RSS
Facebook
Twitter

Sunday, 31 July 2011

ఇంతకుముందు తెలుగులో కూడా నటులకు ( చిరంజీవి ) ప్రత్యేకంగా ఒక పత్రిక కొతకాలం క్రితం వచ్చేది. ఇంగ్లీషులో ఇలా నటుల మీద, అలానే కొన్ని సినిమాల మీద పత్రికలు వచ్చాయి. THE BEST OF STALLONE పేర ఓ పత్రిక వెలువడింది. ఇందులో స్టాలోన్ నటించిన రాకీ , స్టేయింగ్ అలైవ్, రాంబో మొదలైన చిత్రాల లోని స్టిల్స్, చిత్ర నిర్మాణ విశేషాలు ఉన్నాయి.అలానే...

Saturday, 30 July 2011

"రస హృదయ వశిష్టుడు" సినారె నిన్ననే ( 29 ) తేదిన 81 వ జన్మదినం జరుపుకున్నారు.ఆచార్యుడు,ప్రముఖకవి,సినీ గేయ రచయిత శ్రీ సి.నారాయణ రెడ్డిగారు తెలంగాణాలోని హనుమాజీపేట అనే చిన్న గ్రామంలో 1931లోజన్మించారు. సినారెగా పేరు గాంచిన ఆయన హైదరాబదు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా పని చేస్తూనే తెలుగు సినీరంగంలోకి 1961లో...

Friday, 29 July 2011

ఆత్మకధలు వ్రాయటం, ఇంకొకరి కధలను వేరొకరు వ్రాయటం సులువు కాదు. తన గురించి వ్రాసుకోవడంలో నిజాలు వున్నా అవి ఆత్మ స్తుతిలా చదివే వాళ్ళకు అగుపించవచ్చు..అలానే మరొకరి కధ వ్రాస్తుంటే వాళ్లకధ వ్రాసే అవకాశం వచ్చినందుకు పొగుడుతున్నాడనిపించవచ్చు. రమణగారు తన కధను కోతికొమ్మచ్చిగానూ,...

Tuesday, 26 July 2011

గడచిన శనివారం ప్రపంచ ఐస్ క్రీమ్ దినోత్సవమట. వైజాగులో బహు వేడుకగా జరుపుకున్నారని వార్తలొచ్చాయి. నాకూ ఇష్టమైన ఐస్క్రీమ్ కూ ఇలా ఓ పండగ రోజు వున్నందుకు చాలా సంతోషించాను కాని వెంటనే బాధా కలిగింది. కారణం ఐస్ క్రీమ్ తినటమే కాకుండా ముఖానికి, ఒంటికి అదేదో కోల్డ్ క్రీమ్ లా పూసు కోవటం...

Monday, 25 July 2011

యుద్ధవాతావరణం మీద తీసిన ఈ సినిమా నిజంగా జరిగిన కొన్ని సంఘటనలను కొన్ని మార్పులు చేసి "ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్" పేరిట 1957 డిసెంబరు 18 న విడుదలయింది. ఎనిమిది అస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ఈ చిత్రం, ఏడు అవార్డులు కైవసం చేసుకొని ఈ నాటికీ మేటి చిత్రంగా నిలచింది. ఉత్తమ సినిమా,ఇందులో నటించిన అలెక్ గిన్నెస్...

Sunday, 24 July 2011

అవునండీ ! నిఝం !! మన తెలుగు వాడు గీసి వ్రాసిన "మరపురాని మాణిక్యాలు" పుస్తకానికి "ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ " గా ప్రశంస వచ్చింది ! ఆ గీతకారుడు, రాతకారుడు మరెవరో కాదు! ప్రఖ్యాత కార్టూనిస్ట్ , "మిసెస్ అండర్ స్టాండింగ్"లాంటి మంచి మంచి హాస్యరచనలు చేసిన, చేస్తున్న మిత్రులు శ్రీ బ్నిం. ఇటీవలే జరిగిన బాపు బొమ్మల కొలువు...

Friday, 22 July 2011

( సరదా కధ) ఆయ్! బాబోయ్!!

అసలే అమావాస్యరాత్రి ! చినుకులు మొదలయ్యాయి. మొండిగా ఒంటరిగా బయలుదేరా!! హైవేలో హటాత్తుగా స్కూటరు చెడిపోయింది.చుట్టూ కటిక చీకటి. మెరపు మెరిసినప్పుడు గాలికి ఊగుతున్న చెట్లు జుట్టువిరబూసుకున్న దెయ్యాల్లా భయపెడుతూ అసలే తడిసిన ఒళ్ళేమో విపరీతంగా వణుకు మొదలయింది. ఇంతలో మరో మెరుపు మెరిసిన కాంతిలో ...

Wednesday, 20 July 2011

అతడు గీసిన గీత బొమ్మై అతడు పలికిన పలుకు పాటై అతని హృదయములోని మెత్తన అర్ధవత్కృతియై అతడు చూపిన చూపు మెరుపై అతడు తలచిన తలపు వెలుగై అతని జీవికలోని తియ్యన అమృత రసధినియై... చిత్రకారుడు కవి అడవి బాపిరాజుగారి...

Thursday, 14 July 2011

ఇందులో మాయేం లేదండి ! అంతా సినీ మాయ ! తెరపై కదలే బొమ్మలు నిజానికి ఓ వరుసలో వున్న కదలని బొమ్మలే !మనం కన్నుమూసి తెరచేలోపల ఒక బొమ్మ తరువాత మరొబొమ్మ వచ్చేస్తూ మన కన్నుల్ని మోసం చేయడమే సినిమా(వి) చిత్రం ! మన సినిమాలకు మాటలాడటం రానప్పుడు వాటిని మూకీలు అని పిల్చేవారు.1929 లో మూకీ చిత్రాలను ప్రదర్శిస్తూ, ఆ కధలు ప్రేక్షకులకు...

Tuesday, 12 July 2011

అమ్మగారు !!

ఈ మధ్య "అమ్మగారు" అన్న మాట తరచు వినిపిస్తున్నది. ఎక్కడ ?ఇంకెక్కడ? పేపర్లలోనూ, టీవీల్లోను. మన రాజకీయనాయకుడొకాయన మాట్లాడుతున్నపుడల్లా "అమ్మగారు" అంటూ ఏదో పని వాడిలా అంటుంటే "అమ్మ" అనే మంచి మాటకూడా చిరాగ్గా అనిపిస్తుంది. ఈ రోజుల్లో యస్సెమ్ములు ( అదే నండి సర్వెంట్ మెయిడ్స్ ) కూడా అమ్మగారు అనటం మానేశారు. "ఆంటీ" అని, ఆవిడగారి...

Monday, 11 July 2011

ఇప్పుడు సినిమాలు రంగులు హంగులు వేసుకొని వచ్చాయి కానీ ఆ రోజుల్లో పాపం సినిమాలకు మాటలే రా(లే)వు. తరువాత అలంఅరా సినిమా టాకీగా విడుదలయితే జనం వింతగా విరగబడి చూశారు. అప్పుడు పర్మినెంటు ధియేటర్లు ఉండేవికావు. అన్నీ తాత్కాలిక టెంటు సినిమాలే. టాకీలు వచ్చాక అవి ఆడి పాడే సినిమా హాళ్ళకు "టాకీస్" లని పిలిచేవారు. తరువాత కాలంలో సినిమా...

Saturday, 9 July 2011

నెల్లూరులో శానిటరీ ఇన్స్పెక్టరుగా ఉద్యోగం చేసిన తిక్కవరపు రమణారెడ్డి 1951 లో సినిమారంగ ప్రవేశం చేశారు. సన్నగా పొడుగ్గా పొడుగుపాటి కర్రల మీద నడుస్తున్నాడా అనే టట్లు వుండే ఈ రమణారెడ్డి సంభాషణలలో నెల్లూరి యాసను జోడించి సంభాషణలు చెబుతూహాస్యనటుడిగా ప్రేక్షకుల అబిమానాన్ని పొందారు. సన్నగా వుండే వాళ్ళను రమణారెడ్డితో జనాలు పోల్చేవారు,.ఇల్లరికం...

Sunday, 3 July 2011

సరదా సరదాగా !!

రాబోయే కొత్త సినిమా !!లేదు లేదు పెరిగిన పెట్రో ధరలతొ, కారు కన్నా ఇదే కరుచౌక అని......!!మా నూరుగురు సోదరులకు వాహనములు సమకూర్చితిని !!పత్రికలలో వచ్చే ఫొటోలకు సరదా కామెంట్స్ జోడించి నే తయారుచేసినకొన్ని బొమ్మలు. ఇవి సరదాగా నవ్వుకోడానికి మాత్రమే...

Saturday, 2 July 2011

ఈ కాలం పిల్లలు

మొన్న ముఫైవతేదీన మితృడు దినవహి వి.హనుమంతరావు అద్యక్షుడిగా ఉన్నభారత్ వికాస్ పరిషత్, వివేకానంద శాఖ (రాజమండ్రి)వారు బాలవికాస శిబిరం స్థానిక మహావీర్ విద్యానికేతన్ లో ఏర్పాటు చేస్తూ , ఎనిమిది, తొమ్మిది తరగతి విద్యార్ధులకు కార్టూన్ల గురించి చెప్పమన్నారు. నాకు ఇష్టమైన విషయం కాబట్టి సంతోషంగా వెళ్ళాను. అక్కడి ఆడ...

Friday, 1 July 2011

జో జో జోకులానంద

ఈ రోజు ప్రపంచ జోకుల దినోత్సవంట ! ఇంకేం జోకులాడుకోటానికి ఇదో అవకాశం వచ్చింది. మా "హాసం క్లబ్" లో నేనూ, మితృడు హనుమంతరావు కల్సి వే(చే)సిన ఈ చిన్న జోకులాంటి స్కిట్ ! అలో అలో సలహాల్రావ్ ! ఎన్నాళ్ళకు దొరికావోయ్ ! నా దేహానికి వచ్చిన ఈ సందేహాన్ని నువ్వే తీర్చాలి! ఈ సలహాల్రావ్ పనే అది ! ఇంతకీ ఏమిటి నీ సందేహం ? ...
  • Blogger news

  • Blogroll

  • About