RSS
Facebook
Twitter

Sunday, 31 October 2010

నిజ జీవితంలో హాస్యం!!

హాస్యం ఎక్కడినుంచో పుట్టదు. మనం రోజూ చూస్తున్న మన చుట్టూ వున్న జనం నుంచే పుడుతుంది. మేం బాంకులో పని చేసే రోజుల్లో బాంకవగానే ఇంటికి వెళ్ళేటప్పుడు మితృ లంతా పుష్కర్ ఘాట్ దగ్గర వున్న "పంచవటి" హోటల్లో కాసేపు గడిపేవాళ్ళం ప్రొప్రయిటర్ విశ్వేశ్వరరావు...

Saturday, 30 October 2010

సుందరకాండ సుభాషితాలు

ఒక్కసారిగా సినిమాలనుంచి ఆధ్యాత్మిక విషయాలలోకి దూకానని అనుకోకండి. రామాయణం ,ముఖ్యంగా సుందర కాండ చదువుతుంటే ఈ నాటి యువతీయువకులు తెలుసుకోవలిసిన పెర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలు ఎన్నో ఎదురుపడతాయి! మా నాన్నగారి చిన్ననాటి మితృలు శ్రీ శ్రినివాస శిరోమణి...

Friday, 29 October 2010

ఒక సారి శ్రీ బాపూగారిని కలిసినప్పుడు మీ కార్టూన్ ఐడియాలు చాలా బాగుంటాయి అని నే నంటే ,"మన చుట్టూ వున్న జనాల్ని బాగా పరిశీలిస్తే మీకూ ఐడియాలు అవే వస్తాయి" అన్నారు. మా ఇంటికి ఎదురుగా డాక్టర్.రాఘవమూర్తిగారి హాస్పటల్ వుంది. గత 35 ఏళ్ళ పైగాఆయన...

Thursday, 28 October 2010

గతంలో సినిమా విడుదలకాగానే ఆ సినిమా పాటలపుస్తకాలు ఇంటర్వల్లో హాల్లో అమ్మేవారు.అందులో సినిమా పాటలు, ముందు పేజీలో కధ వేసేవారు. కధ చివర మిగిలిన కధ మా వెండితెరపై చూడండి అని వ్రాసేవారు. ఇప్పుడు ఆ సినిమా ఫాటల పుస్తకాలు రావటం చాలా...

Wednesday, 27 October 2010

ఈ శీర్షికను చదివి కొందరు తెలుగు వాళ్ళు నాపై కోపగించుకోవచ్చు.వీడికి ఇదేమి తెగులని,తెలుగు వాళ్ళని ఇలా అవమానిస్తాడా అనీ అనుకోవచ్చు. కానీ మన (వి) నాయకులు మన రాజధానిలోని "తెలుగు లలిత కళాతోరణం" లోని తెలుగు అన్న పదాన్ని తొలగించి దానికి "రాజీవ్ లలిత ...

Tuesday, 26 October 2010

స్వరరాజేశ్వరం

శ్రీ ఎస్.రాజేశ్వరరావు 1936 లో నటుడిగా గాయకుడిగా చిత్ర సీమలోకి ప్రవేశించారు ఆయన చిత్రరంగంలో చివరి వరకూ అగ్ర సంగీత దర్శకుడిగానే వెలొగొందారు.జెమినీ నిర్మించిన "చంద్రలేఖ" చిత్రం ఆయన్ని ఏ రకమైన సంగీత మైనా అందించగల సంగీత దర్శకుడిగా భారతదేశమంతటా పేరు సంపాదించిపెట్టింది....

Monday, 25 October 2010

తీపి కబుర్లు

" ఏ దైనా స్వీట్ చేయొచ్చు కదా?" అన్నాను శ్రీమతితో. "ఎలా చేస్తానండీ, షుగరు లేదు కదా" అంది వెంటనే. " అందుకే కదా స్వీట్ చెయ్యమన్నది" అని అనగానే, "చూడబొతే మీకు రాను రాను చాదస్తం ఎక్కువవు తున్నట్టుంది, షుగరు లేకుండా స్వీట్ ఎలా చేస్తారండీ" అంది. "షుగరులేదు కదా" అన్న...

Sunday, 24 October 2010

యశస్వీ.రంగారావు

విస్వనట చక్రవర్తి యస్వీ రంగారావు గురించి చెప్పటమంటే అది సాహసమే. మాంత్రికుడిగా ఆయన "పాతాళభైరవి"లో చేసిన అభినయనం , " సాహసం చేయరా ఢింభకా" అన్న ఆ గంభీర స్వరం ఈ నాటికీ తెలుగు ప్రేక్షకుడి చెవిలో అలా ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. తెలుగులోనే కాదు, తమిళ చిత్ర సీమలో కూడా అయన కంఠస్వరం, ఉచ్చారణ తమిళులు ...

Saturday, 23 October 2010

శ్రీ శంకర్ గారి హాస రేఖలు!!

ఈ పెన్సిల్ పోట్రయిట్స్ చూసారుగా! వీటిని ఇంత అద్భుతంగా గీసింది శ్రీ సత్తిరాజు శంకరనారాయణ గారు. సత్తిరాజా, ఈ ఇంటి పేరెక్కడో విన్నట్టుంది కదూ! నిజమే నండి.! ఆ ఇంటి పెరు గల ఆంధ్రుల అబిమాన చిత్రకారుడు శ్రీ బాపు అనే సత్తిరాజు లక్ష్మీ నారాయన. ఆయన తమ్ముడే ఈ శంకరనారాయణ గారు. ఆలిండియా...

Friday, 22 October 2010

పొట్ట మీద పొట్టి కధ

మితృడు హనుమంతరావు తన హాస్యవల్లరి లో తన పొట్టగురించి మన పొట్ట చెక్కలయేటట్లు వ్రాసింది చదివిన తరువాత నాకూ పొట్ట గురించి కొన్ని కబుర్లు మీతో చెప్పాలనిపించింది. ఐనా పొట్టగురించి ఎంతైనా వ్రాయ వచ్చు. పెద్ద పొట్టగలవారికి ఏదైనా చిరుతిండ్లు తినాలంటే...

Thursday, 21 October 2010

ఇ.వి.వి. కొంటె సమాధానాలు ! ! దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణగారిని మీదే దేశం అని అడిగితే "నవ్విస్తాన్" అంటారేమో!! ఆయన హాస్యం కాస్త మోటుగా వుండొచ్చేమో గాని ఆయన తీసిన హాస్య చిత్రాలంటే మోజు పడే వారే ఎక్కువ.ఇంతకు ముందు నా బ్లాగులో పరిచయం చేసిన "వెన్నముద్దల" జనార్దనమహర్షి గారు "హాసం" పత్రిక కోసం ఇ.వి.వి.ని...

Wednesday, 20 October 2010

సరసి నవ్వుల బొమ్మలు

తెలుగు పత్రికలు, ముఖ్యంగా "నవ్య"వారపత్రిక పాఠకులకు సరసిగారి కారూన్లు పరిచయమే. ప్రతి కార్టూనూ మనల్ని పలకరించి పులకరింపజేసి నవ్వుల్తో ముంచెత్తుతాయి. చక్కని నేటివిటీతోశ్రీ బాపూ, డా"జయదేవ్ సరసన నిలిచే కార్టూనిస్ట్ సరసి గారే ! సరస్వతుల రామ నరసింహం అనే ...

Tuesday, 19 October 2010

"నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల. అసలు సిసలు తెలుగు హాస్యానికి నిర్వచనం చెప్పిన జంధ్యాల మనల్ని వదలి దేముళ్ళను ...
  • Blogger news

  • Blogroll

  • About