తెలుగు సినిమాలూ ! అరె ! ఏ మైందీ ?!!!మన తెలుగు సినిమాలకు ఏ ఒక్కచిత్రానికీ జాతీయ అవార్డురాలేదు. బొంబాయి
తరువాత అత్యధిక చిత్రాలు నిర్మించేదీ మన తెలుగు వాళ్ళే ! గత ఎనభై ఏళ్ళ ల్లొ
కోట్లు సంపాదించిన ఏకైక చిత్రమనీ, రెండువేల ధియేటర్ల పైగా విడుదలయిందనీ
చంకలు కొట్టుకుంటున్నాము. అలనాడు విడుదలయిన "లవకుశ" ఏ విదేశాల్లో
విదుదల కాలేదు. ఇప్పటిలా టిక్కేట్టు ధరలూ లేవు. రోజూ ఇన్ని ఆటల ప్రదర్శన
లేదు. ఐనా ఆరోజుళ్ళొ కోటిరూపాయలపైగా వసూలు చేసింది. 75 వారాల పైగా
ఆడింది. ఇప్పటి సినిమాలు అన్ని రోజులు ఆడుతున్నాయి. విడుదలయిన రెండో
రోజే ప్రతి సినిమాను సూపర్ డూపర్ హిట్ అంటూ డూప్ ప్రకటనలు. టీవీల్లో
ధియేటర్లలో చేసే హడావిడి తప్ప సినిమాలో విలువలు ఎక్కడున్నాయి.ఇక
అవార్డులు రాలేదంటే ఎలా వస్తాయి.
ఏయన్నార్, యన్టీఆర్ కాలంలో ప్రతి యేడాది తెలుగు సినిమాకు కేంద్రగుర్తింపు
తప్పక వుండేది. ప్రతి యేడాది ఢిల్లీ వెళ్ళి బహుమతి తీసుకుంటున్న అక్కినేనిని
ఆనాటి కేంద్ర మంత్రి డా.కేస్కర్ "మీరు మా అతిధి కాదు ; మాకు కస్టమర్ అయి
పోతున్నారు" అని అన్నారంటే మన తెలుగు సినిమాలు, నటులు ఆ రోజుల్లో
ఎంత గుర్తింపు పొందారో అర్ధమవుతుంది. నమ్మిన బంటు, స్పెయిన్ లో జరిగిన
అంత్ర్జాతీయ చలన చిత్రోత్సవంలో, అంతస్థులు సిడ్నీ చలన చిత్రోత్సవంలోను,
నర్తనశాల జకర్తా ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ న్యాయనిర్ణేతల ప్రశంసలతో బాటు
కీచకుడిగా నటించిన యస్వీ రంగారావు ఉత్తమ నటుడిగా అప్పటి ఇండోనేషియా
అద్యక్షుడు డాక్టర్ సుకర్నో చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
విప్రనారాయణ,అర్ధాంగి,తెనాలి రామకృష్ణ, తోడికోడళ్ళు, పెళ్ళినాటి ప్రమాణాలు,
మాంగళ్యబలం, జయభేరి,నమ్మినబంటు, మహాకవి కాళిదాసు, భార్యాభర్తలు,
ఇలా ఎన్నో తెలుగు చిత్రాలు ప్రేక్షక విమర్శకుల అభిమానాన్ని పొందాయి.
ఈ మధ్యకాలంలో మగధీర సాంకేతికరంగంలో ఎక్కువ అవార్డులు పొందింది.
కనీసణ్ "శ్రీరామరాజ్యం" చిత్రానికి కళా శాఖకైనా తప్పక ఓ అవార్డు వస్తుందను
కుంటే అక్కడా నిరాశే ఎదురయింది. ఈ నాడు తమిళం నుంచి డబ్బింగ్ అయి
వస్తున్న చిత్రాలలో తారల గ్లామర్ కంటే కధకు, చిత్రీకరణకు ప్రాముఖ్యతనిస్తూ
నిర్మిస్తున్నారు. మనకు కూడా మంచి దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు
ఉన్నారు. మన చిత్రాల తీరూ మారాలి.సెలెక్షణ్ కమిటీలో ఒక్క తెలుగు వాడూ
లేక పోవడం మనకు అవమానం!



.jpg)











.jpg)







.jpg)





