ఇప్పటి ప్రకటనలకు అప్పటి ప్రకటనలకు ఎంత తేడా వున్నదో పై ప్రకటనలు
చూస్తే తెలుస్తుంది. ఆనాడు ఉపయోగించిన పదాలకు ఇప్పటి ప్రకటనలలోని
పదాలకు కాలంతో వచ్చిన మార్పులతో తేడా అగుపిస్తుంది. ఇప్పుడు ప్రచార
సాధనాలు పెరిగాయి. ఒక వస్తువు గురించిన విశేషాలు వినిమయదారులకు
చేరే దారికి ఆనాడు పత్రికలే మార్గదర్శకాలు.. కాని చదువొచ్చిన వారికే ఆవస్తువు
గురించి తెలుసుకొనే అవకాశం వుండేది. అటుతరువాత సినిమా ధియేటర్లలో
ప్రకటనలు చూపించడం ప్రారంభించాక సామాన్య వినియోగదారుడికీ కూడా
తమ వస్తువుల గురించి తెలియజేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు చిన్నతెర
ప్రతి ఇంట్లో ప్రవేశించాక తాయెత్తుల దగ్గరనుంచి ఎన్నెన్నో ప్రకటనలు. ఒక్కో
సారి ఆ ప్రకటనలలో ఉపయోగించే భాష ఇబ్బందికరంగా వుంటుంటుంది. దీనికి
ముఖ్య కారణం ఆప్రకటనలలోని మాటలను స్థానిక భాషలోకి అనువాదం
చేసే వారి అతి తెలివి. ఏ పదాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో అనువాదకులకు
తెలియక పోవడమే. ఇటీవల ( ఇప్పుడు మార్పు చేశారులెండి ) ఒక మాల్ట్ డ్రింకు
ప్రకటనలో పిల్ల వాడు తన తల్లితో " అమ్మా! నాకూ వయసు వచ్చింది!"
అంటాడు. ఇక్కడ వయసు అన్న మాటకు భావం వేరుగా వుటుంది కదా?!
ఈ మధ్య తాయెత్తులు , అంటూ జనాల బలహీనతలమీద కుప్పలు తెప్పలుగా
టీవీల్లో ప్రకటనలు వస్తున్నాయి. మోసాలు దగాలూ అంటూ క్షణక్షణానికి
ఎలుగెత్తే మన న్యూస్ చానల్లు , వీటికి మాత్రం తెగ ప్రచారం ఇస్తున్నాయి. కొన్ని
ప్రకటనలు ఇప్పటి సినిమాల లాగానే పిల్లల్ని పక్కన పెట్టుకొని చూడలేం. ప్రతిదీ
తెల్సుకోవాలనే ఈ కాలం పిల్లలకు ఏదోలా మరో విషయం మరోలా చెప్పి
సమాధాన పరచడం ఈ నాటి పెద్దలు నేర్చుకోవాల్సిన అవసరం కలుగుతున్నది..
ఈ పై ప్రకటనలు 1954 ఆంధ్ర సచిత్రవార పత్రిక ( ఆంధ్ర పత్రిక) దసరా సంచిక
లోనివి.
సురేఖ గారూ,
ReplyDeleteచాలా బాగా చెప్పారండీ..!! పరభాషలలో వారికి మాత్రమే ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలని సూచిస్తోన్న పద బంధాలని యధాతధంగా మన భాషలోకి తర్జుమా చేసేటప్పుడు వచ్చే ఇబ్బందులే ఇవి. ముళ్ళపూడి వారు వారి కోతికొమ్మచ్చిలో ఇటువంటి ఉదాహరణనే ఇచ్చారు. వారు అడ్వర్టైజ్మెంట్ లకు మాటలు రాసేటప్పుడు.. ఏదో కంపెనీ వాళ్ళు బొంబాయి నుంచి హిందీ లో పంపిస్తే దానికి తెలుగులో చెయ్యాలట. హిందీలో ...'యే హమారా పరివార్ హై..!' ఇదీ వాక్యం.!! దీనికి మన గురువుగారు ' ఇది మా కుటుంబం' అని వ్రాసి పంపితే వాళ్ళు దానిని ' ఇది మా పరివారం' అని మార్చి పంపించారట. 'పరివారం' అనే మాటని 'దాసదాసీ జనానికి' పర్యాయపదం గా వాడతారని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదని బాధపడ్డారు. ఆ మధ్య తెలుగులోకి తర్జుమా చెయ్యబడిన హిందీ సినిమాలోని పాటలో... "జోళ్ళు పుచ్చుకో.. డబ్బులిచుకో" లాంటివి విన్నాం..!
'this programme is co-sponsored by...' అనడానికి కొన్నాళ్ళు... "ఈ కార్యక్రమం యొక్క సహ ప్రాయోజకులు..." అని వచ్చేది. ఈ మధ్య ఇదే " ఈ కార్యక్రమాన్ని సహ-సమర్పిస్తున్నవారు.." అని వస్తోంది..!!
టివీలో, కాల్ సెంటర్స్ లో, రైల్వే ఎంక్వయిరీ లో ఇలాంటి పరిభాష సర్వ సాధారణం అయిపోయి... అదే కరెక్ట్ అనుకొనే స్థితికి వచ్చాం. తర్జుమా అంటే చివర వుండే పొల్లు చెరిపేసి..'ము' లాంటిదేదో తగిలించేస్తే సరిపోతుందని అనుకొనే అనువాదకులు.. మన భాష, మాండలీకాలలో కొంచం ప్రవేశం కలిగివుంటే మంచిది.
surekha garu
ReplyDeleteme daggara chala information undi..intaki meeku ye kalam nachindi ? pathada ? kothada ?leka patha kothala melukalayika ?.. yemyna kani appati information chala sekarinchinanduku mimmalni abhinadhisthunna..