కోర్టులో ఓ న్యాయవాది అనర్గలంగా వాదిస్తున్నాడు. అదే సమయంలో ఆయన
ఓ టెలిగ్రాం అందుకొని చదివి జేబులో పెట్టుకొని తన వాదనను తిరిగి ప్రారంభించాడు.
వాదన ముగిశాక ఆ టెలిగ్రాం చూసిన మితృలు ఆశ్చర్యపోయారు. ఏమంటే ఆ
టెలిగ్రాములో వున్న విషయం సామాన్యమైన విషయమేమీ కాదు. ఆ న్యాయవాది భార్య
మరణ వార్త ఆ టెలిగ్ర్రాములో వుంది.! ఆ న్యాయవాదే ఉక్కుమనిషిగా పేరు పొందిన
సర్దార్ వల్లభాయ్ పటేల్! వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావానికి అదో ఉదాహరణ.
మన దేశానికి ఒక స్పష్టమైన రూపాన్ని సృష్టించిన శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్.
రాజ సంస్థాలలను భారతదేశంలో కలిపి, లొంగని హైద్రాబాద్ నవాబు మెడలు వంచి
అంగీకరింప జేసిన గొప్ప వ్యక్తి. లేకుంటే హైద్రాబాదు ఇంకా కాష్మీర్ సమస్యలాగే వుండేది.
శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశ తొలి హోమ్ మంత్రిగా నియమింప
బడటం మన దేశం చేసుకున్న అదృష్టం. గుజరాత్ లో అక్టోబరు 31, 1875లో జన్మించిన
పటేల్ పేరు వల్లభాయ్ ఝవేర్భాయ్ పటేల్. ఆయన ఆలస్యంగా స్వాతంత్ర పోరాటంలో
ప్రవేశించినా, ముందు తరాలవారందరికీ ఆదర్శంగా నిలిచాడు. మహత్మా గాంధీ
నాయకత్వం పై ప్రభావితుడైన ఆయన తన న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్ర
ఉద్యమం లోకి ప్రవేశించాడు. రైతు సమస్యల పట్ల ఆసక్తితో చంపారన్ రైతుల కోసం
గాంధీజీ చేసిన ఉద్యమంలో పాల్గొన్నాడు. సహాయనిరాకరణ ఉద్యమాన్ని ముందుండి
నడిపించాడు. బ్రిటిష్ వారు గాంధీని అరెస్టు చేస్తే తన తరఫున సత్యాగ్రహం కొనసాగించాడానికి
గాంధి పటేల్ ను నియమించాడు. 1942లో పటేల్ చేసిన "విజయమో-వీరస్వర్గమో" అన్న
ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజపరచింది. 1931 లో పటేల్ కాంగ్రెస్ అద్యక్షుడయ్యాడు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రధాని కావలని కాంగ్రెస్ కార్యకర్తల కోరిక. కానీ గాంధీ
ఆ పదవిని నెహ్రూకి కట్టబెట్టాడు. గాంధీజీకి ఎదురు చెప్పనని పటేల్ తప్పుకున్నాడు.
ఆయనే ప్రధాని అయి వుండినట్టయితే కాష్మీర్ సమస్య ఇంతకాలం పరిష్కారంకాకుండా
వుండేది కాదు. మన దేశచరిత్ర మరో విధంగా వుండేది. విధిని తప్పించలేము కదా? !
ఇలాటి ధృఢచిత్తంగల నాయకులు ఇప్పుడు మనకేరి?
.
సురేఖ గారూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి వ్రాసిందుకు థాంక్స్.
ReplyDelete''ఇలాటి ధృఢచిత్తంగల నాయకులు ఇప్పుడు మనకేరి?''
ReplyDeleteఇక ముంది అయినా వస్తారంటారా?
రావాలి అని గట్టిగ కోరుకోవడం తప్ప ఇంకేమి చెయ్యలేమేమోనండి.....
మంచి పోస్ట్ ఎన్నుకున్నారు.మన దేశం లోని అయ్దువందల పైచిలుకు సంస్థాలను నెల వ్వవధిలోవిలీనం చేయగలిగిన పటేల్ ఉక్కుమనిషి అన్న బిరుదుకు అన్ని విదాలా తగిన వ్వక్తి
ReplyDeleteపటేల్ గారే కనుక మన మొదటి ప్రధాని అయ్యి ఉంటె, ఈనాడు మనం చూస్తున్న కుటుంబ రాజకీయాల రొచ్చు, పిరికి విదేశాంగ విధానం, దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న విదేశీ భావజాల మూకలు ఏమీ ఉండేవి కాదు కదా అనిపిస్తుంది. దేశం ఎంతో చక్కగా క్రమశిక్షణతో అభివృధ్ధి చెందేది. దేశానికి ఆ అదృష్టం లెకపోయింది, అటువంటి ఉక్కుమనిషి ఒక మంత్రిగానే మిగిలిపోయారు.
ReplyDeleteThere was no need for Patel to become a Prime Minister to solve Kashmir issue. Eventhough, Patel wanted to solve Kashmir issue, Nehru did not allow him to do that. Nehru kept Kashmir for himself to solve, and it was never solved. I don't have any hopes on his fourth generation to solve this.
ReplyDeleteMy point is that instead of Nehru, had Patel became the first Prime Minister, Kashmir would not have been a problem at all.
ReplyDeleteNot only that, country would have developed in a healthy manner.