RSS
Facebook
Twitter

Tuesday, 30 November 2010

1963 ప్రాంతాలలో ముళ్ళపూడి, బాపు, ఆరుద్ర, నండూరి రామమోహనరావు, రావి కొండలరావు మొదలైన ప్రముఖుల సంపాదకత్వంలో వచ్చిన "జ్యోతి" మాస పత్రికలో ప్రతి పేజీ ఆణి ముత్యమే! అలాటి ముత్యాలను ఏర్చి కూర్చి 1964లో "రసికజన మనోభిరామము" అనే పుస్తకాన్ని జ్యోతి బుక్స్ వారు ప్రచురించారు....

Monday, 29 November 2010

మీరూ బొమ్మలు గీయండి !!

మీరు పత్రికలలో కార్టున్లు చూసినప్పుడు నాకూ బొమ్మలు వేయటం వస్తే ఎంత బాగుండును అనిపిస్తుంటుంది కదూ? మీకు వచ్చినా బాపూ గారిలా జీవం వుట్టిపడేటట్టు నా బొమ్మలూ లేవే అని అనిపుస్తూ వుండొచ్చు. కార్టూను గీయాలనే ఆశక్తి వున్న చాలామంది కోసం బాపూగారు "బొమ్మలు గీయండి" అనే...

Sunday, 28 November 2010

బాపుగారి నుంచి మీకో మాట!

బాపూగారి అశేష అభిమానులతొ ఆయన రెండు మాటలు చెప్పడానికి మీ ముందుకు వచ్చారు. అందమైన అమ్మాయిలకు అభిమానులు పెట్టుకొన్న ముద్దు పేరు "బామ్మ"! అంటే "బా"పూ బొ"మ్మ" !! ఇక ముక్కోటి దేవతలను వాళ్ళంతా" మేం ఇంత బా(పు)గుంటామా ? "అని ఆశ్చర్యపడేటట్లు గీశారు.!!. అమూల్యమైన ఆ బొమ్మలను కొంతమంది స్వార్ధ పరులు, కనీసం ...

Saturday, 27 November 2010

ఇక్కడ ఉన్న ఫొటోలలో ఉన్న మా చిన్నారి అమ్మాయిలు ఎడమ వైపు బొమ్మ పట్టుకుని వున్నది పెద్దమ్మాయి మాధురి,ప్రక్కన చిన్నమ్మాయి మాధవి. మాధురికి చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయటమంటే చాలా ఇష్టం. ఓ సారి సర్కస్ లో ఏనుగు శివలింగాన్ని పూజ చేయడం చూసి ఇంటికి రాగానే తన పిగ్గీ బ్యాంకులో...

Friday, 26 November 2010

అద్భుత వర్ణ చిత్రకారుడిగా రాజా రవివర్మ పేరు తెలియని వారుండరు. ఆయన చిత్రించిన దేవతా చిత్రాలు చూస్తుంటే తమ చిత్రాలను చిత్రింపజేసుకోవడానికి ముక్కోటి దేవతలు దిగివచ్చి అయన ముందు నిలిచారేమోనని అనిపిస్తుంది. రాజా రవి వర్మ ఏప్రియల్ 29, 1848లో కేరళలోని ట్రావెన్కోర్, కిల్లిమానూర్ లో జన్మించారు. ఆయన తండ్రి...

Thursday, 18 November 2010

పాటల రికార్డులు

ఇప్పుడైతే కాసెట్స్, ఆడియో సిడీలు వచ్చాయి కాని దాదాపు 1983 వరకు పాటలు వినాలంటే వినైల్లో తయారయిన LP ( 33 RPM Long Playing Records), SP (Standard play ) రికార్డులే వుండేవి. అంతకు ముందు 78 RPM ఒక రకం మట్టి,లక్క ఉపయోగించి చేసిన రికార్డులు వచ్చేవి. వీటి లో ఒక వైపు ఒక పాట, రెండో వైపు మరొ పాట వుండేది. యల్ఫీ రికార్డుల్లో దాదాపు రెండు వైపులా...

Wednesday, 17 November 2010

మేలుపలుకుల మేలుకొలుపులు

శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు, శ్రీ బాపుగారి వర్ణ చిత్రాలతో తమిళం లో వున్న తిరుప్పావై దివ్యప్రబంధం తెలుగులోనికి అందంగా తెనిగించారు. ఆ అందాల మేలుకొలుపులో సిరినోము అనే ముందు మాటలో రమణ గారు వ్రాసిన కొన్ని మాటలను ...

Tuesday, 16 November 2010

మన పత్రికలు

ప్రెస్ కౌన్సిల్ చట్టాన్ని 1956 లో చేసినా ,ప్రెస్ కౌన్సిల్ నిజానికి మొదలయింది నవంబరు 16,1966. అందుకే ఈ రోజును నేషనల్ ప్రెస్ డే గా జరుపుకుంటున్నాం. కొంతవరకైనా ప్రజాప్రతినిధులు భయపడుతున్నారంటే దానికి కారణం మన పత్రికలే! ఆనాటి బోఫర్స్ కుంభ ...

Monday, 15 November 2010

కూరలకు కోరలొచ్చాయి !!

కన్నీళ్ళు తిరుగుతున్నాయి ; ఉల్లినే కాదు ఏ కూర తరిగినా! జేబులో డబ్బులూ తరుగుతున్నాయి !! వెజిట "బుల్స్" కు కొమ్ములొచ్చి జనాన్ని కుమ్ముతున్నాయి !! ధరల కోరలు పెంచి నాన్ వెజులుగా మారి జనాల్ని కొరొక్కుతింటున్నాయి !! వానల్లు కురవాల, వరి చేలు పండాల అని పాడుకొనేవారు....

Sunday, 14 November 2010

బాలల దినోత్సవం ఈ రొజే!!

నవంబరు పద్నాలుగో తేదీ అనగానే మనకు గుర్తొచ్చేది బాలల పండుగ, జవహర్ లాల్ నెహ్రూ !! కాని బాలల కోసం అహర్నిసలూ కృషి చేసినతెలుగు వ్యక్తులను మన తెలుగు వాళ్ళు ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు. ఈ నాటి యువతరానికి, వాళ్ళ పిల్లలకు అలాటి గొప్ప వ్యక్తుల గురించి చెప్పవలసిన భాధ్యత మనందరి పైనా వుంది....

Saturday, 13 November 2010

గానరసలీల సుశీల

గాన కోకిల సుశీల పాడేది వీణ పాటయినా వాన పాటయినా! ఏదైనా ఆమెకు అవలీల!! ఆమె గానం సుగంధాల మరువం ! ఆ స్వరం కలకాలం మరువగలమా మనం!! ==========సురేఖ శ్రీమతి పి.సుశీలమ్మకు...

Tuesday, 9 November 2010

పుస్తకాలయం

నాకు లాగానే మా మితృలు శ్రీ జోశ్యుల రామశర్మగారు (జోరాశర్మ) పుస్తక ప్రియులు. కవితలూ వ్రాస్తారు. బియస్ యన్ ఎల్ లో ఉన్నత ఉద్యోగి. ఆయన పుస్తకాలమీద గల అపారమైన ప్రేమాభిమానాలతో " మా ఇంటి పుస్తకాలయం" పేరిట ఓ కవితను వ్రాశారు. నాకు నచ్చిన ఆ కవితను మీ అందరి...

Sunday, 7 November 2010

ఎడా పెడార్ధాలమాటలు!!

కొన్ని మాటలకు ,అడిగే ప్రశ్నలకు అర్ధాలూ, పెడార్ధాలూ వుంటుంటాయి. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఏ షాపింగ్ మాల్లోనో కుటుంబ సమేతంగా అగుపించాడను కోండి. వెంటనే మన నోటి నుంచి వచ్చే ప్రశ్న"కులాసాగా వున్నారా?!" అనడుగుతాం. కులాసాగా లేకపోతే అలా సంతోషంగా షాపింగ్కు పిల్లా పాపల్తో...

Saturday, 6 November 2010

చూపులకు పొట్టివాడైనా కవితా రచనలో బహు గట్టివాడు దాశరధి. చిన్ననాటే నిజాంపాలన నియంతృత్వంపై తిరుగు బాటు చేసి విప్లవ సమరం చేసిన ధైర్యశాలి.తన జీవితాన్ని కవితకే అంకితం చేసి కవిగానే 1987 నవంబరు 5 తేదీన కీర్తిశేషుడైన దాశరధి పూర్తి పేరు దాశరధి కృష్ణమాచార్య. ...

Friday, 5 November 2010

"చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళీ! అందాల ప్రమిదల, ఆనందజ్యోతుల ఆశల వెలిగించు దీపాలవెల్లి" ఆత్రేయ ఈ చిరుదివ్వెల దీపావళి...

Thursday, 4 November 2010

షడ్రుచులు-2

జ్యోతి గారికి పోటిగా నేను షడ్రుచులు వ్రాయటం మొదలెట్టాననినిమీరను కుంటె మీరు ప(త)ప్పులోకాలేసినట్టే!.నాకు వండిన వంటలు ఆరగించడంలో ప్రావీణ్యం వుందిగానీ తయారుచేయడంలో ఏ మాత్రం అనుభవంలేదు. కానీ కూరలను తరగడంలో నేను చాలా నేర్పరిని. నా శ్రీమతికి కత్తిపీటతో తప్ప చాకుతో తరగడం రాదు. కాని నాకు...
  • Blogger news

  • Blogroll

  • About