RSS
Facebook
Twitter

Thursday, 31 March 2011

ఈ రోజు ఆంధ్రజ్యొతి దినపత్రిక తెరవగానే లోపలి పేజీలో "బాపూ పుస్తకంపై నిషేధం?" అన్న వార్త అగుపించింది. అదేమిటి బాపుగారి పుస్తకాల్లోని బొమ్మలు నవ్విస్తాయి మరెందుకీ నిషేధం అని ఆశ్చర్యపడి లేచి విషయం చదివాక అమ్మయ్యా ! ఇదా సంగతి అని కుదుటపడ్డాను. ఎవరో విదేశీపెద్దమనిషి గాంధీ గారి మీద అవాకులు...

Wednesday, 30 March 2011

కొండలలో కోనలలో వయ్యారంగా ఉరకలెత్తే గోదారమ్మ రాజమహేంద్రవరం చేరుకోగానే గంభీరంగా సాగిపోతుంది. గోదారమ్మ నడుముకు వాడ్డానంగా అమరిన రెండు వంతెనల మధ్య గోదావరి నది అందాలు పకృతి ప్రేమికులకు మధురానుభూతిని కలిగిస్తుంది. ఆ పాత కొత్త వారధుల మధ్య ప్రతి ఏడాది మార్చి చివరి రోజుల్లో సూర్యభగవానుడు...

Tuesday, 29 March 2011

డి.కె.పట్టమ్మాల్ సంగీతం విన్న జర్మనీ దేశపు వనిత " మీ భాష నాకు తెలియకపోయినా మీ సంగీతం నన్ను ఎదేదో కొత్త అనుభూతులను కలుగ జేసింది." అని అన్నదంటే చాలు ఆమె సంగీతంలో ఎంతటి ప్రతిభావంతురాలో అని తెలుసుకోడానికి! 1919 సంవత్సరం మార్చి 28న తమిళనాడు కాంచీపురంలో జన్మించిన పట్టమ్మాల్ పూర్తి పేరు దామల్ కృష్ణస్వామి పట్టమ్మాల్. ఐదేళ్ల...

Monday, 28 March 2011

రమణగారికి హాస నీరాజనం

నిన్న ఆదివారం సాయంత్రం మా హాసం క్లబ్, రాజమండ్రి గౌతమీ గ్రంధాలయంలో శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారి హాస నీరాజనం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాము. రమణ గారికి అన్ని వయసులవారిలోఎంతమంది అభిమానులున్నారో నిన్నటి సమావేశం తెలియజేసింది. హాలు పూర్తిగా నిండిపోయి చాలామంది హాలు బయట ద్వారం దగ్గర నిలబడి కార్యక్రమాన్ని చూడవలసి వచ్చింది. ఈ కార్యక్రమానికి...

Sunday, 27 March 2011

మంచివాడి మీద ఒక పద్యం

వెక్కిరిస్తూనే జీవితాన్ని చక్కదిద్దే వాడా ! తెలుగు తనానికి వెలుగు తనం జోడించిన ప్రోడా ! రెండు గీతల్లో పన్నెండు కావ్యాలు ధ్వనించిన ఋషీ !* నువ్వంటే మాకు కుషీ ! నువ్వు పెట్టిన ఒరవళ్ళు నీతరం ద్దిద్దుతున్నందుకు...

Saturday, 26 March 2011

తిరుపతి వేంకట కవులు

దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినార మీ మీసలు రెండుబాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు,గెల్చిరేని యీ మీసలు తీసి మీ పద సమీపములన్ తలలుంచి మ్రొక్కమే !! నేడు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి జయంతి ( మార్చి 26) ఆ మహాకవిని...

Friday, 25 March 2011

1924లో అలా...మొదలైంది !!

మీరు పై ఫొటోలో చూస్తున్న ధియేటర్ రాజమండ్రిలో అతి పురాతనమైన ధియేటర్. రాష్ట్రంలో నిర్మించబడ్డ రెండో సినిమా టాకీస్. దీన్ని 1924లో నిర్మించారు. మొదట ఇందులో మూకీ చిత్రాలు ప్రదర్శించేవారట. భారత చలన చిత్ర రంగంలో టాకీ చిత్రాలకు నాంది పలికిన మొట్టమొదటి చిత్రం "అలంఅరా" (హిందీ) 1931 లో ఇక్కడ ప్రదర్శించారు. మూకీలకు అటు తరువాత...

Wednesday, 23 March 2011

కన్యాశుల్కం చదవడం, భమిడిపాటిని చూడడం వాడడం, బారిస్టరు పార్వతీశంతో నడవడం, వుడ్ హౌస్ వరడ్-ప్లే-గ్రౌండ్సులో చెడుగుడు ఆడడం, లా రలెండ్ హార్డీ, చాప్లిన్ లూ, మార్క్స్ బ్రదర్సూ చూడడం మాయిద్దరికీ యిష్టం. సోగ్గా నడిచే బొమ్మాయిల వెనకాలే నడుస్తూ వాళ్ళ నడుముల మీద...

Tuesday, 22 March 2011

నీటిమీద రాతలు

ఈ రోజు ఉదయమే ఈనాడు పేపరు చూడగానే నేడు ప్రపంచ జలదినోత్సవం అని కనబడంది. ఏమిటో మనకు రోజుకో ఉత్సవాలు రోగాలదగ్గరనుంచి అన్ని విషయాలమీద ఉత్సవాలే. నిన్ననే అటవీ దినోత్సవం జరుపుకున్నాం.గుర్తుగా తిరుమలలోని అడవంతా కాలిపోయింది. మరి ఈరోజు జలప్రలయం ఏమైనా వస్తుందేమో అని భయంవేసింది. ఇంతలోనే శ్రీమతి మంచి నీళ్ళు రావటంలేదంటూ ఓ కేక ! వాచ్ మన్ను అడిగితే ఐదుగంటలకే...

Sunday, 20 March 2011

ఆ రోజుల్లో ప్రకటనలు !

ఇప్పటి ప్రకటనలకు అప్పటి ప్రకటనలకు ఎంత తేడా వున్నదో పై ప్రకటనలు చూస్తే తెలుస్తుంది. ఆనాడు ఉపయోగించిన పదాలకు ఇప్పటి ప్రకటనలలోని పదాలకు కాలంతో వచ్చిన మార్పులతో తేడా అగుపిస్తుంది. ఇప్పుడు ప్రచార సాధనాలు పెరిగాయి. ఒక వస్తువు గురించిన విశేషాలు వినిమయదారులకు చేరే దారికి ఆనాడు పత్రికలే మార్గదర్శకాలు.. కాని చదువొచ్చిన వారికే ఆవస్తువు గురించి తెలుసుకొనే అవకాశం...

Saturday, 19 March 2011

ఈ రోజు హొలీ పండుగ. మన భారతదేశం వివిధరకాల ఆచారాలు, సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే సరదా పండుగల్లో హొలీ ముఖ్యమైన పండుగ. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగని ఆనందోత్సహాలతో అన్ని వయసుల వారు జరుపుకుంటారు వసంతకాలం రాకకు గుర్తుగా పకృతి అంతా పచ్చపచ్చగా అగుపిస్తూ సుందరంగా కనులవిందు చేస్తుంది....

Tuesday, 15 March 2011

మంచం కబుర్లు

ఈరోజు బాపుగారి ఆనాటి జ్యోతి పత్రికలోని ఓ కార్టూన్ చూడగానే ఆ రోజుల్లోని నవారు మంచాలు జ్ఞాపకం వచ్చాయి. ఇప్పుడెక్కడా నవారు మంచాలు కనిపించడంలేదు. అన్నీ మోడ్రన్ మంచాలు. ఇనపవీ ,లోపల బోల్డు సామాన్లు దాచుకొనేవీ ఎన్నెన్నో! పూర్వం నవారు మంచాలతో బాటు నులక మంచాలు వుండేవి. మడికోసం వాటిని తడిపినప్పుడు తమాషాగా ఒంకర పోయేవి....

Monday, 14 March 2011

ఇప్పటి మ్యూజిక్ సిస్టమ్లు, ఐపాడ్లు లేని రోజుల్లో ఆనాటి ప్రముఖుల గానం విని ఆనందించాలంటే గ్రామఫోన్ రికార్డులే శరణ్యం. ఓ గాయకుడు రికార్డు కంపెనీల మెప్పు పొందినప్పుడే అతని పాటలు రికార్డులుగా విడుదలయేవి. మధుర గాయకులు ఘంటసాల మాస్టారును కూడా మొదట ఆయన గాత్రం బాగోలేదని తిరస్కరించారట! ఆ రోజుల్లో ఓ ప్రముఖ గ్రామఫోను కంపెనీలో ఉద్యోగం చేస్తున్న...

Sunday, 13 March 2011

చందమామలో 1953 నుంచి అద్భుతమైన చిత్రాలు వేస్తున్న శ్రీ శంకర్ ( కె.సి.శివశంకర్), చందమామలో కార్టూన్లు అప్పు డప్పుడు వేసేవారు ఫిబ్రవరి 1959 సంచికలో ఆయన వేసిన కార్టూన్ మీరు ఇక్కడ్ చూడండి. ఆయన చిత్రాలు సన్నని పెన్ స్ట్రోక్స్ తో, ముఖ్యంగా పౌరాణిక చిత్రాలు కమణీయ దృశ్య కావ్యాలుగా...

Saturday, 12 March 2011

అన్నపూర్ణావారి " వెలుగు నీడలు " చిత్రానికి శ్రీశ్రీ ఏనాడో వ్రాసిన పాట "పాడవోయి భారతీయుడా" అన్న పాట నేటి పరిస్థితులకు సరిపోవడం ఆశ్చర్యమే! పదవీ వ్యామోహాలు-కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగె నేడు ! ప్రతి మనిషి మరి యొకరిని దోచుకొనేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే! స్వార్ధమే అనర్ధదాయకం ! అది చంపుకొనుటే...

Wednesday, 9 March 2011

జపాన్ లో మన శ్రీధర్

మన తెలుగు కార్టూనిస్టులు చాలా మంది విదేశాల్లో కూడా ఎన్నో కార్టూన్ ప్రదర్శనలలో పాల్గొని బహుమతులు ప్రశంసలు పొందారు. ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్, జపాన్ కార్టూనిస్ట్స్ అసొసియేషన్ సహకారంతో "జపాన్ ఫౌండేషన్ ఫోరమ్" 1955లో జపాన్లో Asian Cartoon Exhibition ఏర్పాటు చేసిన. ప్రదర్శనలో మన దేశం తరఫున పాల్గొన్నారు....

Tuesday, 8 March 2011

బొమ్మల కధలు

విదేశాల్లో బొమ్మల కధల పుస్తకాల్లు కోకొల్లలు. డిసీ కామిక్స్ లాంటి ఎన్నెన్నో బొమ్మల కధల పుస్తకాలు అక్కడి పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకర్షించాయి. అవే పుస్తకాలు మన దేశంలోనూ దిగుమతిఅయ్యాయి. ఆకధలన్నీ సూపర్ మాన్, స్పైడర్ మాన్ లాంటి కధలు! ఆ తరువాత ఆ కధలే సినిమలుగానూ వచ్చాయి. మన దేశంలోని పిల్లలు ఆ బొమ్మల కధలను...

Friday, 4 March 2011

మీరు చూస్తున్న ఈ ఫొటోలు SMALL TALK అన్న పుస్తకం లోనివి. చిట్టిపాపాయిల ఫొటోలను SYMS అనే అనే వ్యక్తి వేరు భంగిమలలో ఫొటోలు తీసి ఆ ఫొటోలకు చక్కని వాఖ్యలను వ్రాసారు. దీన్ని పుస్తక రూపంలో Jaico Publishing House వారు 1958 లో ప్రచురించారు. ఈ పుస్తకం మా...

Thursday, 3 March 2011

చాలా చాలా ఏళ్ళక్రితం తపాలాబిళ్లల కాగితాలలో ఈకాలంలో లాగ ఒక బిళ్లకీ మరో బిళ్లకీ మధ్య బెజ్జాలుండేవి కావు. వాటిని వేరు చేయాలంటే కత్తెరతో కత్తిరించడమో, చాకుతో కోయడమో చేయవలసి వచ్చేది. ఒక పత్రికా విలేఖరి తన హోటల్ గదిలో కూర్చొని తన పత్రికకు పంపవలసిన ...

Tuesday, 1 March 2011

1945 సంవంత్సరంలో ముళ్లపూడి వెంకటరావు, సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే ఇద్దరు అబ్బాయిలు మద్రాసు కేసరీ హైస్కూళ్ళో సహాధ్యాయులు. "బాల" పత్రికలో అమ్మమాట వినకపొతే అనే కధ , బాల శతకాన్నిఒకబ్బాయి రచిస్తే , మరో అబ్బాయి "కవ్వపు పాట" అనే రచనకు బొమ్మ గీశాడు. వాళ్ళే పేద్దవాళ్ళయి ఒకరేమో అక్షరాలతో ఆడుకొనే...
  • Blogger news

  • Blogroll

  • About