దిష్టిబొమ్మ !
నిండుగా గడ్డినింపుకొని
ఆపైన ఒంటి నిండుగా బట్టలేసుకొని
ఠీవిగా నలబడింది !!
కేరింతల మధ్య తగలబడింది !!
అభాగ్య జీవులకు గుడ్ద కరవు !!
మూగ జీవులకు గడ్డి కరవు !!!
నేను సురేఖార్ట్యూనులు పేరుతో స్థానిక దినపత్రిక సమాచారంలో
ప్రతి ఆదివారం ఇలాటి చిన్న కవితలు (?) వ్రాసే వాడిని. వాటిలో
దిష్టిబొమ్మ కవిత నాకు బాగా నచ్చింది. "గోదావరి" అనే కవితా
సంకలనంలో అచ్చయింది కూడా. రాష్టంలో ప్రతి రోజూ ఏదో
ఉద్యమం జరుగుతూ వుంటుంది, ఎన్నో గడ్డి బొమ్మలకు మంచి
డిమాండు కుడా. ఎవరైనా, ప్రభుత్వమైనా ఈ గడ్డి బొమ్మల
తయారీ వ్యాపారం మొదలెడితే మంచి లాభదాయకం కదూ!
బాగుంది.
ReplyDeleteసూటిగా తాకిందండీ
ReplyDelete