RSS
Facebook
Twitter

Friday, 30 July 2010

రాచకొండ విశ్వనాధ శాస్త్రి రావి శాస్త్రి గా పేరొందిన తెలుగు పాఠకుల అభిమాన రచయిత ఎన్నో కధలు, నవలలు, నాటికలు వ్రాసారు. శ్రీ శాస్త్రి గారు 1922, జూలై 30 వ తేదీన శీకాకుళం లో జన్మించారు. ఆయన రచనలన్నీ ఒకే చోట ఏర్చి కూర్చి రాచకొండ విశ్వనాధ శాస్త్రి రచనా సాగరం పేరిట మనసు ఫౌండేషన్ వారు శ్రి బాపు ముఖచిత్రంతో 1373 పేజీలతో పుస్తకాన్ని ప్రచురించారు....

Thursday, 29 July 2010

సెల్లులో సొల్లు కబుర్లు !!

సెల్లులొ సొల్లు కబుర్లు ఈ కాలంలో సెల్లులేని ఇల్లు ఎక్కడుంది చెప్పండి. అంతెందుకు సందు సందున మందు దుకాణాల్లా సెల్లు దుకాణాలు, అందులో సెల్లులు సెల్లుచేస్తుంటె కొనుక్కోడానికి మూగే జనాలు ఎప్పుడూ కనిపిస్తుంటారు. నాకు అనిపిస్తుంటుంది, నిత్యావసారాలలాగ వీటికి ఇంత డిమాండ్ ఏమిటా అని.! కాలేజీకి వెళ్ళే అమ్మాయిల, అబ్బాయిల చేతుల్లోనే...
రసహృదయ వశిష్టుడు సినారె ప్రముఖకవి, సినీ గేయ రచయిత తెలంగాణాలోని హనుమాజీపేట అనే చిన్న గ్రామంలో జూలై 29 , 1931 జన్మించారు. ఆయన హైద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేస్తూనె యన్టీయార్ ఆహ్వానం పై 1961 లో "గులేబాకావళి కధ" చిత్రంతో పాటలు వ్రాయటం ప్రారంభించారు. మద్రాసులో నివాసం...

Wednesday, 28 July 2010

వార్తా పత్రికల కబుర్లు

వార్తా పత్రికల కబుర్లు ఇప్పుడు మనకు తెలుగులోనే ఎన్నో దిన పత్రికలు. ఒక్కొక్కటి దాదాపు ఓ పాతిక కేంద్రాలనుంచి వస్తున్నాయి. ఇక రంగులు , జిల్లా ఎడిషన్లు ఇలా ఎన్నెన్నో హంగులు. ఉదయని కల్లా పత్రికలు మన ముంగిటకు వచ్చి పలకరిస్తున్నాయి. మా చిన్న తనంలో ఇన్ని దిన పత్రికలు లేవు. ప్రముఖ పత్రికలు తెలుగులో రెండే ఉండేవి. అవి కాశీనాధుని నాగేశ్వరరావు...

Monday, 26 July 2010

బొమ్మల కధలుగా ఇతిహాసాలు

విదేశాల్లో చిత్రకధలు ( కామిక్స్) పిల్లల్లో, పెద్దల్లో బాగా ప్రాచూర్యాన్ని పొందాయి. మన దేశంలో అమరచిత్ర కధలు రూపంలో మన పౌరాణిక, చారిత్రాత్మక గాధలు ఇండియా బుక్ హౌస్ సంస్థ విడుదల చేస్తున్నది. 1985లో సంస్కృతి ఇంటర్నేషనల్ శ్రీ బాపు, ముళ్ళపూడి గీసి,వ్రాసిన రామాయణం బొమ్మల కధను ప్రచురించింది....

Sunday, 25 July 2010

సురేఖార్ట్యూనులు

సురేఖా కార్ట్యూనులు : : నీరు కన్నీరు అను ’ఐస్ " వాటర్ ( EYES WATER ) మునిసిపాలిటీ అందించే కలరు నీరు కాదా జనంపాలిటి కలరా ! ఆ నీళ్ళు త్రాగి రోగాలు రాని జనాలు ఒకరైనా కలరా ? అందుకే సందు సందు ముందు పెట్టేశారు ఓ "మందు" దుకాణం !! ఆ "మందు" తో తీర్చుకుంటున్నారు ...

Saturday, 24 July 2010

ఈనాడు శ్రీధర్ కార్టూన్ల పుస్తకం ఈనాడులో శ్రీ శ్రిధర్ గారి కార్టున్లు చూసినప్పుడు ఆర్కే లక్ష్మణ్ గారి కార్టూన్ పుస్తకాలలా శ్రీధర్ గారి కార్టూన్ల పుస్తకం కూడా వెలువడితే బాగుండునని చాలామంది ఆయన అభిమానులకు కలిగే వుంటుంది. ఈనాడు ఆగస్ట్,1999 లో ఈనాడు కార్టూన్లు శిధర్ పేరిట 10 X 8.5" సైజులో 214 పేజీలతో చక్కని బైండు పుస్తకం...

Friday, 23 July 2010

బాపు రమణ బొమ్మల కధలు

మరో మంచి పుస్తకం - బాపు రమణ బొమ్మల కధలు బాపు రమణలు 60 ఏళ్ళనుంచి చేసిన కళా (ధా) పోసన లన్నీ ఏర్చి కూర్చి ఒకే పుస్తక రూపంలో రచన శాయిగారు తమ వాహిని బుక్ ట్రస్ట్ ద్వారా పెద్ద సైజులో 465 పేజీలతో ప్రచురించారు. తెలుగు పాఠకులకు ఇది పసందైన విందు. ఆంధ్ర సచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ వార పత్రిక,ఆంధ్రజ్యోతి వీక్లీ, చందమామ,యివ,జ్యొతి,...

Wednesday, 21 July 2010

గో గో గో !! గోమాత !!

ఆవు దూడను పూర్తిగా తాగనివ్వక దాని పాలు పూర్తిగా. పిండుకుంటాము. మనది ఓ వేళ పాల వ్యాపారమైతే అందులో నీళ్లు కలిపి అమ్ముకుంటాము. అన్యాయంగా సంపాదించే వాళ్ళను "వాడు నానా గడ్డి తిని సంపాదించాడు" అంటూ వుంటారు. ఫాలు పిండుకుంటే పిండుకున్నారు ఆ ఆవుకు ఇంత దానాగా గడ్డి వేయరు. పాలు తిసుకున్నాక వాటిని రోడ్డు మీదకు...
హాస్య రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రధమాంధ్ర రచయితల్లో ప్రముఖవ్యక్తి. ఆయన తన ఇరవై రెండో ఏట మొదటి రచన చేశారు. ఆయన 1889లో రచించిన "గయో పాఖ్యానం" నాటిక వందేళ్ళు పైగా ప్రదర్శించబడింది. కందుకూరి తో బాటు ప్రముఖులంతా ఈ నాటికలో పాత్రలను పోషించారు. శ్రీ చిలకమర్తి గీతామంజరి, కృపాంబోనిధి, మొదలైన శతకాలు,...

Monday, 19 July 2010

టూ(టీ)త్ పేస్ట్ కబుర్లు

ఉదయాన్నే లేవగానే మనం బ్రష్ చేసుకొంటాము, సారీ, బ్రష్ చేసుకోవటమెందుకు మనకు మార్కెట్లో ఎన్నో రకాల టూత్ బ్రష్షులు దొరుకుతున్నప్పుడు. ఐనా మనకు అదేమిటో బ్రష్ చేసుకోవడమనే మాట అలవాటయింది. బ్రష్ ఉంటే చాలదు కదా తోముకోడానికి పేష్ట్ కావాలి. నాకో సందేహం వస్తుంటుంది. టూత్ పేస్ట్,టూత్ బ్రష్ష్ అని అంటారు. టూత్ అంటే ఒక పన్నని అర్ధంకదా. ఆ ఒక పన్ను తోముకోడానికి...

Sunday, 18 July 2010

ఇంతకుముందు మనం ఏ ఆఫీసుకు వెళ్లినా టైపు రైటర్ చేసే టిక్ టిక్ శబ్దాలు వినిపిస్తుండేవి. ఇక ఆ టైపు నేర్పటానికి ప్రతి వీధికి ఒక ఇన్స్టిట్యూట్ అగుపించేది. కాల క్రమాన కంప్యూటర్లు ప్రవేశించాక టైపు మిషన్లు అగుపించడం దాదాపు మానే సాయి.ఇంతకు ముందు టైపు చేయడానికి ఓ టైపిస్టు ఉండేవాడు. ఇప్పుడో ప్రతి బల్ల మీదా కంప్యూటర్లే ! కావలిసిన మాటర్ని టైపు...

Friday, 9 July 2010

నవ్వుల జల్లులు కురిపిస్తున్న ఈ రమణీయుణ్ణి, బాపురే అనిపిస్తూ చిత్రగీతలని గీస్తున్న యువ జంటని గుర్తుపట్టారా ! ఈ ఇద్దరబ్బాయిలూ అశేషాభిమానుల గుండెల్లో నిత్యయవ్వనులుగా నిలచిన బాపూరమణీయులు !! ఇప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలు మరో బాలు(డు)గారితో ఈటీవీ ’పాడుతా తీయగా’ ప్రేక్షక శ్రోతలకు వీ(క)నులను రమణీ యం చేయబోతున్నారు. ఇంకేం, ఈ నెల 12వ తేదీ సోమవారం రాత్రి 9-30 గంటలకు ప్రసారం అవుతున్న బాలు(పూ)...

Wednesday, 7 July 2010

ముత్యాల ముగ్గులేసిన చిన్నారి పిచ్చుకమ్మ!! ఆంధ్రప్రదేష్ లో చాలా నగరాల్లోని పిల్లలకు పిచ్చుకలంటే ఏమిటో తెలియదు. అలనాటి డైనొసార్ల లాగ కనుమరుగైఫోయాయి. కాని, ఈ ముంబాయి మహా నగరంలో మాత్రం ప్రతి రోజూ పిచ్చుకలు ప్రత్యక్షమవుతూ కనువిందుకలిగిస్తు న్నాయి! బాల్కనీలోకి ఎగురుకుంటూ వచ్చి...
  • Blogger news

  • Blogroll

  • About