RSS
Facebook
Twitter

Wednesday, 25 April 2012

ఏమిటో  ఈ మానవ  దేహానికి  సవాలక్ష  సందేహాలు.  కొందరు అడిగే  ప్రశ్నలు  చిత్రంగా  వుంటుంటాయి.  ఒక్కోసారి  నవ్వుతో  బాటు  విసుగూ  వస్తుంటుంది. పిల్లలకు  వచ్చే  సందేహాలు  అందుకు వాళ్ళు  అడిగే  ప్రశ్నలకు  ఓపికగా  సమాధానం చెప్పాలి. పెరిగే  వయసులో  వాళ్లకు  ఎదురుబడే  ఎన్నో...

Thursday, 19 April 2012

నవ్వించే పూతరేకులు

మా తూర్పుగోదావరి ఆత్రేయపురం పూతరేకులకు ప్రసిద్ధి. ఉలిపిరి (ఉల్లిపొరనే ఉలిపిరి అంటారేమో) కాగితంలా అతిసన్నగా వుండే పూతరేకుల పొరలలో నెయ్యి పంచదార పొడి వేసి మడతలుగా పెడతారు. ఇప్పుడయితే అన్నీ కుక్కర్ వంటలు వచ్చాయిగాని పూర్వం గిన్నెలలోనే అన్నం వండేవారు. గిన్నె పైన మూత పెడితే ఉడుకుతున్నప్పుడు పై మూత ఆవిరికి కదులుతూ గంజి, మూత సందులోంచి వచ్చి ...

Friday, 13 April 2012

మన తెలుగులో వున్న మరో విచిత్రమేమంటే మాటలకూ అర్ధాలు మరోలా ఒక్కోసారి మారిపోతుంటాయి. "చిన్నతనం" అన్న మాట చూడండి. దానికి "అవమానం" అని కూడా అర్ధం చెప్పుకోవచ్చు. మా చిన్నతనానికి, ఇప్పటి కాలానికి ఎన్నెన్నో మార్పులొచ్చాయి. ఆనాటి విషయాలు, ఆనాడు మేము తొడుక్కున్న బట్టలు ఈ కాలం పిల్లలకు వేసుకోడానికే చిన్నతనంగా వుంటాయి. ఇక్కడి మా చిన్నప్పటి ఫొటొ చూడండి. నాపాంటు ఎలా వున్నా వేసుకున్న...

Friday, 6 April 2012

సుందరాకాండ బహుసుందరం

వాల్మీకి రామాయణంలో సుందరాకాండకు ఎంతో ప్రాముఖ్యముంది. సుందరాకాండ పారాయణం శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఇందులో ప్రతి ఘట్టం సుందరమే !రామాయాణం హనుమనోట మరోసారి ఈ కాండలో వింటాం. లంకా నగర వర్ణన, మహర్షి వాల్మీకి కన్నులకు కట్టేటట్లు వర్ణించారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, కష్టకాలంలో ఎలా ఆలోచించి ధైర్యంతో ముందుకు సాగాలో హనుమ చెబుతారు.ఈనాటి యువతరానికి ఆనాడే వ్రాసిన మహత్తర మనోవికాస గ్రంధం...

Monday, 2 April 2012

అనాకారి బాతుపిల్ల

ఈ రోజు ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవం. బాలల కోసం దేశవిదేశ రచయితలెందరో ఎన్నో బాలసాహిత్యాలను అందజేశారు. వారిలో హాన్స్ క్రిస్టియన్ అండర్సన్ ఒకరు. ఆయన వ్రాసిన పుస్తకాలలో జానపదకధలను పిల్లల్కు మరింత దగ్గరగా తీసుకొచ్చాడు. ఆయన రచనలు The Little Mermaid , The Snow Queen, The Ugly Duckling , Tumbelina కధలు బహుళ ప్రాచుర్యం పొందాయి. The Ugly Duckling అనాకారి బాతు పిల్ల పేరిట 1960 సెప్టెంబరు...

Sunday, 1 April 2012

శ్రీరామ నామం మధురం మధురం

                      మా  ఇంట్లో  శ్రీరామనవమి  పూజ. ఈ  కళ్యాణం  బొమ్మలు  60  ఏళ్ల నాటివి బాపుగారి కళ్యాణరామయ్య బాపుగారికి  అత్యంత  ఇష్టమైన  రామయ్య  బొమ్మ.   శ్రీరామచంద్రుడు  సీతమ్మ                 ...
  • Blogger news

  • Blogroll

  • About