ఈ ఫొటోలొని నటున్నికాదు కాదు గాయకుణ్ణి చూశారా! ఆయనే శ్రీపాద జిత్మోహన్ మిత్రా!
పేరుని బట్టి మరోలా అనుకోకండి. ఈయన నూరుపాళ్ల తెలుగువాడే. జిత్ అనే మేమంతా
పిలుస్తాం. జిత్ పాడితే అచ్చు కిషోర్ పాడినట్లే వుంటుంది. అందుకే జిత్ ఆంధ్రా కిషోర్ గా
పేరుపొందాడు. రాజమండ్రి పరిసారాల్లో సినిమా షూటింగ్ అంటే నిర్మాతలకు అన్నివిధాలా
సహకరాన్ని జిత్ అందిస్తాడు. విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన "శంకరాభరణం" సినిమాలో
శంకరశాస్త్రిని "హల్లో శంకరశాస్త్రి" అంటూ పాటపాడుతూ గోలచేసిన పాత్రలో మీరు జిత్ ను
చూసే వుంటారు. కె.విశ్వనాధ్ జిత్ గురించి చెబుతూ "రాజమండ్రి పేరు చెప్పగానే మాకు
ముందు గుర్తుకొచ్చే పేరు జిత్మోహన్ మిత్రా. గోదావరి అందాలు,నది ప్రక్కన దేవాలయాలు
నర్సరీలు వంటి అందమైన లొకేషన్సుని మేము వెండితెరపై చూపెడుతున్నామంటే దానికి,
ముఖ్యకారకుడు, స్పూర్తి, మార్గదర్శి మా జిత్మోహనే. "శారద" తీస్తున్నప్పుడు ఆయనతో
అయిన పరిచయం ఆ తరువాత "సిరిసిరిమువ్వ","శంకరాభరణం","స్వాతిముత్యం" వంటి
చిత్రాలతో బాగా బలపడింది." హాస్యనటుడు ఆలీని తెలుగుతెరకు జిత్ పరిచయం చేసిన
విషయాన్ని ఈ నాటికి శ్రీ ఆలీ చెబుతుంటాడు. 30-3-1943 లో జన్మించిన జిత్ నాన్న
గారు శ్రీపాద కృష్ణమూర్తి ప్లీడరు గుమాస్తా. ఆయన మంచి రంగస్థల నటులు. జిత్ సోదరుడు
కీ"శే" పఠాభి కూడా నటుడిగా పేరుపోందారు. జిత్ శ్రీమతి R&B శాఖలో అసెస్టెంట్
ఇంజనీరుగా పనిచేసి రెటైరయ్యారు. జిత్ 1954లోమొట్టమొదటిసారిగా తను చదివే
మునిసిపల్ హైస్కూళ్ళొ "బైజుబావరా’ చిత్రంలోని "ఓ దునియా కే రఖ్ వాలే" అనే పాటతో
తన గానకళకు స్వీకారం చుట్టాడు. జిత్ మోహన్ మిత్రా ఆర్కెస్ట్రా పేరిట 1970లో
స్వంత బృందం ఏర్పరిచి ఇప్పటివరకూ 3000 ప్రొగ్రాములపైగా నిర్వహించాడు.
1975లో మొదటిసారిగా శ్రీ బాపు దర్శకత్వంలో "ముత్యాలముగ్గు" సినిమాద్వారా సినీ
రంగ ప్రవేశం చేశాడు.
సప్తపది చిత్రంలో శ్రీమతిజానకి పాడిన "గోవుల్లుతెల్లన, గోపయ్య నల్లన" పాటలో
తన కుమార్తె లలితతోనటించిన సన్నివేశం ఆ పాట లాగానే ప్రేక్షకుల హృదయాల్లో
ఈనాటికీ నిలచిపోయింది.
కళాతపస్వి దర్శకులు విశ్వనాధ్ గారిద్వారా సన్మానం అందుకున్నాడు శ్రీ జిత్..శ్రీ ముళ్లపూడి
తన ముక్కోతికొమ్మచ్చిలో "అందాలరాముడు" అవుట్ డోర్ షూటీంగ్ సమయంలో జై ఆంధ్రా
ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు జిత్మోహన్ ఎలా సహాయంచేశాడో రమణగారి మాటల్లో
"జై ఆంధ్రా ఉద్యమం అంత ఉధృతంగా ఉండగా వీళ్ళు షూటింగ్ ఎలా చేస్తారు-చచ్చినా
జరగనివ్వమని జై ఆంధ్రా లీడర్సు కొందరూ- అక్కినేని షూటింగును ఎలా ఆపుతారో చూస్తామని
నై ఆంధ్రాలీడర్స్ కొందరూ రాజమండ్రినుంచి రెండు లారీల్లో దేవీపట్నం లోకేషనుకు బయలు
దేరుతారని కబురు వచ్చింది..నేనూ,సితారాముడూ కారు మీద ఎగిరి వెళ్ళాం.అక్కడ యూనియన్
లీడర్సులో ఒకడూ,నటుడూ,డాన్సరూ,లాయరూ,శ్రీపాద పఠాభిగారి తమ్ముడూ అయిన జిత్
మోహన మిత్రా గారి సహాయ సహకారాలతో ఆ ఊరేగింపు నాయకులను ఆపి, ఈ షూటింగ్
మూడునెలల క్రితమే నిర్ణయించుకున్నామనీ, అడవిలో ఏ మూలో కొండ కోనల్లో జరిగే పనులు
ఆపితే-రెండు మూడు వందల కుటుంబాల పొట్టకొట్టడమే అవుతుందనీ నచ్చచెప్పి ఒప్పించాం"
జిత్ సమర్ధతకు ఇదో చిన్న ఉదాహరణ. శంకరాభరణం షూటింగ్ సమయంలో కీ గ్రామఫోను
(అప్పటికి నా దగ్గర లేదు) కావాలని విశ్వనాధ్ గారు అంటే రాజమండ్రి అంతా గాలించి గ్రామఫోన్
సంపాదించి తెచ్చాడు జిత్!!
మా రాజమండ్రి హాసంక్లబ్ కార్యక్రమాలకు ప్రారంభం నుంచీ దాదాపూ తప్పక హాజరయ్యే జిత్
మోహనమిత్రాకు హైద్రాబాదు హాసం క్లబ్ వారు శ్రీ యమ్బీయస్.ప్రసాద్, శ్రీ యస్వీ.రామారావుగార్ల
అధ్వర్యంలో ఇటీవలే సత్కారం జరిగింది
శ్రీరామదాసు చిత్రంలో అక్కినేనితో జిత్. "ముద్దమందారం" చిత్రంలో రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో జిత్ నటించి పాడిన "నా
షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి పాట" మీకు వినిపిసున్నాను. ఈ పాట ఎంతో పాప్యులర్
అయింది. Sea Record కంపెనీ మిని లాంగ్ ప్లే రికార్డుగా (33 1/3 RPM) 1981 ఆపాట
విడుదలయింది. సాధారణంగా 331/3 RPM రికార్డులు పెద్ద సైజులో వెలువడితే ఈ రికార్డు
చిన్న సైజులో వెలువడటం ఓ విశేషం !!
Jith gaari gurinchi naaku yinthaka mundu konthavaruku thelusu. mee blog dwara marinni vishayaalu thelusukunnaanu.ThanQ
ReplyDeleteజిత్ మోహన్ మిత్రా ఒరిస్సా వాడని అనుకుంటూండేవాణ్ణి. ఆ మధ్యెప్పుడో పిల్లలకు ఆయన గురించి చెబుతూ ఈయన విశ్వనాథ్ సినిమాల్లో ఎక్కువగా ఉంటాడు అని పరిచయం చేసాను. ఈ వ్యాసం ద్వారా ఆయ్న గురించి చాలా విషయాలు తెలిసాయి. నెనరులు.
ReplyDeleteayyaa, jith garini ekkada kalusukovachu.
ReplyDelete.....మిత్రుడు జిత్ గురించి పరిచయం చేయడం చాలా బాగుంది. అది మీరే చెయ్యగలరు.. మీరే చేసారు....అదీ అప్పారావు గారంటే
ReplyDeleteతనకు ప్రాణసమానుడైన కిషోర్ కుమార్ ను జిత్ కలిసాడేమో కూడా. రాష్ట్రంలోనూ రాష్ట్రేతర ప్రాంతాలలోనూ తన పాటలతో హోరెత్తించిన
శ్రీ శ్రీపాద జిత్ మోహనమిత్రా మన రాజమండ్రి వాడవడం మనకు గర్వకారణం. అంతే కాకుండా హాసం క్లబ్ రాజమండ్రిలో మనం ప్రారంభించినప్పట్నించీ మనకు సూచనలనిస్తూ..పాల్గొంటూ సహకరిస్తున్న మంచిమిత్రుడు.. ..మీరు చేసిన పరిచయం బాగుంది..
చాలా సంతోషం. ఆయన శ్రీపాదవారి చిన్నవాడా? ఆ ఉత్తరభారత పేరు చూసి అటువేపు వారేమోననుకున్నాను.
ReplyDeleteఅప్పారావుగారూ,
ReplyDeleteనాకొక్కసారి మెయిల్ చెయ్యగలరా నా ఐడీకి pappusreenu@gmail.com
జితమోహన్ గారంటే ఈయనా! కోతికొమ్మచ్చిలో ఈయన గురించి చదివి ఎవరో అనుకున్నాను.
ReplyDeleteమంచి విషయాలు పంచుకున్నారు..నెనర్లు!