RSS
Facebook
Twitter

Thursday, 29 September 2011

శ్రీకాకుళం , కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలో గల శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం ఆంధ్రమహావిష్ణువు వెలసిన ఆలయంగా చెబుతారు.శ్రికాకుళం అనే ఈ పేరుని విదేశీ వర్తకులు తమ వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతాన్ని సిరికొలని, సిరికి కొలనుగా పిలిచే వారట. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వున్న మరో జిల్లా ముఖ్యపట్టణం పేరు కూడా శ్రీకాకుళంగా...

Saturday, 24 September 2011

తెనాలి ఐతానగరంలో 1908 ఆగష్ట్ 5వ తేదీన వెంకట సుబ్బారావనే చక్రపాణి జన్మించారు. ఆయన ఇంటి దగ్గరే వున్న ప్రాధమిక పాఠశాలలో ఐదో తరగతి పూర్తి చేసి, తెనాలి తాలూకా హైస్కూళ్ళో ఆరవ తరగతిలో చేరి ఎస్.ఎస్.ఎల్.సి.వరకూ చదివారు. జాతీయోద్యమంలో చేరి ఉత్సాహంగా పాల్గొన్నారు. 1934లో చక్రపాణిగారికి టిబీ సోకింది. మదనపల్లి శానిటోరియంలో...

Friday, 23 September 2011

దేముళ్లనూ వదలం !

ఈ కలికాలంలో మానవుడు దేముడికి భయపటం లేదు. వాడు ప్రతి రోజూ చేస్తున్న పాపాలకు భయపడుతున్నాడు. తన మోసాలు, అత్యంత నీచంగా పీడించి మేస్తున్న లంచాల గడ్డి ఎక్కడ పోతుందోనని ప్రతి రోజు భయపడుతూ బ్రతుకు వెళ్ళబోస్తున్నాడు. చివరకు తన పాపాల గోతిలోంచి బయటకు లాగడానికి ఆ దేముడికీ లంచాలు సమర్పిస్తున్నాడు. మనం చేసే పాపాలకు ఓ కొబ్బరికాయ...

Wednesday, 21 September 2011

మన గురజాడ అప్పారావుగారు.

ఈ రోజు శ్రీ గురజాడ అప్పారావుగారి 150వ జయంతి. ఆదుర్తి, అక్కినేని నిర్మించిన "సుడిగుండాలు" సినిమాలో ఒక డైలాగు మీకు గుర్తుండే వుంటుంది. ఈ కాలం పిల్లలకు గురజాడ అంటే తెలియదని అదెక్కడో మారుమూల ఓ గ్రామమనీ అను కుంటారనీ ఆనాడే మాటల రచయిత శ్రీ యన్నార్ నంది వ్రాశారు. గురజాడ కలం నుంచి వెలువడిన దేశభక్తి గీతాలు మన జాతీయగీతాల స్థాయికి మించినదిగా...

Tuesday, 20 September 2011

ఏ నాగేశర్రావ్? అదేనండి మన నాగేశ్వర్రావే ! అదే ఏ.నాగేశ్వరరావుకు 88 వ పుట్టిన రోజు. నాగేశ్వరరావనే చిన్న బీజం "ధర్మపత్ని" అన్న సినీమాలో ఓ చిన్న పాత్ర ద్వారా చిన్న పిల్లాడిగా (కన)పడినా నటుడిగా జన్మించినది మాత్రం "సీతారామజననం" చిత్రంలోనే !అటు తరువాత అంచెలంచెలుగా తెలుగు తెరపై వెలుగుతుంటే...

Thursday, 15 September 2011

యమలీల చిత్రంలోని వీడియో క్లిప్పింగ్ చూశారుగా ! ఇందులో మెంటల్ డాక్టరుగా నటించిన శ్రీ యుప్పలూరి సుబ్బరాయశర్మ జన్మ స్థలం విజయవాడ. అక్కడే ఎస్. ఆర్.ఆర్. కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్ రోడ్డూ రవాణాసంస్థలో 1971లో ఉద్యోగంలో చేరారు. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తితో "ఆడది" ,"అంతా ఇంతే" , "కీర్తిశేషులు" "వాంటెడ్ ఫాదర్స్" మొదలైన నాటికల్లో...

Tuesday, 13 September 2011

పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు , నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం ఇలా ఎన్నెన్నో మనసుకు హత్తుకొనే పాటల పాఠాలు నేర్పిన మనసు కవి ఆత్రేయ వర్ధంతి నేడు. ఆయన పాటలు తెల్గు సినిమా పాఠాలు ! ఆయన పాటకు ఓ మంచి నటుడి నటన, ఓ మంచి సంగీత దర్శకుడి...

Sunday, 11 September 2011

1952 లో అనుకుంటాను ( ఏమంటే నా దగ్గర 1953 నుండే చందమామలు వున్నాయి ) విచిత్రకవలలు సీరియల్ చందమామలో వచ్చేది. అప్పుడు నా వయసు 11 ఏళ్ళు. ఐనా ప్రతినెలా చందమామలోని ఆ కధ చదవడానికి ఆతృతగా అక్కా, నేనూ ఎదురు చూసేవాళ్లం. ఆ కధలోని రాక్షసులు, బారెడు గెడ్డంతో వుండే పొట్టివాడు, ఇలా ప్రతిదీ మమ్మల్ని , మాలాగే వేలాది...

Saturday, 10 September 2011

నానమ్మలు-అమ్మమ్మలు-తాతయ్యలు

ఇప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు , తమ పిల్లలకు దూరంగా వుంటున్నారు. వాళ్ళ అమ్మాయిలు దూరంగా అత్తవారింట్లో , అబ్బాయి(లు) ఉద్యోగ రిత్యా మరో ఊర్లో వుంటున్నారు. కానీ ఇది తప్పదు. సెలవుల్లో వాళ్లు అందరూ ఇంటికి వచ్చినప్పుడు ఆ సందడి ఆ సంబరం చెప్పలేనిది. అలానే తాతలు వాళ్ళదగ్గరకు వెళ్ళినప్పుడు మనవలతో గడిపే మధురక్షణాలు...

Wednesday, 7 September 2011

విచిత్ర కవలలు

ఈ ఫొటోలో వున్న మా ఇద్దరు పాపలు చి" మాధురి, చి"మాధవి ఒకే తేదీన, (సెప్టెంబరు 8) పుట్టారు ! కానీ కవలలు కాదు. ఏమంటే పుట్టిన తేదీ ఒకటే కానీ సంవత్సరం మాత్రం వేరు ! అందుకే విచిత్ర కవలలు అన్నాను. ఇద్దరి పుట్టిన రోజూ ఒకే రోజవటం వల్ల పుట్టిన రోజు వేడుక చేయడం చాలా సులువుగా వుండేది. ఈ ఫొటో మాధురికి ఏడేళ్ళు, మాధవికి ఐదేళ్లు వయసప్పుడు తీసినది. ఇద్దరు ఒకే స్కూల్లో,...

Monday, 5 September 2011

గురు బ్రహ్మ

తొలి ఉప రాష్ట్రపతి , రెండవ రాష్ట్రపతి ఐన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ రచించిన ఎన్నో పుస్తకాలు,ముఖ్యంగా భారతీయ తత్వ శాస్త్రాన్ని ఇంగ్లీషులోకి అనువదించి విదేశ పాఠకుల మన్నలను పొందాయి. ఆయన రచించిన The Reign of Religion in contemporary Philosophy, An Idealist View of Life, The philosophy of...

Friday, 2 September 2011

శ్రీ నండూరి రామమోహనరావు

నండూరి రామమోహనరావు గారు ఈ రోజు అస్తమించారనే వార్త మార్కట్వేన్, రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ తెలుగు అనువాదాలు మా చిన్ననాటే ఆంధ్రవార పత్రికలో చదివిన నాలాటి అశేష అభిమానులకు తీరని ఆవేదన కలిగించింది. బాపు రమణలు నండూరి వారి అనువాద ప్రతిభను గురించి ఇలా అంటారు. "ఎంత చక్కని తెలుగు-ఎంత చల్లని...

Thursday, 1 September 2011

ఈ రోజు వినాయక చవితి ! ఏ కార్యం ప్రారంభించాలన్నా విఘ్నాలను తొలగించే గణనాయకునికి పూజలు చేస్తాం! పార్వతీ మాత పసుపుతో బాలగణపతిని సృష్టించింది. మనం ఈ సారి గణపతిని మట్టితోనే తయారు చేస్తున్నాం. ఒక విదేశీయుడు విఘ్నేశ్వరుని గుడికి గంటను కట్టి తన మొక్కును తీర్చుకున్నా డంటే వినటానికి వింతగానే వుంటుంది. గోదావరి...
  • Blogger news

  • Blogroll

  • About