
బుడుగు వెంకట రమణగారి పుట్టినరోజు పండగంటే హాస్యాభిమానులందరికీ పండుగే. ఋణానందలహరిలో ఆయన హీరో అప్పారావుపేరే నాపేరైనందుకు ఇప్పుడు నాకెంత ఆనందమో !! చిన్నప్పుడునాకు మా తాతగారి పేరు (ఆయన పేరు వెంకటప్పయ్య పంతులు)అప్పారావు పేరు పెట్టినందుకు తెగ బాధపడిపోయేవాడిని. స్కూల్లోచాలా మంది పేర్లు కృష్ణ అనో, రామారావనో, ప్రభాకర్ అనో,రవి అనోవుండేవి. తరువాత పెద్దయ్యాక మా రమణగారి హీరో...