ఈనాడు మన దేశ పరిస్థితి సర్దార్ పటేల్ ప్రధాన మంత్రి అయివుంటే వేరుగా
వుండేది. హైద్రాబాదు మాది అంటే కాదు మాది అంటూ కొట్టుకుంటున్న మన
తెలుగు సోదరులకు ఆయన వల్లే మనకు మిగిలింది. ఈ విషయం ఈనాటి
యువతరానికి ఎంతమందికి తెలుసు. ఏ నిర్ణయాన్ని అయినా ధృఢచిత్తంతో
తీసుకొనే సర్దార్ పటేల్ ను "ఉక్కుమనిషి" అని పిలిచే వారు.
ఆయన జయంతి రోజున ఏ రాజకీయనాయకుడు ఆయన విగ్రహానికి ఒక్క
పూలమాల వేశాడు. అసలు ఈనాటి (వి)నాయకులకు ఆయనగురించి తెలిస్తే
గదా ? ఎన్ని చోట్ల ఆయన విగ్రహాలు ఉన్నాయి ?
వంశపాలన చేస్తున్న కుటుంబం ,వారి భక్తులు ఆయన స్మృతులు లేకుండా
జాగ్రత్త పడ్డారు. గాంధీజీ కూడా నెహ్రూజీ పై గల అపార ప్రేమతో సర్దార్ పటేల్
ను కాకుండా నెహ్రూను ప్రధానిగా చేశారు. ఆయన జయంతి పర్వదినాన
మనకు హైద్రాబాదును కానుకగా ఇచ్చిన ఈ మహనీయుణ్ణి ఓ సారి స్మరించడం
భారతీయులుగా ప్రతి ఒక్కరి కర్తవ్యం.
100% true,he was a great leader.
ReplyDelete