RSS
Facebook
Twitter

Saturday, 2 April 2011


మజీషియన్ గా విశ్వవిఖ్యాతిని పొందిన ప్రతుల్ చంద్ర సర్కార్ కుమారుడే
పి.సీ.సర్కార్ జూనియర్. ప్రతుల్ చంద్ర సర్కార్ జపాన్ లో ఇంద్రజాల ప్రదర్శన
ఇస్తూ స్టేజీ పైనే తనువు చాలించారు. ఆయన ఆనాటి చందమామ పాఠకులకు
సుపరిచితులు. చందమామలో 1950-1960లలో ఇంద్రజాలంగురించి వ్రాసేవారు.
ఇంద్రజాలం ఆధారంగా నెల నెలా కధలు వెలువడేవి. పి.సి.సర్కార్ జూనియర్
తన తండ్రి గురించి ఇలా అన్నారు. :"మా నాన్నగారు ఇంద్రజాలాన్ని ఆషామాషీగా
కాకుండా , నూటికి నూరుపాళ్ళు ఆ కార్యక్రమానికి న్యాయం చేసేవారు. ప్రతి
ప్రదర్శన ముందు మా ఇంట్లో తన అసిస్టెంట్లచేత రిహార్సల్స్ చేసేవారు. చాటుగా
ఆ రిహర్సల్సు చూసే నాకు మాజిక్ పై ఆసక్తి పెరిగింది." సర్కారు తన కుమారుడితో
మాజిక్ నేర్చుకో, కానీ చదువును మాత్రం ఎప్పుడూ అశ్రర్ధ చేయవద్దని చెప్పేవారట.
తండ్రి మాటపై సర్కార్ కొల్కతా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీతో బాటు సైకాలజీలో
కూడా డిగ్రీ చేశారు. సంస్కృతంతో బాటు ఇతర భాషలలో కూడా సర్కార్ ప్రావీణ్యం
సంపాదించారు. పన్నెండేళ్ళ వయసులోనే డార్జీలింగ్ వెళ్ళి మాజిక్ ప్రదర్శన ఇచ్చాడు.
మాజిక్ నేర్చుకొంటే కొంతే వస్తుంది. మన ఆలోచనలను ఎప్పటికప్పుడు
జోడించి అభివృద్ధి చేసుకోవాలని అంటారు పి.సీ.సర్కార్. 1992లో లేజర్ పక్రియతో
ఆయన రైలునే మాయం చేసినట్లు భ్రమ కలిగించారు. ఏడాదికి 400 పైగా ప్రదర్శనలు
ఇచ్చే సర్కార్ మాజిక్ లోని రహస్యాలు తెలిసిపొతే ప్రదర్శన రక్తి కట్టదు అంటారు..
సర్కార్ కుమార్తె మేనక ఓహియో యూనివర్సిటీలో ఎంబిఎ పూర్తి చేసి తండ్రితో
మాజిక్ ప్రదర్శనలిస్తున్నది.మేజిక్ అంటే ప్రేక్షకులను వెర్రివాళ్లను చేయడంఎంతమాత్రం
కాదు,అన్ని వయసులవారిని వినోదింప చేయడం అంటారామె.
రాజమండ్రిలో పి.సి.సర్కార్ ప్రదర్శన ఇచ్చినప్పుడు నేనూ, మా హాసం
మితృడు ఖాదర్ ఖాన్, శ్రీ సర్కార్, ఆయన కుమార్తె మేనకా సర్కార్ ను కలసినప్పుడు
ఆయన ఎంతో ఆప్యాయతతో మాతో మాట్లాడారు. ఆ సంధర్భంలో వారితో తీయించుకున్న
ఫొటో.
ఈ రోజుల్లో మాజిక్కులకు, సర్కస్ లకు ఆదరణ తగ్గిపోయింది. సర్కస్లలో అమ్మాయిలు
పొట్టిగౌనులతో చేసే ఫీట్లకన్నా సినిమానాయకలు మరింత పొట్టి డ్రెస్సులేసుకొని విన్యాసాలు
ప్రదర్శిస్తున్నారు. ఇక ఈనాటి హాస్యం బఫూన్ల హాస్యాన్ని మించి పోతున్నది. మ్యాజిక్ షోలను
తలదన్నే మాయలను హీరోలు తమ ఫైట్స్ లో పైపైకి ఎగురుతూ గ్రాఫిక్స్ ద్వారా చూపిస్తున్నారు.
ఇన్ని మాయలున్న సినిమాలు చూడక , సర్కస్, మాజిక్కులను ఎవరు చూస్తారండి!
"సర్కారు" మాయ!!
ఓట్లకోసం మేం తెచ్చేస్తాం ఎన్నెన్నో స్కీములు!
ఓట్లేశాక చేసేస్తాం ఎన్నెన్నో స్కాములు !!
ఓ క్షణంలో మాయం చేస్తాడట ఇంద్రజాలంతో తాజ్ మహల్ని పి.సి.సర్కార్ !!
మరి మేమో జనాల భూముల్ని "భూం"ఫట్ అంటూ ఆంఫట్ చేసే సర్కారులం !!
మా సర్కారు లాజిక్ ముందు బలదూర్ కదా, ఈ సర్కారు మాజిక్ !!




2 comments:

  1. చివర్న సెటైరు అదిరందండీ

    ReplyDelete
  2. "...మరి మేమో జనాల భూముల్ని "భూం"ఫట్ అంటూ ఆంఫట్ చేసే సర్కారులం !!
    మా సర్కారు లాజిక్ ముందు బలదూర్ కదా, ఈ సర్కారు మాజిక్ !!..."

    Excellent satire Appaaraavu jee. Great.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About