RSS
Facebook
Twitter

Wednesday, 28 April 2010

కవులు వర్ణించిన ఆ నాటి ప్రభంధ కన్యలు నిజంగా అలానే ఉంటే ? ! ఎలా వుంటుందో ఊహించండి. మన తెలుగులో మొట్టమొదటి కార్టూనిస్ట్ శ్రీ తలిశెట్టి రామారావు 1931 లో ఆంధ్రపత్రిక ఉగాది వార్షిక సంచికలో కవులు వర్ణించిన స్త్రీ రూపాన్ని ఊహించి చిత్రంగా గీసారు. ఈ చిత్రాన్ని నాకు మితృలు, "రచన" శాయిగారు పంపిచారు....

Tuesday, 27 April 2010

ఈ టీవీ 2 లో నేను !

గత మార్చి లో ఈటీవీ -2 వారు నా పుస్తకాలు,రికార్డులు, స్టాంపు,నాణేల సేకరణ గురించి చిత్రీకరించి ప్రసారం చేసారు.. ఆ ప్రసార విశేషాలు .. ...

Monday, 26 April 2010

"హాస్యబ్రహ్మ" భమిడిపాటి కామేశ్వరరావుగారి గురించి ఇదివరలో వ్రాసాను. ఆయన అబ్బాయి శ్రీ భమిడిపాటి రాధకృష్ణ గారు పండిత పుత్ర శుంఠహ: అనే నానుడి తప్పని రుజువు చేసారు. ఆయన హాస్యరచయితగా ఎన్నో నాటకాలు వ్రాసారు. అలానే దాదాపు డెభై తెలుగు సాంఘిక సినిమాలకు కధా మాటలు కూర్చారు. ’బ్రహ్మచారి’, ’భలే కోదళ్ళు’, "వింత కాపురం",...

Sunday, 25 April 2010

" శ్రీ శ్రీ పుట్టిన తేదీ 15-4-1910 కావచ్చు.లేదా 30-4-1910 కావచ్చు. అతడు మాత్రం తాను 2-1-1910 నాడు జన్మించానని విశ్వసించాడు.ఇది శ్రీశ్రీగా సుపరిచితుడైన శ్రీరంగం శ్రీనివాసరావు జన్మ విశేషం. ఒక పరిశోధకుడి ప్రకారం శ్రిణివాసరావు సాధారణ నామ సంవత్సర చైత్ర శుద్ధ సష్టినాడు- అంటే 1910 ఏప్రియల్ 15వ తేదీన జన్మించాడు . ...

Saturday, 24 April 2010

యాడ్స్ ! యాడ్స్ !! యాడ్స్ !!!

ప్రకటనలు ! ప్రకటనలు ! ఈ రోజు పత్రికలలోను, టీవీ, రేడియోలలో ,రోడ్డు పై పెద్ద పెద్ద హోర్డింగులలోను మనకు ప్రకటనలు అడుగడుగునా అగుపిస్తున్నాయి. ఇక సినిమాలహాళ్ళలో సినిమాకు ముందర చూస్తున్నాం. ఇలా వ్యాపార ప్రకటనలు ఓ పత్రికలో మనం చూసినప్పుడు మేటర్ తక్కువ యాడ్స్ ఎక్కువ అని అనుకుంటుంటాము. ఎక్కువ మంది చదివే పత్రికలకు ఈ ప్రకటనలు ఎక్కువగా...

Friday, 23 April 2010

"రోజులు మారాయి" సినీమాలో ’ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న పాట ఆ రోజుల్లో నే కాదు, ఈనాటికీ మరచిపోలేము. జిక్కీ పాడిన ఆ పాటలో మొదటిసారిగా తెలుగు తెర పై అగుపించిన పదహారేళ్ళ అమ్మాయి అందర్నీ ఆకర్షించింది. ఆ అమ్మాయే హిందీ తెరపై ఓ వెలుగు వెలిగిన వహీదా రెహ్మాన్. వహీదా గోదావరీతీరం (రాజమండ్రి) నుంచే సినీమాతెరకు పరిచయమైంది....

Thursday, 22 April 2010

అందాల గోదావరిని చూడాలంటే మనం రాజమండ్రి వెళ్ళాలి.లేకుంటే కోనసీమ వెళ్ళాలి. ఎక్కడికీ వెళ్ళకుండా మనం ఎక్కడున్నా,చివరకు ఏ అమెరికాలాటి విదేశాల్లో వున్నా ప్రముఖ దర్శకులు శ్రీ వంశీ సినిమా చూస్తే చాలు అందాల గోదావరి బిరాబిరా వచ్చి మన ఎదుట ప్రత్యక్షమవుతుంది. ఆ కమనీయ నదీ తీరంలో రకరకాల మనుషుల్ని వాళ్ళ మాట తీరును మనం వాళ్ళతో...

Tuesday, 20 April 2010

’హాస్యబ్రహ్మ’ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు 1897 ఏప్రియల్ ౩౦వ తేదిన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు లో జన్మించారు. బి.ఏ గణిత శాస్త్రం చదివి రాజమండ్రి కందుకూరి వీరేశలింగం హైస్కూల్లో లెక్కల మాస్టారుగా,ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి 1953 లో ఉద్యోగవిరమణ చేశారు. ఎన్నో హాస్య రచనలు, నాటకాలే కాకుండా ఆంధ్రనాటక పద్య పఠనం,త్యాగరాజు ఆత్మవిచారం...

Monday, 19 April 2010

సినీమా ( యా ) వినోదం

పూర్వం సినిమాలు నిర్మించడానికి దాదాపు రెండు మూడేళ్ళు పట్టేది. స్క్రిప్ట్, సంగీతం విషయాల్లో ప్రత్యేక శ్రర్ధ తీసుకొనేవారు. అలానే నటీనటుల తమ స్వంత గొంతుతోనే సంభాషణలు చెఫ్ఫెవారు. మొదట్లో పాటలు కూడా పాడగల ప్రావీణ్యం వున్న వారికే అవకాశం వుండేది. ఆ రోజుల్లో నిర్మించిన చిత్రాల్లోని నటుల స్వరాన్ని బట్టి హాల్లోకి...

Sunday, 18 April 2010

ఈనాడు ఆదివారం

’రేపు శలవు రావాలంటే ఈ రోజు ఏం కావాలో చెప్పగలరా ? ఏ ముంది, ఈ రోజు ఏ నాయకుడో పరలోకయాత్రయినా చేయాలి, లేకుంటే పనిలేని ఏ రాజకీయ రాబందో మొన్న మరో రాజకీయపార్టీ జరిపిన బందుకు నిరశనగా మరో బందు జరపాలి అనుకుంటూన్నారా ! అవేవీ కావండీ ! రేపు శలవు రావాలంటే ఈ రోజు శని వారం అవ్వాలి.! కాదంటారా ! ఆదివారం...

Saturday, 17 April 2010

’జ్యోతి’తో జ్యోకాభిరామాయణం ఈ రోజు మనం అలనాటి ’జ్యోతి’లోని కొన్ని ’జ్యోకు’లను గుర్తుచేసుకొందాం ! * * * * * * * * * చి (ట్రి) క్కు ప్రశ్న "అయిదుగురు కుర్రాళ్ళు ఒకే గొడుగులో దూరి నడుస్తున్నారు, వారిలో ఎవరు తడుస్తారో చెప్పు" "తెలియదు ఎవరు ?" "ఎవరూ తడవరు. వాన లేందే ? " ...

Friday, 16 April 2010

ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ పుట్టిన రోజు ఈరోజు చార్లీచాప్లిన్ అసలు పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్.ఆయన లండన్లో 1889 ఏప్రియల్ 16 న జన్మించాడు. తల్లి తండ్రులిద్దరూ కళాకారులే. చార్లెస్ చిన్న తనంలోనే తండ్రి మరణించాడు. చిన్న తనంలో చాప్లిన్ బీదరికం తో కష్టాలు పడ్డాడు. 1913 లో "ఫ్రెడ్కార్నో కంపెనీ" చాప్లిన్ను ఓ ముఖ్య వేషానికి ఎన్నికచేసి అమెరికాకు...

అడ్డమైన మంచి రాతలు !

శ్రీ ముళ్లపూడి వేంకట రమణ గారు ’స్వాతి’లొ వారం వారం ఆయన వ్రాసే ’కోతి కొమ్మచ్చి’లో ఆయన భాషలోనే ’అడ్డమైనరాతలు’ వ్రాస్తున్నారు. ఈ వారం అయన వ్రాసిన ’అడ్డమైన రాతలు’ నాకు విపరీతంగా నచ్చేసి, ఇక్కడ నేను గీసిన ఓ ’అల్లరి బుడుగు’కార్టూన్తో బాటు, ముళ్లపూడి వారి అపురూపమైన ఫొటో ( రచన శాయి గారి సౌజన్యంతో) కూడా...

Thursday, 15 April 2010

ఈనాడు ’ఈనాడు’ చూడగానే "నవ్వండి..నవ్వించండి.. జీవించండి అన్న శీర్షికతో ఒక ఆర్టికల్ కనిపించింది. దరహాసంతో మరో ఏడేళ్ళు ఆయుష్షు పెరుగుతుందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసిందట. అందుకే మనకు రాజులకాలం నుంచి వాళ్ళ ఆస్తానంలో విదూషకులు ఉండే వారు. క్రిష్ణ్దేవరాయల ఆస్తానంలో తెనాలి రామ క్రిష్ణ కవి, అక్బర్ దగ్గర బీర్బల్ ఉండేవారని...

Wednesday, 14 April 2010

నవ్వుల సందడి

మన టీవీ చానెల్లకు,న్యూస్ పేపర్లకు ఏదో ఓ విషయం దొరికిందంటే ఇక ఆ సుబ్జెక్ట్ మీదే ఊదరగొట్టేస్తుంటారు. కొంతకాలం నిత్యానందమ్ గొడవ. టీవీ ఆన్ చేస్తే బెడ్రూమ్ గొడవే!.ఇప్పుడు సానియా, షోయబ్ల పెళ్ళి కబుర్లు! అమ్మయ్య! పెళ్ళయింది అనుకుంటూంటే ఇప్పుడు మెహందీట.తరువాత మరోటి.హనీమూన్ విశేషాలు! దీనికీ ...

Tuesday, 13 April 2010

మా ఊరి కధ

రాజమహేంద్రవరం ఆంగ్లేయుల కాలంలో రాజమండ్రిగా రూపాంతం చెందింది. ఒక నాడు వేంగి చాళుక్యుల రాజధాని నగరంగా వెలిగి రాజరాజనరేంద్రుని పాలనలో కళలకు పుట్టినిల్లుగా కీర్తిని పొందింది. కవిసార్వభౌమ్యుడు శ్రీనాధుడు ఈ నగరంలో కొంతకాలం నివాసముండి తన సారస్వత కార్యక్రమాన్ని కొనసాగించాడు. ...

Monday, 12 April 2010

కాశీమజిలీ కధల కధ !

ఇది వరలొ మనకు 'బాల','చందమామ' పత్రికలు లేనప్పుడు రాజమండ్రికి చెందిన మధిర సుబ్బయ్య దీక్షితులు వ్రాసిన 12 భాగాల కాశీమజలీ కధలు చదివి, అమ్మమ్మలూ, తాతయ్యలు తమ మనవలకు, మనవరాళ్లకు చెప్పేవారు. 19 శతాబ్దంలో ఆ నాటి పాఠకులను ఈ కధలు ఉర్రూతలూగించాయి.ఈ కాశీమజిలీ కధలు దక్షిణ కాశీ అని...

Sunday, 11 April 2010

1963 జనవరి 26వ తేదీన శ్రీ అక్కినేని చేతుల మీదుగా 'జ్యోతి' నవర(మా)స పత్రిక ప్రారంభమయింది. సర్వశ్రీ బాపు,ముళ్లపూడి, నండూరి రామమోహనరావు, ఆరుద్ర,వి.ఏ.కె.రంగారావు,రావి కొందలరావు,కీ"శే" యమ్వీయల్ మొ" అతిరధ మహారధుల సారధ్యంలో వెలువడిన 'జ్యోతి' ప్రతి పేజీ ఒక రస గుళికే!ఆనాటి"జ్యోతి' శ్రి కృష్ణ జయంతి...

Saturday, 10 April 2010

'మూగ మనసులు' చిత్రంలో ఆచార్య ఆత్రేయ గీతం 'పోయినోళ్లందరూ మంచోళ్లూ, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు'అని ఘంటసాల గాత్రం 'పాడుతా తీయగా చల్లగా' ఎంత కమనీయంగా ఆలపించిందో, అలాటి ఎన్నో పాటలుగల చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావుగారు రాజమండ్రిలో 1921లో జన్మించారు.ఆయన తొలి చిత్రం 'అమర సందేశం' చూసిన అన్నపూర్ణా సంస్ధ తాము శరత్బాబు నవల 'నిష్కృతి'...
  • Blogger news

  • Blogroll

  • About