RSS
Facebook
Twitter

Monday, 28 February 2011

మన తెలుగు అక్షరాలలో "ఱ" అనే అక్షరం ఉపయోగం తక్కువే! ఆ మాటకువస్తే ఇప్పుడెవరూ " ఱ " ( బండి ర ) ను ఉపయోగించడంలేదు కూడా. ఆ" ఱ " ని యుపయోగించి ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రీ బాబు ( కొలను వెంకట దుర్గాప్రసాద్ ) ఓ కార్టూన్ గీశారు. భాపుగారు ఆ కార్టూన్ చూసి వెంటనే తన స్పందననులేఖ ద్వారా ( స్వాతి ) తెలిపారు. నిజంగా ఎంతో అర్ధవంతంగా ఉన్న ఆ కార్టూన్చాలామంది కార్టూన్ ఇష్టులు చూసేవుంటారు....

Sunday, 27 February 2011

ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రొగ్రాములు గంటసేపు జరిగేవి. కధలు, నాటికలు, పాటలు ఎన్నో..అవి అయ్యాక బాలన్నయ్యగారు అందరికీ స్వీటు హాటు కూల్ డ్రింకూ, పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులకు కాఫీ,టీ యిప్పించే వారు-ఆ టిఫిను ప్రొగ్రాంకి నేనూ, అన్నయ్యగారి అన్నయ్యగారబ్బాయి రాఘవా,తమ్ముడు గోపాల్ ఇన్చార్జిలమి. ప్రొగ్రాం...

Saturday, 26 February 2011

హాయ్! రమణా...నేను బుడుగుని...

ఆదివారం ఈనాడు లో ప్రచురించిన "నాన్నోయ్..." అంటూ ముళ్లపూడివారిపై ప్రచురించిన ఒక రచన చదివి, మీ అందరికీ కూడా నచ్చుతుందన్ననమ్మకంతో ఇక్కడ వుంచుతున్నాను. ( "ఈనాడు" సౌజన్యంత...

Friday, 25 February 2011

బుడుగు వెంకట రమణగారు

బుడుగు వెంకటరమణ ముళ్లపూడి అక్షరాలా అక్షరాలతో చేశారు గారడి అప్పారావు బుడుగు సీగాన పెసూనాంబ రాధాగోపాలం వీళ్లందరితో మీరు పంచిన నవ్వులు సదా మా గుండెల్లోపదిలం !! <><><><><><><><><> రమణగారు పౌరాణిక కధలను , హాస్యకధలను, కరుణగాధలను రమణీయంగా వ్రాయగలరు. ఆయన...

Thursday, 24 February 2011

నేనంటే మీకెంత ప్రేమండి ?!

గతనెల జనవరి 26 న ఆయన పెళ్ళిరోజుకు శుభాకాంక్షలు పంపితే వెంటనే ఫొను చేసి ఆయన అన్న మాట " నేనంటే మీకెంత ప్రేమండి" అదే ఆయన దగ్గరనుంచి వచ్చే ఆఖరి ఫోనని నేననుకోలేదు. బాపురమణ లంటె కవలలుకాని కవలలు. ఏ పని చేసినా ఇద్దరూ చేయవలసినదే. ఓ పెర్సనల్ పని పై రాజమండ్రి వచ్చి మేం ఫలానాచోట వున్నాం అంటూ ఆప్యాయతగా ఫోను...

కోటి అందాల కోనసీమ

కోనసీమ అందాలను ఎన్నో తెలుగు సినిమాలలో ఆదుర్తి, బాపు, విశ్వనాధ్ మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఓ వైపున సముద్రకెరటాల సవ్వడి, మూడు వైపుల గోదావరి పాయల గలగలలు, మధ్యన ఆకుపచ్చచీర కట్టినట్లు చూడచక్కని పంట పొలాలు, ఇరువైపుల బారులు తీరిన కొబ్బరి చెట్లు, ఆహా ఇంతటి అందాల పకృతిలో జీవించడమంటే అదో చెప్పలేని మధురానుభూతి. ...

Wednesday, 23 February 2011

ఉదయాన్నే పేపరు చూడగానే భయంకరమైన వార్తలు ! కీ"శే" భమిడిపాటి రాధాకృష్ణ గారు ( ప్రఖ్యాత నాటక, సినీ హాస్య రచయిత) మాటలు జ్ఝాపకం వస్తాయి. "ఏమండీ పదకొండు దాటింది ఇంకా స్నానం అవలేదా మేస్టారూ" అంటె , " పేపర్లో చదివేవన్నీ చావు కబుర్లే కదా, అన్నీ చదివి, ఒకేసారి స్నానానికి వెళ్ళేటప్పటికి...

Tuesday, 22 February 2011

" నా టీవీ" సినిమా వార్తలు

కొత్తగా మొదలెట్టిన " నా టీవీ " లో సినిమా వార్తలు చదువుతున్నది నేను, వింటున్నది మీరే ! తలగీతలు లేకుండా వెంఠనే మీ కన్నుల్లో గుచ్చుతూ, చెవుల్లో జోరుగా జోరీగలా రొద పెట్టడమే మా వాతల, సారీ వార్తల ప్రత్యేకత. ఆహా ఒహో ఫిలింస్ తమ చిత్రం "నీనా" విడుదలయి పోయిన సంధర్భంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. హీరో తండ్రి, అక్క, తమ్ముడు ...

Monday, 21 February 2011

అమ్మ భాష

నేడు మతృభాషా దినోత్సవం! ఏదో ఒకనాడు ఈ కాన్వెంట్ చదువుల పిల్లలు మిమ్మల్ని అడగొచ్చు! "డాడీ , అమ్మంటే ఎవరూ ?" అని !! మనకేమో మన పిల్లలు తెలుగు మాట్లాడితే నామోషీ ! వాళ్ళ నోటంట మమ్మీ, డాడీ అనొస్తే మనకెంతో ఖుషీ !! "డాడీ"...

Saturday, 19 February 2011

అద్వానీ పీవీ ఐతే !!

ఇప్పుడు అంతా కంప్యూటర్ మాయాజాలమే ! ఎక్కడో ఒకరిద్దరు నాలాంటి వాళ్ళు తప్ప, ఇందులో నాలుగేళ్ల బుడుగులూ, సీగానాపెసూనాంబలూ ప్రవీణులే! మద్రాసు నుంచి వేసవి సెలవులకు ఇక్కడికొచ్చిన మామనవడు నృపేష్ ( ఐదేళ్ల క్రితం మాట) నా కంప్యూటరుపై ఎన్నెన్నో మాయలు , గేములు చేస్తుంటే నే ఆశ్చర్యపడుతుంటే , నా వైపు ఓ పిచ్చివాడి వైపు...

Monday, 14 February 2011

ఆ ఈ రోజు ఉదయాన్నే మా తూగో ఈనాడు చూడగానే మా బ్యాంకు కొలీగ్ బి.వి.యస్.యల్.ఎన్.శాస్త్రి ఫొటో, ఆర్టికల్ చూడగానే, మన శాస్త్రి బీసీసీఐ అంపైర్ గా పనిచేసిన విషయం గుర్తుకొచ్చింది. ప్రతి సారి మేము కలుసుకున్నప్పుడు రెటైరయిన మే మిద్దరం ఆ విషయం మాట్లాడు కోలెదు. ఏ మంటే నాకు క్రికెట్ అంటే ఏ మాత్రం అభిరుచి లేక పోవడం...

Saturday, 12 February 2011

విధి-విచితం !! !

నేను విధిని నమ్ముతాను. నేనాడూ ఇలా బ్లాగును స్వంతంగా నిర్వహిస్తానని, ఎక్కడో పూనాలో వుండే ఫణిబాబు గారు రాజమండ్రికి వచ్చి కొంతకాలంగడపటం, ఆయన మా హాసం క్లబ్ కువచ్చి అటు తరువాత మా ఇంటికి వచ్చి నా చేత బ్లాగును ఓపెన్ చేయించి నా గురించి చి"సౌ"జ్యోతిగారికి చెప్పి నా బ్లాగును వ్రాయటానికి సహకారం అందించడం , ఇవన్నీ నిజంగా...
ఆదిభట్ల నారాయణదాసుగారు హరికధా పితామహులే కాకుండా ఎన్నెన్నో రంగాల్లో నిష్టాతులు. ఆయన అనేక భాషలు మాట్లాడగలిగేవారు అష్టావధానాలు చేశారు. ఆయన దాదాపు 21 హరికధలను స్వరపర్చారు. సంస్కృతాంధ్రాలలో నూటికి పైగా గ్రంధాలను రచించారు. ఆయన చమత్కారి. ఒకసారి శ్రీదాసుగారు హరికధ చెప్పడానికి...

Thursday, 10 February 2011

మా ఊరి చరిత్ర

మా ఊరి పేరు రాజమహేంద్రవరం! అదే నండి ఆ పేరును పలకలేని ఆంగ్లేయులు మా ఊరి పేరును రాజమండ్రి అనేశారు. అఖండ గోదావరిమాత తీరంలో వున్న నగరం మా రాజమండ్రి..ఇప్పుడు ఈ నగరాన్ని తెలుగులో రాజమహేంద్రి అని పిలుస్తున్నారు. వెయ్యేళ్ళ చరిత్ర గల పట్టణం రాజమండ్రి. గోదావరికి తూర్పున వెలసింది. . తూర్పు చాణుక్యుల ఆధీనంలో ఈ నగరం వుండేదని చరిత్రకారులు...

Tuesday, 8 February 2011

రాజకీయ కార్టూనిస్ట్ గా శ్రీ ఆర్కే లక్ష్మణ్ మనకు తెలుసు. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రికలో ప్రతి రోజూ వేసే పాకేట్ కార్టూన్లు, వాటిలో ఆయన సృష్టించిన కామన్ మాన్ పాత్ర పాఠకులను విశేషంగా ఆకర్షించడమే కాకుండా, ఆ పాత్రకు శిలావిగ్రహాన్ని తయారు చేసి ప్రతిస్ఠించారంటే చిత్రమే కదా ?! టైమ్స్ పత్రిక సంస్థ ప్రచురించే The Illustrated...

Monday, 7 February 2011

ఫొటో పజిల్ ! !

పైనున్న ఈ ఫొటోలో మధ్య నున్న వ్యక్తి ఎవరో చెప్పగలరా ? ప్రయత్నించి చూడండి. ఓ చిన్న క్లూ. ఈయన ఓ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ! జవాబు తెలియకపోతే క్రింద నున్న జవాబు లోని పదాలను కుడి నుండి ఎడమకు జాగ్రత్తగా చదవండి! <><><><><><><><><><><><><><><><><><><>...

Sunday, 6 February 2011

కార్టూన్ పుస్తకాలు

తెలుగు వాళ్ళు హాస్యప్రియులు. మనకు కార్టూనిస్టులకు కొదవలేదు. శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు నా సురేఖార్టూన్స్ పుస్తకానికి ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు. "భారతిలో "త.రా (తలిశెట్టి రామారావుగారి ప్రభంధకన్య ) తరవాత తరతరానికీ ఎదిగే కార్టూన్ లు లక్షోపలక్షలు ... ఎందరో మహానుభావుకులు ఎన్నోవేసేశారు ; మరి ఈ తరం వారికేం మిగిల్చారు అని జాలిపడుతూ...

Saturday, 5 February 2011

బ్నిం పేరుతో అనేక కార్టూన్లు, కధారచనలు చేసిన శ్రీ బియ్యెన్మూర్తి గారికి 2010 సంవత్సరానికి కళారత్న అవార్డు వచ్చిందన్న సంతోష వార్త నాకు రెండు రోజుల క్రితమే తెలిసింది. ఆయన కధా రచయితగా, కార్టూనిస్టుగా ఈ పురస్కారానికి ఎన్నికయ్యారు. ఆయన వివిధ పత్రికల్లో పనిచేశారు. చిన్నతెరకు స్క్రిప్ట్ లు వ్రాశారు. నాలుగు సార్లు...

Thursday, 3 February 2011

నిన్నటి "ఈనాడు" లో శ్రీధర్ కార్టూన్ చూడగానే ఆయన గురించి నా భావాలు మీతో మరో సారి పంచుకోవాలనిపించింది. ఈ రోజుల్లో ప్రతి ఉద్యోగి అతను నిర్వహించే శాఖ ఏదైనా మంచి జీతభత్యాలకోమరోదానికో తను పని చేసే సంస్ఠలను వదలి మరో సంస్థకు వెళ్ళడం పరిపాటి. కాని శ్రీధర్ దాదాపు ఆనాటి నుంచి...

Tuesday, 1 February 2011

గిన్నెస్ బుక్కు పైకెక్కిన మన బ్రహ్మానందంగారి పుట్టిన రోజు ఈ వేళ! ఆయనకు జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 2003లో " హాసం" సంగీత హాస్యపత్రికలో " ప్రముఖాముఖి " పేరిట ప్రముఖ హాస్య నటులు ఆయనతో చేసిన ముఖాముఖిని "హాసం" సౌజన్యంతో మీకోసం, క్లుప్తంగా. . <><><><><><><><><><><><>...
  • Blogger news

  • Blogroll

  • About