RSS
Facebook
Twitter

Saturday, 10 March 2012



                                          తెలుగు సినిమాలూ ! అరె ! ఏ మైందీ ?!!!మన తెలుగు సినిమాలకు ఏ ఒక్కచిత్రానికీ జాతీయ అవార్డురాలేదు. బొంబాయి
                           తరువాత అత్యధిక చిత్రాలు నిర్మించేదీ మన తెలుగు వాళ్ళే ! గత ఎనభై ఏళ్ళ ల్లొ
                           కోట్లు సంపాదించిన ఏకైక చిత్రమనీ, రెండువేల ధియేటర్ల పైగా విడుదలయిందనీ
                           చంకలు కొట్టుకుంటున్నాము.  అలనాడు విడుదలయిన "లవకుశ" ఏ విదేశాల్లో
                           విదుదల కాలేదు. ఇప్పటిలా టిక్కేట్టు ధరలూ లేవు. రోజూ ఇన్ని ఆటల ప్రదర్శన
                           లేదు. ఐనా ఆరోజుళ్ళొ కోటిరూపాయలపైగా వసూలు చేసింది. 75 వారాల పైగా
                           ఆడింది. ఇప్పటి సినిమాలు అన్ని రోజులు ఆడుతున్నాయి. విడుదలయిన రెండో
                           రోజే ప్రతి సినిమాను సూపర్ డూపర్ హిట్  అంటూ డూప్ ప్రకటనలు. టీవీల్లో
                           ధియేటర్లలో చేసే హడావిడి తప్ప సినిమాలో విలువలు ఎక్కడున్నాయి.ఇక
                           అవార్డులు రాలేదంటే ఎలా వస్తాయి.
                            ఏయన్నార్, యన్టీఆర్ కాలంలో ప్రతి యేడాది తెలుగు సినిమాకు కేంద్రగుర్తింపు
                           తప్పక వుండేది. ప్రతి యేడాది ఢిల్లీ వెళ్ళి బహుమతి తీసుకుంటున్న అక్కినేనిని
                           ఆనాటి కేంద్ర మంత్రి డా.కేస్కర్ "మీరు మా అతిధి కాదు ; మాకు కస్టమర్ అయి
                           పోతున్నారు" అని అన్నారంటే మన తెలుగు సినిమాలు,  నటులు  ఆ   రోజుల్లో
                           ఎంత గుర్తింపు పొందారో అర్ధమవుతుంది. నమ్మిన బంటు, స్పెయిన్ లో జరిగిన
                           అంత్ర్జాతీయ చలన చిత్రోత్సవంలో,  అంతస్థులు సిడ్నీ  చలన   చిత్రోత్సవంలోను, 
                           నర్తనశాల జకర్తా ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ న్యాయనిర్ణేతల ప్రశంసలతో బాటు
                          కీచకుడిగా నటించిన యస్వీ రంగారావు  ఉత్తమ నటుడిగా అప్పటి ఇండోనేషియా
                          అద్యక్షుడు డాక్టర్ సుకర్నో చేతుల  మీదుగా    అవార్డును    అందుకున్నారు. 



విప్రనారాయణ,అర్ధాంగి,తెనాలి రామకృష్ణ, తోడికోడళ్ళు,  పెళ్ళినాటి ప్రమాణాలు,
                          మాంగళ్యబలం,  జయభేరి,నమ్మినబంటు,  మహాకవి కాళిదాసు,  భార్యాభర్తలు,   
                          ఇలా ఎన్నో తెలుగు చిత్రాలు  ప్రేక్షక   విమర్శకుల అభిమానాన్ని పొందాయి.
                          ఈ మధ్యకాలంలో  మగధీర సాంకేతికరంగంలో ఎక్కువ అవార్డులు పొందింది.
                          కనీసణ్ "శ్రీరామరాజ్యం" చిత్రానికి కళా శాఖకైనా తప్పక ఓ అవార్డు వస్తుందను
                          కుంటే అక్కడా నిరాశే ఎదురయింది. ఈ నాడు తమిళం నుంచి డబ్బింగ్ అయి
                          వస్తున్న చిత్రాలలో తారల గ్లామర్ కంటే కధకు, చిత్రీకరణకు ప్రాముఖ్యతనిస్తూ
                          నిర్మిస్తున్నారు. మనకు కూడా మంచి దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు
                          ఉన్నారు. మన చిత్రాల తీరూ మారాలి.సెలెక్షణ్ కమిటీలో ఒక్క తెలుగు వాడూ
                          లేక పోవడం మనకు అవమానం!

5 comments:

  1. మన సినిమాలకు అవార్డులు రావటం లేదు, నిజమే. కాని ఆ సినిమాలు మన ప్రజానీకానికి వినోదాన్ని ఇస్తున్నాయా లేదా, ఆ పరిశ్రమ మీద ఆధారపడి ఎన్ని వేల మంది (ఒక్క నటులే కాదు) బతుకుతున్నారా లేదా. ఇది ప్రస్తుత ఆలోచన విధానం. అవార్డుకోసం సినిమా తీసే స్థితిలో మన తెలుగు పరిశ్రమ లేదు. ఒకప్పుడు ఉండేది"ట". మన సినిమాలకు అవార్డు రావాలంటే అభిరుచి గల నిర్మాతలు, నటులు కావాలి. మనకి ఇప్పుడు లేరు. ఎంతసేపూ, సంక్రాంతికి ఏ సినిమా, వేసవి శెలవలకు ఏ సినిమా, ఎవరు నంబరు వన్, ఎవరి ఇమేజికి తగ్గ సినిమా వాళ్ళు తీసుకోవటంలో పడి కొట్టుకుంటున్న వాళ్ళకి అవార్డులు ఇస్తే ఆ అవార్డులు తీసేయటం మంచిది. ఇది కూడ మరొక నిజం.

    ReplyDelete
  2. అవార్డు కమిటీలో ఈసారి ఒక తెలుగు దర్శకులు ఉన్నారు. సతీష్ కాశెట్టి.

    ReplyDelete
  3. ఆ రోజులు మళ్ళీ వస్థాయా ! ఆ నటులు స్థాయి అందుకునే సాహసం చేసేవారు మచ్చుకైనా నేడు ఉన్నారా ? నేడు నటనకు విలువలేదు. విలువ(డబ్బు)కే విలువ. ఎవడి డబ్బా అయినా మేము ఇన్ని ధియేటర్లలో విడుదల చేశాం! ఇంత వసూలు చేశామనే ! ఈ డబ్బా ఎల్లకాలం సాగదు.

    ReplyDelete
  4. సినిమా కళ వ్యాపార సమ్మేళనం. కళారంగంలో అభిరుచి ఉన్నవారే సినిమాలు తీయటాని ముందుకొచ్చేవారు. ఇప్పుడలాకాదు. వారసులు+డబ్బు+సొంతడబ్బా ఇదే నేటి కళాతృష్ణ.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About