RSS
Facebook
Twitter

Friday, 28 May 2010

మా "హాసం క్లబ్" వార్షికోత్సవానికి శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారి శుభాకాంక్షలు ఓ హాసం క్లబ్బూ ! పరిహాసాన్ని సుందర దరహాసంగా ఏమార్చి నవ్వులు గుబాళించే హహహహ ! హమామ్ సబ్బూ ! ను - వ్వొస్తానంటే న - వ్విస్తానంటే నేనొద్దాంటానా ! ఆకూవక్కా సున్నంలాగే జోకూ నేనూ నువ్వూ కలిస్తే ...

Thursday, 27 May 2010

అప్పు తుచ్చులను అక్షరాలు అక్షరాలా ఖూనీ !! అచ్చులో అక్షరాల కూర్పులో తప్పులు దొర్లినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కో సారి భావమే పూర్తిగా మారిపోయి నవ్వూ తెప్పించవచ్చు , కొందరికి కోపం కలిగించవచ్చు. అచ్చయే ముందు ప్రూఫ్ ను తీసి అందులో తప్పులులను దిద్దేవారు. వాళ్ళని ప్రూఫ్ రీడర్స్ అంటారు. అలాజాగ్రత్తగా తప్పులను దిద్దినా ఇంకా...

Tuesday, 25 May 2010

పేరులో " నేముంది " ?

పేరులో "నేము" ముంది ? ! మన రూపాలు దేశాలు, రాస్ట్రాలు ,పరిసరాలబట్టి వేరు వేరుగా వున్నా మనను గుర్తించడానికి మనవాళ్ళు పేర్లు పెట్టారు. అంతెందుకు మనుషులకే కాకుండా ,జంతువులకు, పక్షులకు, రక రకాల వస్తువులకు కూడా వివిధమైన పేర్లుంటాయి. ఇక ఊర్లకు పేర్లుంటాయి. సముద్ర తీరాలు దగ్గర గల ఊర్లకు విశాఖపట్నం, మచిలీ...

Saturday, 22 May 2010

కడియం నందన వనాలు

మొక్కలు మనకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. అంతే కాదు మనకు పండ్లను ,కాయగూరలను అందిస్తాయి.రకరకాల రంగురంగుల పూలను అందిస్తాయి. వాతావరణము లోకి ఆక్సిజన్ను వదలి కార్బన్ డైయక్సైడ్ను తీసుకుంటాయి. ఎన్నోరకాల పూలమొక్కలను పెంచే నర్సరీలకు ఆదాయాన్ని, ఎంతో మందికి జీవనోపాధిని అందిస్తున్నాయి. రాజమండ్రికి సమీపంలో (తూర్పు గోదావరి జిల్లా) కడియం,కడియపులంకలలోగల నర్సరీలు ఇందుకు నిదర్శనం. అపార్ట్మెంట్ సంస్కృతి...

Friday, 21 May 2010

రోజులు మారాయి. పూర్వపు రోజుల్లో బాంకు నుంచి డబ్బులు తీసుకోవాలంటే బాంకు పనిచేసే టైములోపలే తీసుకోవాల్సి వచ్చేది. మరిప్పుడో, అర్ఢ రాత్రి, అపరాత్రి మనకు ఇష్టం వచ్చినప్పుడు డబ్బు తీసుకొవచ్చు.( అదేలెండి ! మన ఖాతాలో బాలన్స్ ఉంటేనే !!). అదేకాదు, మనం ఏ ఊరెల్లినా అక్కడే డబ్బు తీసుకొనే సదుపాయం వచ్చింది. అదే ఏటీయం.! ఈ యంత్రాన్ని ( ఆటొమేటెడ్ టెల్లర్ మిషన్)...

Thursday, 20 May 2010

ఆంధ్ర కేసరి

మనదేశం లో ఒకేసారి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి పదవిని అలంకరించడమే కాకుండా ప్రసిస్ధి చెందిన నాగార్జునడామ్ లాంటి భారీ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన నీతిమంతుడయిన ఏకైక ముఖ్యమంత్రి ’ఆంధ్ర కేశరి ’ టంగుటూరి ప్రకాశం గారు అన్న విషయం ఈ తరం వారికి చాలామందికి తెలియకపోవచ్చు. జాతీయ స్ధాయిలో గుర్తింపు పొందిన...

Tuesday, 18 May 2010

" మండే " ఎండలు !!

ఈ ఎండాకాలం ఎప్పుడు ఎండవుతుందో ! అంటూ ఈ రోజుల్లో ప్రతి వాళ్ళూ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. ఐనా మనకు ఏ కాలం నచ్చుతుంది చెప్పండి. వర్షాకాలం వచ్చాక, పాడు వర్షాలు ఇంట్లోంచి కదలటానికి లేదు. ఆ ఎండాకాలమే నయం. హాయిగా ఉక్కపోసి చమట పట్టినా షవరుక్రింద స్నానం ఎన్నిసార్లు చేసినా ఎంతో’ హాయిగా వుండేది. ...

Monday, 17 May 2010

ఎంతమందో శాస్త్రవేత్తలు మనం ఈ నాడు అనుభవిస్తున్న ఎన్నో వస్తువులను కనుగొన్నారు. వాళ్ళందరిలో నాకు చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టమైన శాస్త్రవేత్త ధామస్ అల్వా ఎడిసన్. ఈ రోజు మనం చీకట్లో వెలుగును చూస్తున్నామంటేనూ, మాధుర్యమైన పాటలను, సంగీతాన్ని వీనులవిందుగా ఆనందిస్తున్నామంటేనూ, అలనాటి ప్రముఖుల స్వరాన్ని...

Sunday, 16 May 2010

దామెర్ల మెమోరియల్ ఆర్ట్ గాలరీ, రాజమండ్రి ఆంధ్రదేశ చిత్రకళావైభవానికి వన్నెతెచ్చిన చిత్రకారుల్లో దామెర్ల రామారావు ఒకరు. అంతటి కళాకారుడు జీవించినది అతి కొద్ది కాలమైనా ( ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులోనే ఆయన అకాలమరణం చెందారు).ఆ కొద్ది కాలంలోనే చిత్రకళకు ఆయన చేసిన సేవ మరువలేనిది. గోదావరి రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఆనంకళాకేంద్రం వెనుక శ్రీ రామారావుపేరు మీద ఓ ఆర్ట్...

Saturday, 15 May 2010

సర్ ఆర్ధర్ ధామస్ కాటన్ 207 వ జయంతి నేడే ! ఆయన భారతదేశంలో పుట్టకపోయినా ఈ దేశప్రజల శౌభాగ్యం కోసం తపించాడు. ఈనాడు ఉభయ గోదావరీ జిల్లాలు సస్యశామలంగా ఉన్నాయంటే ఆ మహాను భావుడి నిరంతర కృషే కారణం. గోదావరి జిల్లాల రైతులోకం కాటన్ మహాశయుణ్ణి మరో భగవంతునిగా ఈ నాటికీ ఆరాధిస్తారు. మానవుడికి అమరత్వం అతను చేసిన కృషి వల్లే కలుగుతుంది. గోదావరిపై ధవళేస్వరం...

Thursday, 13 May 2010

పేరడీ జ్యొతి పంచాంగం !!

శ్రీ సంక్షోభకృన్నామ సంవత్సర సగంపూర్ణశాస్త్రీయ జ్యోతీ పన్చాంగమ్ 1963 బాపు రమణగార్లు తమ మిత్ర బృందంతో ప్రారంభించిన "జ్యోతి" మాసపత్రిక ఉగాది సంచికలో అనుభందంగా ఇచ్చిన పేరడీ పంచాంగం చదవడానికి చాలా సరదాగా వుంటుంది. బాపురమణల ’ఇంకోతి కొమ్మచ్చి’లో ఈ పంచాంగం వేశారు....

Wednesday, 12 May 2010

జనార్ధనునివెన్నముద్దలు’!! ఓ మంచి పుస్తకం మీలో ఎవరైనా శ్రీ జనార్ధనమహర్షి వ్రాసిన వెన్నముద్దలు కవితల పుస్తకం ఇంతవరకూ చదవకపోతే వెంటనే కొని చదవండి. నాకు ఆయన కవితలు చదువుతుంటే ఓ మాంచి బాపూ బొమ్మ చూసిన ఆనందం ఇప్పటికీ కలుగు తునే వుంటుంది. వెన్నముద్దలు లో కొన్ని నవనీతాల్ని మీ ముందు వుంచుతున్నాను. * మా అమ్మ...

Sunday, 9 May 2010

అమ్మను సదా తలచుకొందాం ! !

అమ్మను తలచుకుందాం ! ఈ రోజు మాతృ మూర్తులందరినీ తలచుకొవాలసిన మంచిరోజు.ఈ నాడే కాదు కలకాలం అమ్మను ఎలా మరచిపోగలం.. శ్రీ ముళ్లపూడి వెంకటరమణ తన సాహితీ సర్వస్వం మొదటి సంపుటాన్ని తనని పెంచి పెద్ద చేసిన అమ్మ ముళ్లపూడి ఆదిలక్ష్మి గారితో బాటు తనను తల్లిలా ఆదరించిన మహీపతి సూరమ్మ, కొవ్వలి సత్యవతి, చల్లా సీతా మహాలక్ష్మి,వీరఘంటం...

Friday, 7 May 2010

మనసుకవి పుట్టిన రోజు

మనసుకవి ఆత్రేయ శ్రీ కిళాంబి వేంకట నరసింహాచార్యులు నెల్లూరు జిల్లా మంగళంపాడులో 7-05-1921 తేదీన జన్మించిన ఆయన పేరులోని ఆచార్య,గోత్రంలోనిఆత్రేయ, రెండూ కలిపి ’ఆచార్య ఆత్రేయ" గా పేరు పొందారు. ఆత్రేయ నెల్లూరు మున్సిఫ్ కోర్టులో గుమాస్తాగా, "జమీన్ రైతు" పత్రికలో సహాయ సంపాదకుడిగా పనిచేసారు. ఆయన గౌతమ బుద్ధ, అశోక సమ్రాట్, పరివర్తన,వాస్తవం,...

Thursday, 6 May 2010

రచన దాసరి సుబ్రహ్మణ్యం స్మృతి సంచిక చందమామ అభిమానుల కోసం "రచన" మే నెల సంచిక 244 పేజీలతో వెలువడింది. ఇందులో చందమామలో తోకచుక్క, మకరదేవత లాంటీ అద్భుత ధారా వాహికలను వ్రాసిన జానపద నవలా సామ్రాట్ దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి కొదవటిగంటి రోహిణీ ప్రసాద్,డా.వెలగా వెంకటప్పయ్య, వసుంధర, యండమూరి వీరేంద్ర నాధ్, మన తెలుగు చందమామ బ్లాగు నిర్వహుకులు...
  • Blogger news

  • Blogroll

  • About