
ఈ మధ్య నా బ్లాగు అభిమాని ఒకరు "దాదాపూ ప్రతి రోజూఏదో అడ్దమైన విషయం వ్రాసేవారు, మరిప్పుడు వ్రాయటం లేదు, మీకేం అవలేదు కదా ? " అంటూ కామెంటు పెట్టారు. అందుకు "నాకు బద్ధకం ఎక్కువయి వ్రాయటంలేదు" అని ఓ అబద్ధం చెప్పా.నిజానికి అసలు కారణం నేనో వ్యసనంలో చిక్కుకోవడమే. అంతకు ముందు ఇలా కొందరు సిగరెట్లకి , త్రాగుళ్ళకీ ఎందుకు బానిసలవుతారా అని అనుకుంటూ వుండేవాడిని....