మీరు ఇక్కడ చూస్తున్న చిత్రం 1950 లోని ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లోనిది.
చిత్రకారుడు ఎల్.ఎన్.మెఘాని (స్టూడియో రతన బాత్ర) చిత్రించారు. ఏదైనా దేశ
చరిత్ర విపులంగా వ్రాయాలంటే కనీసం వంద పేజీలైనా పడుతుంది. అదే ఓ చిత్ర
కారుడు తన కుంచెతో కుంచెడు (శ్రి ముళ్లపూడి వెంకట రమణ గారి పద ప్రయోగం)
వివరాలు కాన్వాసు పై చిత్రీకరించి చూపించగలడ నటానికి మెఘాని చిత్రించిన
పై వర్ణ చిత్రమే ఒక ఉదాహరణ. ఈ చిత్రంలో కొన్ని వేల సంవత్సరాలనుంచి భారత
చరిత్రను, మన దేశం వివిధ రంగాలలో సాధించిన విశేషాలను కళ్ళకు కట్టినట్లు
మన ముందు వుంచాడు.శ్రీరాముడు, కృష్ణుడు, , బౌద్ధ, జైన మతాల అవతరణ, ,
విదేశీయులు సముద్రమార్గం గుండా మన దేశంలోకి ప్రవేశం, మన దేవాళయాలు,
మొహంజదారో ,హంపీ, తాజమహల్, కుతుబ్ మీనార్, గేట్వే ఆఫ్ ఇండియా మొదలైన
నిర్మాణాలు, గాంధీ మహత్ముడి స్వరాజ్య పోరాటం, అటుతరువాత మన పార్లమెంట్
భవనం, డాములు, వ్యవసాయం,,పరిశ్రమలు, సైనిక బలం వీటన్నిటినీ ఓ చిన్నపిల్లవాడు
ఆటవస్తువులుగా ఆడుకుంటున్నట్లు చూపిస్తూ చరిత్రను మన కళ్ళ ముందుంచాడు.
ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలోని అనాటి ఇలాటి అపరూప చిత్రాలను మా నాన్నగారు
ఆల్బమ్స్ గా తయారుచేశారు. ఆ అలవాటునే నేను కూడా ఇప్పుడు అనుసరిస్తున్నాను.
నేను కూడా ఇలా మంచి విషయాలను సేకరించి ఆల్బమ్స్ తయారు చేశాను. అలాటి
ఆల్బమ్స్ ఒకటి తిరగవేసి చూస్తుండగా, ఆదివారం ఆంధ్రజ్యొతి, ఏప్రిల్, 27,2008 లో
శ్రీమతి జ్యోతి వలబోజు వ్రాసిన "మనవాళ్ళంతా బ్లాగుడుకాయలే" అన్న వ్యాసం
కనిపించింది. అప్పుడు నాకు బ్లాగంటే ఏమిటొ తెలియదు. ఈ జ్యోతిగారు ఆ జ్యోతిగారు
ఒకరేననీ తెలియదు. ఇలా ఆల్బమ్ తయారు చేసి జాగ్రత్త పరచుకోవడం ఎంత లాభమో
తెలిసి, నా అభిరుచి మంచిదయినందుకు నన్ను నేనే అభినందించుకొన్నాను.
0 comments:
Post a Comment