RSS
Facebook
Twitter

Tuesday, 31 May 2011

స్టేట్ గ్యాలరీ, మాదాపూర్ లో జూన్ 4, 5 ,6 తేదీల్లో బాపుగారి ఒరిజినల్ బొమ్మలతో బొమ్మలకొలువు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుందన్న ఆహ్వాన పత్రం చూశాక, 2001 , మార్చి స్మైల్ సంచిక 16, 17 పేజీలలో చదివిన " బాపు బొమ్మల కోసం కోటి రూపాయల మ్యూజియం " అన్న ఆర్టికల్ జ్ఞాపకం వచ్చి ఆనాటి ఆ ఆర్టికల్ మీ ముందు వుంచుతున్నాను. చదివి ఆ...

Saturday, 28 May 2011

ఈ రోజు తారకరాముని జయంతి

ఈ రోజు నందమూరి తారక రామారావు గారి పుట్టిన రోజు. తెలుగువాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిజంగా తెలుగు నేలపై నిలబెట్టిన మహనీయుడాయన. తెలుగు వాళ్లనే ఒక జాతి వుందనీ , ఉత్తరభారత దేశప్రజలకూ చాటి చెప్పిన గొప్ప వ్యక్తి రామారావు. మనల్ని మద్రాసీలుగా పిలవబడుతుంటే " తెలుగు " వాణిని పార్లమెంటులో వినిపించాడు. మామూలుగా దీనికి కూడా మన తెలుగు వాళ్ళు కొందరు హర్షించలేదు....

Tuesday, 24 May 2011

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అన్నారు ఆత్రేయ. కన్నీళ్లను ఇంగ్లీషులో " టియర్స్" అని అంటారుగానీ, ఏడిస్తే, నవ్వితే వచ్చే ఆ కన్నీళ్ళు కళ్ళనుంచే వస్తాయి కాబట్టి " ఐస్ " వాటర్ అని అంటే కాస్త హాస్సెంగా వుంటుంది కదా? కన్నీళ్ళ రుచి ఉప్పగా వుండటానికి కారణాన్ని ప్రఖ్యాత రచయిత జనార్దన మహర్షిగారు తన " వెన్నముద్దలు " పుస్తకంలో సరదాగా...

Friday, 20 May 2011

ఊమెన్ కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ ! ఆయన గురించి మన బ్లాగరు మితృలు శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారు తన saahitya-abhimaani.blogspot.co ద్వారా ఇదివరలో తెలియ జేశారు.ఆంధ్ర సచిత్రవార పత్రిక సంపాదకులు శ్రీ శివలెంక రాధాకృష్ణగారు శ్రీ ఊమెన్ కార్టూన్లను వారం వారం మొదటి పేజీలో ప్రచురించే వారు. ...

Thursday, 19 May 2011

ఈనాటి తెలుగు దినపత్రికలలో పాఠకుల దృష్టి పడేది మొట్టమొదట ఆనాటి కార్టూన్లమీదే! కార్టూన్లకోసం పత్రికలు కొనే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారని నా నమ్మకం. నిన్న జరిగిన రాజకీయాలన్నీ ఒక్క గీతలో మన కళ్ళముందు ప్రత్యక్షంచేస్తాడు కార్టూనిస్ట్ !. ఇది వరలో రాజకీయ కార్టూన్లకు ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్ పిళ్లై గారి "శంకర్స్ వీక్లీ...

Wednesday, 18 May 2011

కోతి మూకబుర్లు !!

మరీ అల్లరి చేసే పిల్లల్ని కోతిమూక అంటాం. ఏవియస్ కోతిమూక పేరిట ఓ సినిమాయే తీసేశాడు. కొందరు పెద్దమనుషుల నడవిడిక చూస్తుంటే పిల్లల అల్లరికన్నా, కోతులు చేసే గోల కన్నా ఘోరంగా వుంటుంది. నిజానికి కోతులు ఆ చెట్టుమీద నుంచి ఈ చెట్టుమీదకీ ...

Wednesday, 11 May 2011

తోడు నీడగా !!

నేను దాదాపూ నలభై ఐదు ఏళ్లక్రితం ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో వేసిన గుర్రపు పందేల కార్టూన్ ( అప్పుడు నేను బాపట్ల ఎస్బీఐ లో పని చేస్తున్నాను) పై మితృలు డాక్టర్ జయదేవ్ బాబుగారు పెద్ద మనసుతో తన అమూల్యమైన అబిప్రాయాన్ని ఇలా తెలియ జేశారు. "సురేఖ గారి రేస్ కార్టూన్...

Sunday, 8 May 2011

అమ్మమాట

అమ్మ అన్నపదం ఎంతో మధురమైన పదం! అమ్మను తలచు కోవడానికి ప్రత్యేకంగా ఏడాదికి ఒకరోజును ఎన్నుకోడం మన సాంప్రదాయం కాదు ! అమ్మ ప్రతి క్షణం మన ముందూ వెనుకా వుంటూనే వుంటుంది. మా అమ్మ ఫొటోలను మీకు ఇక్కడ వరుసగా చూపిస్తున్నాను. మా అమ్మగారి దగ్గర కంటే నాన్నగారి దగ్గరే మాకు చనువెక్కువ. ఏమంటే అమ్మ మేము తప్పుగా మాట్లాడినా,(వస్తది,పోతది లాటి మాటలు) విపరీతంగా...

Saturday, 7 May 2011

మనసుకవిగా పేరుపొంది అభిమానుల మనసులు దోచుకున్న ఆత్రేయగారి జయంతి నేడు. రాయక నిర్మాతలను, రాసి ప్రేక్షకులను ఏడిపిస్తారని ఆయన గురించి చమత్కరిస్తారు. ఆయన వ్రాసిన ఎన్నో పాటల చరణాలు వింటే చాలు, ఆ పాటల సాహిత్యం కలకాలం మన మనసులనుంచి చెరిగిపోవు. అలానే ఆయన సంభాషణలు అందించిన ప్రేమనగర్, డాక్టర్ చక్రవర్తి,మాంగల్యబలం,...

Thursday, 5 May 2011

స్మృతి కవిత లో నా కవిత

శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి స్మృతి కవిత పేరిట ఎం.ఎస్.సుబ్బులక్ష్మీ ఫౌండేషన్ ( MSSF ) వారు కవితలను పుస్తక రూపంలో నవంబరు 2006 లో ప్రచురించారు.ఆ పుస్తకంలో మాజీ రాష్ట్రపతి డక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం, లకుమ, డాక్టర్ బూసురపల్లి వెంకటేశ్వర్లు, శ్రీమతి నన్నపనేని రాజకుమారి,...

Sunday, 1 May 2011

నవ్వుల దినొత్సవం రోజున నేను గీసిన కొన్ని కార్టూన్లు మీ ముందు వుంచుతున్నాను. అందరికీ నవ్వుల శుభాకాంక్షలు...
  • Blogger news

  • Blogroll

  • About