RSS
Facebook
Twitter

Friday 6 April 2012

సుందరాకాండ బహుసుందరం


వాల్మీకి రామాయణంలో సుందరాకాండకు ఎంతో ప్రాముఖ్యముంది. సుందరాకాండ పారాయణం శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఇందులో ప్రతి ఘట్టం సుందరమే !రామాయాణం హనుమనోట మరోసారి ఈ కాండలో వింటాం. లంకా నగర వర్ణన, మహర్షి వాల్మీకి కన్నులకు కట్టేటట్లు వర్ణించారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, కష్టకాలంలో ఎలా ఆలోచించి ధైర్యంతో ముందుకు సాగాలో హనుమ చెబుతారు.


ఈనాటి యువతరానికి ఆనాడే వ్రాసిన మహత్తర మనోవికాస గ్రంధం రామాయణం! " రామాయణం " పుస్తకాన్ని అందంగా శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు రచిస్తే మరింత సుందరంగా బాపుగారు బొమ్మలు గీశారు. ఆ పుస్తకంలోని సుందరకాండ లోని బహుసుందరమైన బొమ్మలు ఈ హనుమజ్జయంతి రోజున మీకోసం, శ్రీబాపుగారికి కృతజ్ఞతలతో. ఈ అందాల బొమ్మల " రామాయణం " నేడే కొనండి. మీ పిల్లలచేత చదివించండి. వాళ్ళకి చదవడం రాకపోతే మీరే చదివి వినిపించండి. మీకూ రాకపోతే వాళ్ళ తాతగారు,బామ్మగార్లచేత చదివి వినిపించండి.




4 comments:

  1. భలేబాగుంది...

    ReplyDelete
  2. మీటపా లొ చాలా కాలంగా ఒక తప్పు జరుగుతున్నది మీరు వాక్యనిర్మాణంలొ మొదటి పదం విడిగావుండి, మొత్తం వాక్యం లొ భాగంగాకాక అలా విడిగా వుండటం పఠనం లొ ఇబ్బంది గా వున్నది.మీరు ఎంత మంచి టపా వ్రాసిన ఈతప్పువలన దానిప్రభావం కొంత తగుతున్నది.అన్యదాభావించవలదు.

    ReplyDelete
  3. సుందరాకాండ బహుసుందరం....మీ రచన అమోఘం...
    ధన్యులం... మీరు చెప్పినట్లు ప్రతి ఇంటింటా విని పిస్తాను..

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About