RSS
Facebook
Twitter

Wednesday, 19 September 2012

ఓ బొజ్జ గణపయ్య

                    ఈ మధ్య బ్లాగులో రాయటం మానేసావేమిటంటూ చాలా మంది మిత్రులు
అడుగుతున్నారు. నిజమే కొంతకాలం  రోజూ వదలకుండా ఏదో ఒకటి
వ్రాస్తూ వుండేవాడిని. నిన్న రాత్రి గణపయ్య కలలోకొచ్చి ఇదేమాటను
అడిగాడు. కొయ్ కొయ్ దేముడు నీ కలలో కొచ్చేటంత భక్తుడివి కాదు.
రోజూ పూజలూ చేయవు. నీకు సంధ్యావందనం చేయటం రాదు.ఇంత
వయసు వచ్చినా పంచె కట్టుకోలేవు అని నా సన్నిహిత మిత్రులనవచ్చు!
అసలు చిత్ర మేమిటంటే భగవంతుడు నా లాటి చిన్నపాటి భక్తులకే అగు
పిస్తాడు ! సరే మీరు నమ్మినా నమ్మక పోయినా చెప్పాలి కదా !
. స్వామీ మీరు నా బ్లాగు సంగతి అడిగారు. మీకు మా తెలుగు బ్లాగులు
ఎలా తెలుసు. మీరు చూస్తారా అనడిగాను. అదేమీటి , నాదగ్గర మౌసుంది
కదా ,అదే మూషికం అన్నాడు విఘ్నేశరుడు. ఈ  వినాయకచవితి
నుంచి మళ్ళీ బ్లాగు రాయడం మొదలు పెట్టు అంటూ ఆశీర్వదించాడు
  ఐతే స్వామీ మీ మీద మా కార్టూనిస్టులు ఎన్నో బొమ్మలు వేశారు. మా
బాపుగారు కూడా మీరు చంద్రునికి తాడుకట్టి ఉయ్యాల ఊగుతున్నట్లు
భలే బొమ్మ గీశారు చూడండి అంటూ చూపించాను. తరువాత స్వామీ
చూశారా బాపుగారు మీ మీద ,కృష్ణుడిమీదా, చాలా దేవతలమీదా
ఎన్నో కార్టూనులు గీశారు కానీ ఆయన ఇష్ట దైవమైన రాముడి మీద
ఒక్క బొమ్మాగీయలేదు చూశారా స్వామీ అన్నాను. దానికి ఓయీ
నీకు గుర్తులేదా ! బాపూ ఆయన రాముడు మీదా వేశాడు. చూడలేదా
లేక మతిమరపా ! నీ దగ్గర వున్న బాపూరమణ ఏడో నెంబరు ఆల్బమ్లో
15 వ పేజీ లోని పై బొమ్మ చూడు అంటూ తన తొండంతో నెత్తిమీద
ఒకటి వేశాడు.

గణనాధుడు నాకు ఆయన రాముడుపై గీసిన మరో కార్టూన్ గురించి
చెప్పేలోపే నాకు మెలకువ వచ్చింది , లేకపోతే ఈ కార్టూన్ గురించి
తప్పక చెఫ్ఫి వుండేవాడు. అదుగో రాములవారిపై బాపుగారు గీసిన
మరో కార్టూన్.! అదండీ ఈ వినాయకచవితి రోజువిశేషం. మీ అందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పనిలో పనిగా
నేనిక్కడ మీకు చూపించిన కార్టూన్లకు శ్రీ బాపు గారికి, "స్వాతి"
సపరివార పత్రికకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

5 comments:

  1. చక్కగా బాపు గారి కార్టూనులతో మళ్ళీ వినాయక చవితి నాడు మొదలెట్టేశారు, బాగుందండీ!
    మీకూ మా "చిన్ని ఆశ" వినాయక చవితి శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. వినాయక చవితి శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. ఓం గం గణపతయే నమః
    వినాయక చవితి శుభాకాంక్షలు....
    విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
    మీ కుటుంబ సభ్యులకు సదా,
    సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని..
    క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని..
    సుఖసంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
    @శ్రీ

    ReplyDelete
  4. ధన్యవాదాలు ! అందరికీ వినాయక చవితి శుభాశీస్సులు

    ReplyDelete
  5. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ..

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About