నిన్ననే నా సన్నిహితులు ఏజెయమ్.గాంధి నాకు పాతవన్నీ ఇష్టమని, ఆయనకు
నర్సాపురం వారి అత్తగారి ఇంట్లో దొరికిన ఆంధ్రప్రభ దినపత్రికలు 1956-57 నాటివి
ఇచ్చారు. వాళ్ళింట్లో వున్న వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, మామగారు, అత్తగార్ల
ఫోటోలకు కొత్త ఫ్రేములు కట్టించడానికి వాటిని విప్పితే ఆ ఫొటోల అట్ట వెనుక ఈ
పత్రికలు 55 ఏళ్ళక్రితంవి ఏ మాత్రం చెక్కు చెదరకుండా అగుపించాయట. వెంటనే
నేను గుర్తుకొచ్చి నాకు తెచ్చి ఇచ్చారు. 1956 డిసెంబరు 29 తేదీ సంచిక పతాక
శీర్షిక "ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన పరతిపాదనలు- పార్లమెంటరీ
నియోజకవర్గాలు 35 ; అసెంబ్లీకి సంబంధించినవి 249. 43పార్లమెంటరీ స్థానాలు;
301అసెంబ్లీ స్థానాలు-అసెంబ్లీలో తెలంగాణాకు మరి నాలుగు స్థానాలు." శ్రీ నార్ల
ఆంధ్రప్రభకు సంపాదకులుగా వుండేవారు. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక వున్నా ఆంధ్ర
ప్రభ అత్యధిక సర్కులేషన్ గల పత్రికగా వుండేది. ఆ సంచికలో "10 రూపాయలకే
కట్టుడు పళ్ళు" అన్న వార్త చూడవచ్చు. ఆరు పేజీల పత్రిక వెల ఒక అణా, అంటే
ఆరు పైసలన్నమాట!.
ఆ సంచికలో రెండో పేజీలో వేసిన రాజకీయ కార్టూన్ చూడండి.ప్రసిద్ధ బ్రిటిష్ వ్యంగ్య
చిత్రకారుడు డేవిడ్ లో "మాంచెస్టర్ గార్డియన్" వేసిన కార్టూన్ను మార్పు చేసి
చిత్రకారుడు శ్రీ వాసు గీశారు.
జనవరి 4, 1957 ఆంధ్రప్రభలో కాశ్మీరు సమస్యను పాకిస్థాన్ తిరగతోడుతున్న
విషయాన్ని శ్రీ వాసు గీశారు. ఆ రోజుల్లో కార్టూన్ లోని విషయాన్ని విపులీకరించే
వారు. " కాశ్మీర్ సమస్యను తిరిగి పరిశీలించవలసిందిగా భద్రతాసంఘాన్ని పాకిస్థాన్
తిరిగి కోరింది" --వార్త ! విచిత్ర మేమంటే ఇన్ని సంవత్సరాలైనా కాశ్మీర్ సమస్య
అలానే వుంది !!
జనవరి 11, 1957 ప్రభలో "ఈడెన్ రాజీనామాను ఈజిప్ట్ ప్రెసిడెంట్ నాజర్ కు
బ్రహ్మాండమైన విజయంగా పరిగణించాలి" --వాషింగ్టన్ లోని కామన్వెల్త్ వర్గాల
వార్త.... శ్రీ వాసు చిత్రించిన మరో కార్టూన్! మరోసారి ఆనాటి పత్రికలలోని వ్యాపార
ప్రకటనలను చూద్దాం !!
ఈ మద్య పాత సంచికలు కొద్దిగా విరివిగానే చూస్తున్నాను.
ReplyDeleteఒక ప్రధాన తేడా నేను గమనిస్తుందేమిటంటే మనవాళ్లకు ఇప్పుడు పూర్తిగా అంతర్జాతీయ వార్తలు కనీసం కనిపించటంలేదు.
గత వ్యంగ్య చిత్రకారుల శైలీ, బొమ్మలమీద ఆ పట్టూ, చూస్తోంటే, మనం చాలా ఎదగాలి అనిపిస్తోంది. కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. కాని మన (దిన) పత్రికలు చాలవరకు - అబ్బే కార్టూన్ ఎందుకు, హీరోయిన్ బొమ్మయితే చాలామంది పాఠకులు చూస్తారు అన్న ధోరణిలో వుంటూ పాఠకుల అభిరుచి ప్రమాణాలని తగ్గిస్తున్నాయి. పాత కార్టూన్లు చూపించి, కొత్త ఉత్స్తాహాన్ని పుట్టించిన మీకు ధన్యవాదాలు.
ReplyDeleteశ్రీ బాబుగారికి, మీ స్పందనకు కృతజ్ఞతలు. మన పత్రికలలో కూడా ఎక్కువ పొలిటికల్ కార్టూనను మీరన్నట్లు ప్రోత్సహిస్తే బావుంటుంది. శంకర్స్ వీక్లీ
ReplyDeleteఎమర్జన్సీ రోజుల్లో ఆగిపోయాక అలాటి రాజకీయకార్టూన్ల పత్రికనును ఎవరూ ప్రారంభించడానికి పూనుకోలేదు. మీ బాబు కార్టూన్స్ పుస్తకంలో
(1981 స్వాతి ప్రచురణ) మీరు కొన్ని చక్కని పొలిటికల్ కార్టూన్లు వేశారు. ఉదాహరణకు "బ్రాంది పుట్టిన దేశంలో ఓ మహానాయకుని అసలు చరిత్ర".
This comment has been removed by the author.
ReplyDeleteCan you please post the cartoon about Sri Tanguturi Prakasam when he was offered the Speaker, Andhra Legislature instead of Chief Minister? Grasamu leka shrukki jarakrusamaina.........kesari jeerna thrunambu meyune? I don't remember if it was in Andhra Prabha or Andhra Patrika around July or August 1953.
ReplyDeleteThanks.
sir, naku sridher cartoonist vesina cartoon books kavali sir daya chesi nanumber ki msg petandi ekada dorukuno pls
ReplyDelete