RSS
Facebook
Twitter

Sunday, 25 March 2012

చేటోపాఖ్యానం


చేట అనగానే మా రాజమండ్రి ఆలీ గుర్తుకొస్తాడు. ఈ మధ్య ఈటీవీలో ఆలీ ఓ కార్యక్రమంలో
వారం వారంఈ చేటతో ఓ ఆట ఆడిస్తున్నాడు. ఇప్పుడైతే కనుమరుగయింది కానీ ఈ చేట
ఒకప్పుడు ప్రతి ఇంట్లోతప్పక వుండేది. ఆ చేటకు తోడుగా ఓ జల్లెడ ! ఇప్పుడయితే అన్నీ
శుభ్రపరచి దొరుకుతున్నాయి కాని పూర్వం బియ్యం, పప్పులు అన్నీ చేటతో చెరిగి, రాళ్ళూ,
పొట్టూ వేరు చేసే వారు ఇక చిన్న చిన్న రేకు చేటలు తుక్కు ఎత్తడానికి ఉపయోగించే వారు.

పూర్వం తెలుగు పాఠాల్లో" ఏనుగు చెవులు చేటల్లా వుండును" అని చెప్పేవారు.. ఇక ఎవరైనా ఏ విషయమైనా విని అనందిస్తే, "అబ్బో వాడి ముఖం చూడాలి.చాటంతయింది" అని అంటారు. ఇక ఎవరినైనా తిట్టినా , ఛూశావా వాడిని నలుగురిలో చెరిగి పారేశా అని కూడా అంటుంటారు. (చెరగటానికి చేటకావాలి కదా).మన ప్రజా ప్రతినిధులు కొందరు నిధులు భోంచేసి అరగటానికి ఒకర్నొకరు అసెంబ్లీలో, పార్లమెంటులో చెరిగేసుకుంటుంటారు.



పొలాల్లో ధాన్యాన్ని ఇలా చేటలతో గాలి వాటంతో నేలపైకి వదులుతూ పొట్టును వేరుచేస్తుంటారు. అదో కమనీయమైన సుందర దృశ్యం. ఇక్కడ ఓ మంచి ఫొటో పెడదామని ఛుశాను కానీ ఎంత వెతికినా దొరకలేదు. చివరకు నేనే ఓ బొమ్మ గీసేసి ఉంచాను. తప్పులకు క్షమిస్తారని తలుస్తాను. ఆ బొమ్మ కోసం వెతుకుతుంటే చేట గడియారం దొరికింది. ఎప్పటిదో ఆదివారం ఈనాడులోనే కత్తిరించి అతికించిన ఓ ఆల్బమ్ లో దొరికింది. ఈరోజుళ్ళొ బైట పారేసే చేటను కూడా ఇలా కళాత్మకంగా చేసిన ఆ మహానుభావుడికి జోహార్లు! అన్నీ పాత వస్తువులూ దాచే నాదగ్గర చేట లెకపోవడం ఎంత చేట(టు) !! అందుకే ఈ చేటోపాఖ్యానం మీ ముందుంచాను.నచ్చక పొతే మాత్రం చెరిగి పారెయ్యకండేం !!


4 comments:

  1. చాలా బాగుంది అప్పారావు గారు!

    ReplyDelete
  2. అప్పారావు గారూ !
    చిన్నప్పటి జ్ఞాపకాల్ని ఎన్నిటినో వెలికి తెస్తున్న మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. బావుందండి మీ చేటోపాఖ్యానం.

    ReplyDelete
  4. ఎంద పరంద ఇంద చేట? మా ఇంట్లో ఇప్పటికీ ఒక చేట ఉంది దానిలో చెరుగుతూ ఉంటే చూడటానికి భలే ఉంటుంది! ఈ చేటోపాఖ్యానానికి మరి కాస్త జోడింపు. "మూసి వాయినాల నోము" మా అమ్మ నోచుకున్నప్పుడు చూశాను క్రొత్త చేటల్లో ఒక్కోదానిలో పసుపు, కుంకుమ, నల్లపూసలు, పండ్లు, పువ్వులు, గాజులు పెట్టి దాని మీద మరొక క్రొత్త చేట బోర్లించి దాని మీద ఏవేవో పెట్టి వాయినం ఇస్తారు.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About