RSS
Facebook
Twitter

Thursday, 30 September 2010

ఈ రోజుతో నా బ్లాగు మొదలుపెట్టి ఏడాది పూర్తయింది. నా బ్లాగు ఇంతకాలం విజయవంతంగా నిర్వహించడానికి సాయం చేసినముగ్గురు త్రిమూర్తులకు నా ధన్యవాదాలు తెలియజేయడంనా కనీస ధర్మం. పూనాలో నివాసముంటున్న శ్రీ భమిడిపాటి ఫణిబాబు, శ్రీమతి లక్ష్మి దంపతులు.కొంతకాలం...

Wednesday, 29 September 2010

సినేమా కధలు

ముత్యాలముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ రావు గోపాలరావు అన్న డయలాగు గుర్తొచ్చింది కదూ! ఇప్పుడు మనం నిజం గా సినిమా కధలే చెప్పుకుందాం. ఇప్పట్లా సినిమాలు రాక ముందు జనానికి నాటకాలు, హరి కధలూ ,తోలుబొమ్మలాటలు కాలక్షేపం. సినిమాలొచ్చి వాటన్నిటినీ వెనక్కు తోసేశాయి.ఆ సినిమాలకు పోటీగా...

Friday, 24 September 2010

హేమంత్ కుమార్ పేరు వినగానే మనకు "బీస్ సాల్ బాద్." "కొహ్రా" లాంటి హర్రర్ సినిమాలు గుర్తుకొస్తాయి. "బీస్ సాల్ బాద్" చిత్రంలోని లతా పాడిన "కహీ దీప్ చలే" పాట, దర్శకుడు బిరేన్ నాగ్ తన కళాదర్శకత్వ అనుభవంతో రాత్రి వేళ దృశ్యాలతో అద్భుతంగా చిత్రీకరించి...

Thursday, 23 September 2010

సాక్షి

కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు 1913 లొ కొంతకాలం అటుతరువాత 1920 లో "సాక్షి" పేరిట వ్యాసాలను "ఆంధ్రపత్రిక" సారస్వ తానుబంధంలో ప్రతి వారం ప్రచురించేవారు. అవన్నీ సంపుటాల రూపం లో సుప్రసిద్ధ ప్రచురుణ సంస్ఠ వావిళ్ల రామస్వామి శాస్త్రులు వారి ద్వారా ప్రకటించబడ్డాక,, విజయవాడ, అభినందన...

Wednesday, 22 September 2010

స్వరస్రవంతి లతామంగేష్కర్

లత స్వరం విని పులకించని వారెవరు ? 68 వసంతాల పైగా ఆమె తన స్వరంతో సంగీత ప్రేమికులను అలరిస్తున్నారు. "లత పాటలు పాడకుంటే నే సంగీత దర్శకత్వం వహించిన "గైడ్" ద్వారా ఇంత ఉన్నత శిఖరాలను అధిగమించలేక పోయే వాడిని" అన్నారు స్వర్గీయ యస్.డి.బర్మన్. అనిల్ బిశ్వాస్, ...

Tuesday, 21 September 2010

దేశమును ప్రేమించుమన్నా-మంచి అన్నది పెంచుమన్నా వట్టిమాటలు కట్టి పెట్టోయ్-గట్టిమేల్ తలపెట్టవోయి ! తిండి కలిగితె కండ కలదోయ్ -కండకల వాడేను మనిషోయి ! ఈసురోమని మనుషులుంటే-దేశమేగతి బాగుపడునోయి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ !! ఇంతటి మంచి ప్రొబోధ గీతాన్ని అందించిన మహరచయిత ...

Monday, 20 September 2010

అ ఆ ల అక్కినేని

అ క్కినేని నాగేశ్వరరావు, ఆ యన వయస్సు ఈ రోజుతో దాటుతుంది ఎనభై ఆరు! ఇ లా చెబితే నమ్ముతారా ఆయన వయసు యనభైఆరని!! ఈ లేస్తూ ఇంకా హుషారుగా కనిపించే యంగ్ బాయే!! ఉ రుకుల పరుగులతో యువకుడిగా అక్కినేని వయసు పరుగులు పెడుతున్నది! ఊ రూరా ఆయనంటే ఇంకా అభిమానం ! ఎ యన్నార్ ఎప్పటికీ ఎవ్వర్ గ్రీన్!! ...

Sunday, 19 September 2010

కార్ట్యూనులు !

ఈ "మాస్"ఏజ్ లో ఉత్తరాల పలకరింపులు లేవు! అన్నీ మెసేజ్ లే !! అక్షరాల కత్తిరింపులతో స్పెల్లింగ్ కిల్లింగులతో అన్నీ భాషను ఖూనీ చేసే డామేజీలే !! అనుబంధాలను అందించే ఉత్తరం నేడెంతో దూరం ! ఇక రావు కదా గుండె చప్పుళ్ళను అక్షరాలతో నింపి రాసే ఉత్తరాలు !! పోస్ట్ మాన్ రాక తెలిపే గేటు చప్పుళ్ళు ఇక వినిపించవు...

Saturday, 18 September 2010

దామెర్ల రామారావు, అడవి బాపిరాజు,వరదా వెంకటరత్నం, అంకాల వెంకట సుబ్బారావు,కె.వేణుగోపాలరావు వంటి కళాకారులెందరో తెలుగు చిత్ర కళకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. ఇలానే శ్రీకాకుళం లో సెప్టెంబరు 10,1921 లో జన్మించిన శ్రీ వడ్డాది పాపయ్య ప్రముఖ వర్ణచిత్ర కళాకారుడు. మన బ్లాగులో ఈయన...

Friday, 17 September 2010

జయదేవుని కార్టూనిష్టపదులు

ఈ నెల 13 న పుట్టిన రోజు జరుపుకున్న మితృలు డాక్టర్ జయదేవ్ బాబు గారికి ఆయన అశేష అభిమానుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నలభై ఎనిమేదేళ్లకు పైగా వేలాది కార్టూన్లు గీసిన ఈ మంచి మనసున్న తెలుగు వెలుగు మన జయదేవ్ బాబు గారు. బెల్జియం దేశం వాళ్ళు నాక్ హీస్ట్ లో నిర్వహించే అంతర్జాతీయ పోటిలకు...

Thursday, 16 September 2010

చేతిలో రహస్యం

మనం ఏదైనా రాయాలన్నా, ఏ పనైనా చెయ్యాలన్నా చెయ్యి వుండల్సిందే. అందుకనేనేమో ఇదిగో ఈ పని "చెయ్యి" అని చెబుతుంటారు. పని చెయ్యాలంటే చెయ్యి కావాలి కాబట్టి "చెయ్యి" అనే పదం అందునుంచే పుట్టిందనుకుంటాను. చాలా ఏళ్ళనుంచి మన దేశాన్ని పాలిస్తున్న ఒక రాజకీయ పార్టీ గుర్తు చెయ్యే! మొదట "కాడెద్దులు", "ఆవూ దూడా" గా మారి ఇప్పుడేమో ""హస్తం...

Wednesday, 15 September 2010

శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు సినిమావాళ్ళ పాత్రలకు అందమైన డై "లాగు"లు తొడిగారు. బాపు రమణలు 1950 లో ఆంధ్ర పత్రికలలో వ్రాసిన, సినిమా సమీక్షలు, గీసిన బొమ్మలతో "బాపూ రమణీయం" పేరిట ఓ అందమైన పుస్తకం 1990 ఏప్రియల్ లో వచ్చింది. ఆ పుస్తకంలో వచ్చిన రమణ గారి డైలాగుల మచ్చు తునకలు మీ కోసం. దాగుడుమూతలు అమ్మడు (శారద) పాపాయి(పద్మనాభం)...

Tuesday, 14 September 2010

దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోని ప్రముఖ గాయనీ గాయకులు ఒకే చోట కనిపించే అరుదయిన ఈ అద్భుతమైన ఫొటో "హాసం" హాస్యసంగీత పక్ష పత్రిక ( 16-31 ,ఆగష్టు 2002) సంచికలోనిది. ఇందులో టి.జి.కమలాదేవి, పి.సుశీల, కె.రాణి, పి.లీల, జిక్కీ,ఎ.పి. కోమల,ఎ.యమ్.రాజా,జె.వి.రాఘవులు,ఘంటసాల,మాధవపెద్ది...

Monday, 13 September 2010

రోజులు మారాయి

దున్నేవాడిదేభూమి అనే నినాదంతో సారధీ వారు నిర్మించిన "రోజులు మారాయి" చిత్రం 14 ఏప్రియల్ 1955 తేదీన విడుదలయి అఖండ విజయం సాధించింది. ఈ సినిమా తోనె వహీదా రెహ్మాన్ పరిచయమై హిందీ చిత్రసీమలో హీరోయిన్ గా స్థిర పడింది. ఈ చిత్రంలో ఆమె ఓ నృత్య సన్నివేశంలో మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో జిక్కీ గానం చేసిన ఏరువాక సాగారో రన్నా-చిన్నన్నపాటకు...
  • Blogger news

  • Blogroll

  • About