RSS
Facebook
Twitter

Monday, 28 June 2010

ఈ రోజు మన బుడుగు పుట్టిన రోజురోయ్ !! జూన్ 28, 1931 న రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ లో ఉన్న( ఇప్పుడు అక్కడ గార్డెన్స్ ఏవీ కనిపించవులెండి, ఏమంటే ఇప్పుడవన్నీ "ఆల్ కట్ గార్డెన్స్") లేడీస్ హాస్పటల్లో ఓ చిన్నారి "బుడుగు" పుట్టాడు. ఆ బుడుగే పెరిగి పెద్దవాడై మాటల చమత్ ’కారాల’తో నవ్వుల జల్లులు కురిపుస్తున్నారు. ఆయనే శ్రీ ముళ్లపూడి...

Wednesday, 23 June 2010

ఓ మంచి పుస్తకం : వంశీ కి న(మె)చ్చిన కధలుఓ మంచి పుస్తకం : వంశీ కి న(మె)చ్చిన కధలు మంచి కధలు వ్రా(తీ)యటంలో పేరు పొందిన ప్రముఖ దర్శకుడు, రచయిత వంశీ తన కొత్తపుస్తకం "వంశీకి నచ్చిన కధలు" పేరిట విడుదలచేశారు. రచయితగా ఆయన కధలు,"మాపసర్లపూడి కధలు","మా దిగువ గోదావరి కధలు" చదివిన పాఠకులు ఇందులో తనతో బాటుప్రముఖరచయితల 50 కధలను తప్పక మెచ్చుకుంటారు. ఇందులోని ప్రతి కధా దేనికదే ఆణిముత్యమే!...

Monday, 21 June 2010

లంచావతారాలు

లంచమనెడి ఉప్పు క్లార్కు తింటే తప్పు ఘనుడు తింటే ఒప్పు ఓ కూనలమ్మా! అన్నారు శ్రీ ఆరుద్ర. అప్పుడప్పుడూ మనం లంచావతారాలను వల వేసి పట్టుకున్నారని పేపర్లలో టీవీల్లో చదువుతుంటాము,చూస్తుంటాము. కళ్ళ ఎదుట నిత్యం అగుపించే దానికి ఇలా వల వేసి పట్టు కోవలసిన అవసరం వుందా అనిపిస్తుంది. లంచగాళ్ళపై ఎన్నో సినిమాలు...

Sunday, 20 June 2010

మీ ఇంట్లో ఎవరంటే నీకు ఇష్టం అని అడిగితే నేను ఈనాటికీ నాన్న అనే చెబుతాను. మా నాన్నగారు మాతో ఓ స్నేహితుడిగానే మెలిగేవారు. అలానే ఆయన అంటే ఓ విధమైన భయం కూడా ఉండేది. ఆ రోజుల్లో మా నాన్నగారు బ్యాంకు నుంచి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి చాలా ఆలశ్యమయేది. ఆయన కోసం నిద్రపోకుండా నేనూ,అక్క సరోజిని మేలుకొని ఉండేవాళ్ళం.చెల్లి...

Sunday, 13 June 2010

సైలెంట్ కార్టూన్ అను మూగ కార్టూనులు అసలు కార్టూన్లంటే చూడగానే నవ్వొచ్చేవే అసలు సిసలు నవ్వుల బొమ్మలు. మనం ఏ భాష వాళ్లమైనా ఓ కార్టూనిస్టు వేసిన బొమ్మచూడగానే అర్ధమై పోవాలి. అలాటి కార్టూన్లనే సైలెంట్ కార్టూన్లంటారు. ప్రఖ్యాత కార్టూనిస్ట్ మితృలు శ్రీ జయదేవ్ బాబు గారు సైలెంట్ కార్టూన్ పేర ఓ సైటె నడుపుతున్నారు. ...

Sunday, 6 June 2010

అమ్మో జూన్ ! ఆహా జూన్ !!

అమ్మో జూన్ నెల ! ఆహా: జూన్ నెల !! మొదట అమ్మో జూన్ నెల అనటానికి కారణం చెబుతా. సరిగ్గా 35 ఏళ్ళ క్రితం ,నాకు అంతే వయస్సు ఉన్న రోజుల్లో శ్రిమతి ఇందిరా గాంధి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఆ చీకటి రోజుల్లో పత్రికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్రాయకూడదు. వ్యంగ్య చిత్రాలు ప్రచురించ కూడదు. ఆ రోజుల్లోనే శంకర్శ్ వీక్లీ లాంటి...

Saturday, 5 June 2010

సుస్వరాల " బాలు " డు !!

సుస్వరాల ’బాలు’డు ! ! ఘంటసాల మాస్టారు లాంటి మధుర గానం మళ్ళీ మనం ఇక వినలేం, వినం, అనుకుంటుంటే తెలుగు తెరకు సంగీత సరస్వతి అందించింది ’పాట’లాడే ఈ చిన్నారి ’బాలు’డిని ! ! పాడేది ఏ పాటైనా, ఏ స్వరమైనా పాటలతో ఫుట్ ’బాలు’ఆడుతాడు ఈ చిన్నారి పాటల...

Friday, 4 June 2010

ఈ ఫొటొలొ ఉన్నది చిన్ననాటి మా కుటుంబం. అమ్మ,నాన్నగారితో నేను, అక్క సరోజిని, చెల్లి కస్తూరి. ఇంకొకటి ఆంధ్ర వారపత్రికలో 1958 లో అచ్చయిన నా మొదటి కార్టూన్.. సంతకం యం.వీ.అప్పారావని ఉంటుంది. నేను గీసిన మొదటి కార్టూన్ ఆ నాటి ప్రముఖ సచిత్ర వార పత్రిక " ఆంధ్ర వార పత్రికలో 1958 లో అచ్చయింది. తెలుగులో కార్టూనిస్టులకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన మొదటి పత్రిక...
  • Blogger news

  • Blogroll

  • About