షికోత్సవంజరుపుకుంటున్న శ్రీ ముళ్లపూడి వెంకట రమణ,శ్రీమతిశ్రీదేవి దంపతులకు మన బ్లాగర్లందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నా...

Monday, 25 January 2010

ఆ నాటి కుర్చీ కబుర్లు

ఇక్కడ మీరు చూసే ఈ కుర్ఛి ఆ కుర్ఛీ మీద దర్జాగా కూర్చున్న ఫొటోకి ఓ కధ వుంది. ఇప్పుడా ఫొటోలో వున్న కుర్చీయే ఆ కుర్చి. ఇక ఆ ఫొటోలో వున్నది మా నాన్నగారు,అమ్మగారు, అక్కయ్య వరలక్ష్మి సరోజిని. ఇప్పుడు వైజాగ్లో వుంది.ఆ ఫోటో మా అక్కయ్య కు మూడేళ్ళ వయస్సప్పుడు తీసింది. విచిత్రం ఏమిటంటే ఇంకా ఆ కుర్ఛీ మా ఇంట్లో క్షేమంగా ఉంది.మొన్న ఆదివారం (17-01-10) న మన సాహిత్యాభిమాని బ్లాగర్ శ్రీ శివరామప్రసాద్...

Saturday, 23 January 2010

కుడి ఎడమైతే పొరబాటు కలదోయ్!

ఏమిటీ అలనాటి దేవదాసు తాగకుండా పాడేస్తున్నాడేమో నని ఆశ్సర్యపడుతున్నారా?! అసలు కధ ఏమిటంటే 1950 ప్రాంతాలలో పోస్టల్ శాఖచేత విడుదలయిన ఒక అణా (నేటి విలువ ఆరు పైసలు) భొధిస్వతునిబొమ్మతో వచ్చిన స్టాంప్ ఒక సారి కుడి వైపు తిరిగి కూర్చున్నట్లు మరోసారి ఎడమవైపు కూర్చున్నట్లు వచ్చింది. అటు తరువాత తప్పును కనుక్కొనిఎడమవైపుగా వున్న స్టాంపును పోస్టల్ శాఖ తొలగించిందట. అలా కుడిఎడమలతో విడుదలయిన...

Thursday, 21 January 2010

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి భరతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం "మాదీ" వింధ్య హిమవత్ శ్రీ నీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి గంగా గోదావరీస హ్యాజా తుంగతరింగిత హృదయాల్ మావి "మాదీ" ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూత నేతిహాసం "మాదీ" అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర.... ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధి గౌతముల...

Monday, 18 January 2010

జనవరి 18 వ తేది నందమూరి తారక రామారావు గారి 14 వ వర్ద్హంతి.తెలుగు సినీ పరిశ్రమలో యన్టీఆర్,ఏయన్నార్ ఒకరికి ఒకరు పోటీగా వివిధ పాత్రలలో నటించి తెలుగు సినిమాకు రెండు కళ్ళుగా ఈ నాటికి పరిశ్రమ చేత ,అశేష ప్రేక్షక అభిమానులచేత ప్రశంసలు పొందారు. శ్రీ రామారావు శ్రి కృష్ణుడు,శ్రీ రాముడి పాత్రల్లో దేముడి రూపం ఇంత సౌందర్యంగా వుంటుందనే భావన ప్రెక్షకుల్లో నిలచిపోయింది.ఇక అక్కినేని మొదట్లో...

Sunday, 17 January 2010

అలా కలిశాం

నాకు ఇవ్వాళ ఆనందకరమైన రోజు. ప్రియ (బ్లాగు) మిత్రుడు శ్రీ శివరామ ప్రసాదు గారు మా ఇంటికి వచ్చారు . ఇంతకాలం బ్లాగుద్వారా మాత్రమె పరిచయమే కాని కలుసుకున్నది లేదు. ఈ రోజు మాత్రం శివ గారు మా ఇంటికి వచ్చి నన్ను కలుసుకుని ఆయన ఆనందించారు, నాకు ఆనందాన్ని ఇచ్చారు. మేము కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలమే తెలియలేదు. అలాఅలా చాల సమయం గడిచిపోయి, అరె ఇంతసేపు మాట్లాడేసు కున్నామా అని ఇద్దరం...

Wednesday, 13 January 2010

ఈ ఫొటోలు చూస్తున్నారు గదా! ఇదేమిటి ఈ మనిషి ఫొటో పుతిన్ తన మీటింగ్ హాల్లో ఎలా పెట్టుకున్నాడా అని ఆశ్చర్య పడకండి.ఆ కధ చెబుతా.2003లో మా రాజమండ్రి లో జరిగిన గోదావరి పుష్క రాలకి పుతిన్ రహస్యంగా వచ్చి గోదావరిలో స్నానం చేస్తూ జారి పడ్డాడు.ఆయన పెట్టిన కేకలు విని నే ధైర్యంగా వెళ్ళి బయటకు లాగాను. "నేను రష్యన్లో అరిస్తే ఎలా అర్ధమయింది?" అని పుతిన్ అడిగాడు. "నాకు మీ అరుపులు అమ్మోయ్,నాయనోయ్...

Thursday, 7 January 2010

ప్రముఖ కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ గారి కార్టూన్లు చక్కని గీతల్తో అద్భుతంగా ఉంటాయని వేరే చెప్పాలా!కొత్త సంవత్సరానికి మంచి సందేశంతో ఆయన మితృలకు పంపిన కార్టూన్ మీ అందరితో పంచు కోవాలనే కోరికతో ఇక్కడ వుంఛాను.గతంలో ఆయన తన సంతకంతొ అమ్మాయి జడతో గీసిన బొమ్మ చూసేవుంటారు. ఈ సారి శ్రీ జయదేవ్ 2010ని తన బొమ్మలో చూపించారు.రీడర్స్ డైజెస్ట్ లాంటి అంతర్జాతీయ పత్రికలో ఆయన చిత్రాలు చోటు చేసుకున్నాయంటే...

Friday, 1 January 2010

చెత్త కబుర్లు

తెలుగు బ్లాగర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .. సంవత్సరపు మొదటి రోజు ఈ చెత్త కబుర్లేంటా? అని అనుకుంటున్నారా? ఒక్కోసారి చెత్త కబుర్లు కూడా వింటానికి బాగానే ఉంటాయి! నిజమండి!! ఏమిటీ చెత్త కబుర్లను కుంటున్నారా? ఈ నాటి సినిమాల్లోని హాస్యం చూడండి! చెత్త గా ఉండటములే! ఆ చెత్త చూసి మన జనాలు పడీ పడీ నవ్విపోటంలే! ఇల్లరికం సినిమాలో రేలంగి మామ రమణారెడ్డి తొ ఏదోలే మామయ్యా, రెండు రాత్రులుండి పోవాలని వచ్చా అంటాడు.అప్పుడు అత్తగారు అదేమిటి నాయనా,రెండు రోజులేనా?...
  • Blogger news

  • Blogroll

  • About