
"నాకూ మనసున్నాది " అంటూ కవితల పుస్తకం వ్రాసి ప్రశంసలందుకున్న ఈయన పేరు మహమ్మద్ ఖాదర్ ఖాన్. నిజంగా ఈయన మనసున్న మనిషి! రాజమండ్రి, దానవాయిపేట పోస్టాఫీసులో పోస్ట్ మాస్టారుగా పనిచేసి ఆ శాఖలో నాలుగుసార్లు ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెరెన్స్ అవార్డును అందుకున్న పనిమంతుడు. తెలుగు సాహిత్య ప్రేమికుడైన ఖాన్ తెలుగును మన తెలుగు వాళ్లకంటే అద్భుతంగా ...