దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టికాదోయ్! దేశమంటే మనుషులోయ్ !! "ఆన్న
గురజాడ వేంకట అప్పారావు గేయం ద్వరా ఈతరం జనాలకు
తెలిసింది. కన్యాశుల్కం నాటకాన్ని 1897లోనే వ్రాసినా రెండవ
కూర్పు 1909 లో. ఆనాడే గురజాడ డబ్బుకు ఆశపడే లుబ్దావధానుల
వంటి పాత్రలతొ బాటు గిరీశం ,మధురవాణి లాటి పాత్రలతో రక్తి
కట్టించారు. కన్యాశుల్కం నాటికగా ఎంతో ప్రాచూర్యం పొందింది.
వినోదావారు కన్యాశుల్కం చిత్రంగా, డాక్టర్ గోవిందరాజుల
సుబ్బరావు, సి.యస్సార్, యన్టీ రామారావు, సావిత్రి, షావుకారు
జానకి లతో అద్భుత చిత్రంగా మలిచారు.
గురజాడ వ్యవహారిక భాషలో రచనలకు ఎనలేని కృషి చేశారు.
విచిత్రమేమంటే గురజాడ 150 వ జయంతిని నిర్వహించాలని
ఘనత వహించిన మన ప్రభుత్వం నిర్ణయించినా,. బాధాకరమైన
విషయం విశాఖ బస్ కాంప్లెక్స్ సమీపకూడలిలో వున్న గురజాడ
విగ్రహం తొలగించి దూరంగా పడేసి ఈ నాడు ఆ మహానుభావుని
150 జయంతి నాటికైనా ప్రతిష్ఠించకబోవటం సిగ్గుపడవలసిన
విషయం.
" ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవ శుభాకాంక్షలు "
ReplyDeleteఎందుకీ వ్యక్తికి భజన చేయాలి మనం ? స్వకులాన్ని అపహాస్యం చేసినందుకా ?
ReplyDeleteL.B.S. గారి కామెంటు చాలా ఘోరంగా ఉంది.ఒక రచయిత సంఘంలో ఉన్న దురాచారాల్ని ఎత్తి చూపదలచుకున్నప్పుడు కుల ప్రసక్తి రాకూడదు.l.b.s. గారి సంకుచిత భావాల్ని వారు బయట పెట్టుకోకుండా ఉంటే బాగుండేది.
ReplyDeleteఅవును. బావుంది మీరు చెప్పేది. కులప్రసక్తి లేకుండానే గుఱజాడ రాతలు రాశాడా ? ఎవఱి కులం వారికి తల్లిలాంటిది. మఱి బ్రాహ్మణులకు మాత్రం కాదా ? తమ కులాన్ని ఎత్తిచూపితే ఎవఱూ సహించరు. అది మాత్రం సంకుచితం కాదు. తన కులాన్ని అవమానించినందుకు బ్రాహ్మణుడు అభ్యంతరం చెబితేనే అది సంకుచితత్వం. బావుంది ఈ ద్వంద్వనీతి. నేను నా కులానికి అతీతుణ్ణి కాను. (ఆ మాటకొస్తే ఎవఱూ కారు) అందఱూ నన్ను వదిలేసినా నా కులం మాత్రం నా మరణానంతరం సైతం నన్ను నెత్తిన పెట్టుకుంటుంది. అలాంటి కులం అవమానాలకి లోనవుతూంటే ఆ లోనుచేసిన వాళ్ళని నేను పూజిస్తూ కూర్చోవాలా ? మీ తల్లిని బండబూతులు తిట్టినవాళ్ళని మీరు పూజిస్తారా ? ఇతర కులాలవాళ్ళ చేత మంచివాడనిపించుకోవడం కోసం, వాళ్ళ చంకనాకడం కోసం, వాళ్ళ మెప్పు కొసం నేను విశాలహృదయాన్ని నటిస్తూ నేను నా తల్లిని గుడ్డలు విప్పి నలుగుఱిలో నిలబెట్టాలా ?
ReplyDeleteనా అభిప్రాయాల పూర్తిపాఠాన్ని ఇక్కడ చదవండి :
ReplyDeletehttp://tinyurl.com/94j3jb4
L.b.S.గారు అనవసరమైన ఆవేశాలకు లోను కాకుండా ఉంటే ఏ విషయమైనా అర్థమౌతుంది. గురజాడ వారు ఏ కులాన్ని అప హాస్యం చేయడానికీ కన్యాశుల్కం నాటకం వ్రాయలేదు.ఒక దురాచారాన్నిఖండిచడానికి రాసేరు.ఆ దురాచారం ఏకులం లో ఉండిందన్నది అప్రస్తుతం.అతి చిన్న వయసులో అన్నెం పున్నం ఎరుగని అమాయిక బాలికలను ఢబ్బుకోసం అమ్ముకోవడం దురాచారం కాదని మీరనుకుంటే అది మీయిష్టం.మీరు గురజాడను పూజించనక్కర లేదు. అలాగే ఎవరైనా నెత్తిన పెట్టుకుంటే మీరు బాథ పడనక్కర లేదు.
ReplyDeleteమీకిష్టమైని వాళ్ల భజనని మీరు చేసుకోండి.ఎవ్వరికీ అభ్యంతరం లేదు.మీ Rejoinder లో ఆఖరి రెండు వాక్యాలూ సంస్కారవంతంగా లేవు.ఇంతకంటె వ్రాసి రొచ్చు లోకి దిగడం నాకిష్టం లేదు.సెలవు.
ఏదైనా బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. చిన్న వయసులో పెళ్ళయి, భర్త పోయి మిగిలిన జీవితమంతా అందరి దుర్భాషలనూ భరిస్తూ భారంగా బ్రతికే వాళ్ళను కనీసం దగ్గర నుండి చూస్తే అర్థమవుతుంది. ఆనాడు దాదాపు బ్రాహ్మణుల ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో ఇలాంటి వాళ్ళుండే వాళ్ళని తిరుమల రామచంద్ర గారు వారి జీవితచరిత్రలో వ్రాశారు. (మా ఇంట్లోనూ నేను స్వయంగా చూశాను. కులం తాలూకు ఏ పవిత్రతా ఆమెను ఉద్ధరించలేకపోయింది మరి.) వైదికం, అగ్నిహోత్రం పేరు పెట్టుకుని ఇలాంటి దురాచారాలను నెత్తిన మోయనక్కర్లేదు, మోసి పవిత్రమైన హిందూమతాన్ని ఉద్ధరించనక్కరా లేదు. ఈ విధమైన చవకబారు పెత్తందారీతనం అవసరం లేదు. పదివేల సంవత్సరాలపాటు పాటించినంత మాత్రాన అన్యాయం న్యాయం కాలేదు.
ReplyDeleteఅభిప్రాయాలను చెప్పే హక్కు అందరికీ ఉంటుంది. అంతమాత్రాన గురజాడ అభిమానులను Cannibals అని ఈసడించి, కుసంస్కారం బయటపెట్టుకోనక్కర్లేదు. కృష్ణారావు గారు సరిగ్గా చెప్పారు. మీకు ధన్యవాదాలు.
This comment has been removed by the author.
ReplyDeleteసారీ, మీరు నా గుఱించి ఏమనుకున్నా ఫర్వాలేదు. ఏ సంఘసంస్కరణ కోసమూ నా కులాన్ని నేను అవమానించలేను. ఎవఱు అవమానించినా సహించలేను. అంతగా ఎవఱైనా ఏ ఆచారం మూలానైనా బాధలు పడుతున్నారంటే వ్యక్తిగతంగా వెళ్ళి ఉద్ధరించండి. అంతే గానీ పుస్తకాలు వ్రాసి కులాల మీద బుఱద జల్లి ఆ ఆచారాలు అంతరించిన తరువాత కూడా వాటిని సాహిత్యరూపంలో మిగిల్చి, అందఱిచేతా చదివించి మనుషుల్ని శతాబ్దాల తరబడి అవమానించడం, అదీ ఒక వ్యక్తిని హైలైట్ చేయడం కోసం - దాని కంటే కుసంస్కారం ఎక్కడా లేదు. అలాంటివాళ్ళని నేను క్షమించలేను. నా కులం ఇప్పటి దాకా చరిత్రలో నానా సిద్ధాంతాల పేరుతో, సంస్కరణల పేరుతో ఇతరుల చేతుల్లో పడిన అవమానాలూ, అణచివేతలూ, తిన్న తిట్లూ తన్నులూ ఇక చాలు. మీకు ఇష్టమున్నా లేకపోయినా నేను దీన్నొక పబ్లిక్ ఇష్యూ చేయబోతున్నాను.
ReplyDelete>> వ్యక్తిగతంగా వెళ్ళి ఉద్ధరించండి
ReplyDeleteతప్పకుండా.
>>సాహిత్యరూపంలో మిగిల్చి, అందఱిచేతా చదివించి మనుషుల్ని శతాబ్దాల తరబడి >>అవమానించడం, అదీ ఒక వ్యక్తిని హైలైట్ చేయడం కోసం
సాహిత్యం మీద ఇక్కడ భ్రమలేమీ లేవు. ఈ సాహిత్యం వేల యేళ్ళుగా ఎవర్ని ఉద్ధరిస్తోందో, ఎలా ఉద్ధరిస్తోందో, వ్యక్తిగత ద్వేషంతో వ్రాసిన ’మనోరమాకుచమర్దనాల’ దగ్గర నుండి నేటి కవిపండితుల భజన రాతలు మనపాలిట అపూర్వమైన సాహిత్యంగా ఎలా మారి కూర్చున్నాయో తెలుస్తూనే ఉంది లెండి. దాని సరసన ఈ సాహిత్యం కూడా.
>>పబ్లిక్ ఇష్యూ
మీరేమైనా చేసుకోవచ్చు. మీ అభిప్రాయాలతో విభేదించిన వారిని దూషించటం తప్పు. తద్వారా నష్టం మీకే.
ఈ రొచ్చుకు ఇక స్వస్తి.
తాడేపల్లిగారు,
ReplyDeleteమీరు చెప్పిన అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. మారిన ప్రస్తుత కాల పరిస్థితులలో గురజాడ మొద|| రచయితల అవసరం ప్రస్తుత సమాజ ప్రజలకేమి లేదు.
@రవి,
*ఏదైనా బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. చిన్న వయసులో పెళ్ళయి, భర్త పోయి మిగిలిన జీవితమంతా అందరి దుర్భాషలనూ భరిస్తూ భారంగా బ్రతికే వాళ్ళను కనీసం దగ్గర నుండి చూస్తే అర్థమవుతుంది.*
మా ఇంట్లోనూ నేను స్వయంగా చూశాను. పెళ్లై, భర్త పోయి న తోబుట్టువును అన్నదమ్ములు చూడాలనే బాధ్యతనా లేక హక్కా? ఆనాడు బ్రాహ్మణ మగవాళ్లు ఒట్టి అమాయకులు,తోబుట్టువు మీద "ప్రేమ " లేకపోతే బరువు బాధ్యతలను నెత్తినేసుకొంటారు. స్వయంగా వారి ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినా చూసుకొన్నారు. పైగా వారిని దుర్మార్గులుగా చిత్రికరించటానికి, సాహిత్య సృష్టిపేరుతో వారిని దుర్భాషలడటానికి ఈ రచయితలకి మనసేలా వచ్చిందో! కొంతమంది రచయితలు తోబుట్టువులతో పని మనిషి చాకిరి చేయించుకొన్నరని రాసేవారు. ఆరోజులలో పనివాళ్లు తక్కువజీతానికి విరివిగా దొరికేవారు.
ఈ రోజులలో చూస్తున్నాం కదా ఉద్యోగం లేక పోతే విడాకులిచ్చి పోయే భార్యలను వారి గురించి ఎన్ని కథలు, నవలలు వచ్చాయేమిటి?
అయితే సంఘసంస్కరణ గురజాడ పూర్తిగా చెయ్యలేదన్న మాట...మహానుభావుడు మళ్ళీ ఎప్పుడు పుడతాడో కానీ తెలుగు నేలకి ఆయన అవసరం ఇంకా చాలా ఉంది. శరత్
ReplyDeleteనిజంగా సంఘసంస్కరణ కోసం అస్థీ, చర్మమూ ధారపోసి అనేక శత్రుత్వాల్నీ, అవమానాల్నీ ఎదుర్కొన్న వీరేశలింగం గారిని వదిలిపెట్టి, ఏమీ చేయకుండా కేవలం రెండుమూడు పుస్తకాలు రాసుకున్న గుఱజాడకి ఈ చెక్కభజన ఏంటో నాకెప్పుడూ అర్థం కాదు. It is not one's intrinsic worth but propaganda is what is making and unmaking personalities these days.
ReplyDelete