చందమామ రాగనే ముందర కధల కంటే బొమ్మలనే
ఆసక్తితో చూసే వాళ్ళం. చందమామ సీరియల్ కధలకు
దాదాపు "చిత్రా" బొమ్మలు వేసేవారు. తరువాత 1952
లో ఆసంస్థలో చేరిన శ్రీ శంకర్ కధలకు, పౌరాణిక కధలకు
బొమ్మలు అద్భుతంగా ఈనాటికీ వేస్తున్నారు. మే 1961
సంచికలొ మొదలై సెప్టెంబరు 1965 వరకూ వచ్చిన
రామాయణం గాధకు శ్రీ శంకర్ వేసిన చిత్రాలు రామాయణ
కావ్యమంత కమణీయంగా వుంటాయి. శంకర్ పూర్తి పేరు
కె.సి.శివశంకరణ్ 1924లో ఈరోడ్ దగ్గరగల ఊర్లో పుట్టారు.
చిన్న వయసులోనే 1934 లో ఆయన కుటుంబం మద్రాసు
వచ్చారు. ఆయన దస్తూరీ చలా అందంగా వుండటం చూసి
స్కూళ్ళో టీచర్ శంకర్ చేత ప్రతి రోజూ బోర్డు మీద సూక్తులు
వ్రాయించే వారట. చందమామ సంస్థలో చిత్ర, శంకర్ ఇద్దరూ
ఒకరికి ఒకరు పోటీగా వున్నా తరువాత మంచి స్నేహితులు
గా మారారు. చందమామ అధిపతి నాగిరెడ్డి గారు "చిత్రా ,
శంకర్ లు చందమామ అనే బండిని లాగే జోడెద్దులు" అనే
వారు..1952లో నెలకు 350 రూపాయల జీతంతో శంకర్
చందమామ లో ఆర్టిస్టుగా చేరారు.
88 ఏళ్ళ వయసు వచ్చినా , Arthritis తో ఆయన వేళ్ళు
ఇబ్బంది పెట్టినా చందమామకు ఆయన ఇంటి దగ్గరే అందంగా
బొమ్మలు వేస్తున్నారు. ఆయన ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి
చెన్నైలో వుండగా మరో ఇద్దరు అబ్బాయిలు ఒకరు కెనడాలో
మరొకరు మలేసియాలో వున్నారు. శంకర్ మరెన్నో బొమ్మలతో
చందమామ పాఠకులను అలరించాలని కోరుకుందాం.
బొమ్మలు చందమామ , శ్రీ శంకర్ సౌజన్యంతో