RSS
Facebook
Twitter

Monday, 31 January 2011

మన తెలుగు పత్రికలలో వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడటం 80 ఏళ్ళ క్రితమే మొదలయింది. ఇందుకు ఆద్యులు శ్రీ తలిశెట్టి రామారావుగారు. ఆయన ఆంధ్రపత్రిక, భారతి పత్రికలలో వ్యంగ్య చిత్రాలు గీయటం మొదలు పెట్టారు. ఇందుకు ఆంధ్రపత్రిక వారు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. మన...

Sunday, 30 January 2011

ఆంధ్రపత్రిక దిన పత్రిక ప్రతి ఏడాది ఉగాదికి దాదాపు 265 పేజీలలో ఇప్పటి వార పత్రికల సైజులో వార్షిక సంచికను ప్రకటించేది.నిన్ననే నా మితృలు ఫణి నాగేశ్వరరావు గారు 1932 నాటి ఆంద్రపత్రిక ప్రత్యేక సంచికను నాకు చూపించారు. పాత పత్రికలంటే అమిత ఇస్ఠపడే నేను ఆశ్చర్యపడి, లేచి "79 ఏళ్ళ నాటి పత్రిక ఎక్కడ సంపాదించారండీ?"...

Saturday, 29 January 2011

ఈ దినం , దిన పత్రికల దినం !

ఇ ఇప్పుడు న్యూస్ చానళ్ళు కుప్పలు తెప్పలుగా వచ్చినా, అనుక్షణం పగలు కొట్టే వార్తలు ( అదే నండి, బ్రేకింగ్ న్యూస్ ) అందిస్తున్నా, ఉదయం లేవ గానే వార్తా పత్రికల కోసం ఆతృతతో ఎదురు చూసే పాఠకులు మాత్రం తగ్గలేదు. 1780 జనవరి 29 న హికీస్ బెంగాల్ గెజిట్ విడుదలయింది. ఆ జనవరి29ని వార్తా పత్రిక దినోత్సవంగా గుర్తించడం జరిగింది.1851 లో దాదాభాయ్ నౌరోజీ ఒక...

Thursday, 27 January 2011

ఎంత చక్కని వార్త. తెలుగుమహిళా కార్టూనిస్టులు చాలా తక్కువ మంది. వారిలో అశేష కార్టూన్ ఇష్టుల అభిమానాన్ని చూరగొన్న ఏకైక కార్టూనిస్ట్ రాగతి పండరి గారు. ఆమె కార్టూనిస్టుగా మొదటి సారిగా "కళారత్న" అవార్డు అందుకుంటున్నారు. రాగతి పండరిగారు 1972లో ఎనిమిదేళ్ళ వయసులోనే కార్టూన్లు గీయడం మొదలు పెట్టారు. ఆమె కార్టూన్ కధలు, సింగిల్ పేజీ కార్టూన్లు, రాజకీయ చెదరంగం,...

Wednesday, 26 January 2011

ఇదిగో నేనేరా! చాలా బోల్డురోజులయింది మిమ్మల్ని చూసి, బ్లాగు బుడుగులూ సీగానపెసూనాంబలూ ! ఈ రోజు బుడుగు పెళ్ళి రోజంటే నా పెళ్ళిరోజనుకున్నారా! నాది కాదురా, నా కధను రాసిపెట్టిన వాడి పెళ్ళిరోజన్నమాట. వాడి పేరే ముళ్లపూడి వెంకటరమణగారు. గారంటే నాకూ తెలియదనుకో, మన కన్నా ఎత్తుగా వున్నవాళ్ళని, పెద్దవాళ్ళంటారట,...

Saturday, 22 January 2011

పారాహుషార్...... కార్టూన్లు..!!

పొలిటికల్ కార్టూనిస్టులలో శేఖర్ ని తెలియని తెలుగు పాఠకులుండరు. ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఆయన గీసిన గీస్తున్న వేలాది కార్టూన్లు నిజంగా రాజకీయనాయకులకు, తెలుగు ప్రజలకు పారాహుషారే ! పారాహుషార్ పేరుతో శ్రీశేఖర్ గీసిన కార్టూన్ల పుస్తకం ఎనిమిదేళ్ళక్రితమే వెలువడింది. ప్రతి పేజీ...

Friday, 21 January 2011

జగతి ఎన్నార్.చందూర్

గత యాభైయారేళ్లనుంచి ప్రచురితమవుతున్న "జగతి" మాస పత్రిక సంపాదకులు , ప్రఖ్యాత రచయిత శ్రీ ఎన్నార్.చందూర్ ఈ నెల 11 వతేదీన తన 95 ఏట అస్తమించారన్న వార్త వారి అభిమానులకు విషాదం కలిగించింది. కొంతకాలం ఆకాశవాణి లో పని చేసిన ఆయన "మాలి" అనే పత్రికను ప్రారంభించి...

Saturday, 15 January 2011

ఆ రోజుల్లో..............

ఆ నాటి రోజులు గుర్తుకొస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిన్న నా బ్యాంకు పైలు చూస్తుంటే నేను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శ్రీకాకుళం లో క్యాషియరుగా చేరినప్పటి అపాయ్ట్మెంట్ లెటరు అగుపించింది. అప్పుడు బ్యాంకులో క్యాషియరుగా నా జీతం 120/- రూపాయలు. డిఏ రూ.25-20 పైసలు. ఈ ఉత్తరం నాకు ఇచ్చిన తేదీ...

Friday, 14 January 2011

సంబరాల సంక్రాంతి

కొత్త సంవత్సరం వచ్చింది. అప్పుడే మొదటి పండుగా వచ్చేసింది! దేశంలో ఇప్పుడంతా యమస్పీడ్. కళ్ళు తెరచేలోగా రోజులూ నెలలూ మారిపోతున్నాయి. మునుపటికాలంలో పెద్దపండుగ వస్తున్నదంటే నెలముందు నుంచే ఎంతో సందడి. చీకటిపడగానే అమ్మాయిలూ,వాళ్ళ అమ్మలూ ఎంతో సందడిగా ఇంటి ముందు ముగ్గులు...

Wednesday, 12 January 2011

స్వామి వివేకానంద

ఈ రోజు స్వామి వివేకానందుని జయంతి. ఈ పవిత్ర దినాన ఆయన ప్రవచించిన కొన్ని సూక్తి వచనాలను గుర్తు చేసుకొందాం. <><><><><><><><><><> అజ్ఞానులకు వెలుగుచూపండి. విద్యావంతులకు మరింత వెలుగుచూపండి. ఆధునిక విద్య పెంచే అహంకారానికి...

Tuesday, 11 January 2011

ఒకనాడు మన తెలుగు సినిమా తెరను జానపద సినిమా కధలే ఏలాయి. అందులోని మాంత్రికులు చెసే మాయలూ, నాయకులు చేసే కత్తి యుద్దాలు ఆకాశంలో గుర్రాల మీద ఎగిరిపోవడం లాంటి దృశ్యాలు పిల్లల దగ్గరనుంచి పెద్దల దాకా అలరించాయి. అలనాటి బాలరాజు, కీలుగుర్రం, మాయలమారి, పాతాళభైరవి, జయసింహ, సువర్ణసుందరి లాంటి చిత్రాలతో...

Monday, 10 January 2011

ఈ రోజు నవ్వుల దినోత్సవం ! ఈ రోజే కాదు ప్రతి రోజూ మనం నవ్వుతూ నవ్విస్తూ మనం నవ్వులపాలవకుండా ఎదుటవాళ్ళని నవ్వులపాలు చేయకుండా నవ్వుతూ కలకాలం గడపాలని కోరుకొందాం! ఈ పైన వున్న కార్టూన్లు చూశారుగా ! మొదటి బొమ్మలో మాటలు మాత్రమే వున్నాయ్! ఐనా అది కార్టూనే ! అంటే అగుపించని కార్టూన్!...

Sunday, 9 January 2011

భారతి-సాహిత్యమాస పత్రిక

ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వ్యవస్ఠాపకులు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు 1924 లో సాహిత్య మాస పత్రిక "భారతి" ని స్థాపించారు. శ్రీ నాగేశ్వరరావుగారు "భారతి" ఆవశ్యకతను వివరిస్తూ ఇలా అన్నారు. "ఆంధ్రహృదయము నందు స్వకీయ స్వరూప స్వభావములను నిర్ణయించి...

Saturday, 8 January 2011

1961 జనవరి 6న నందమూరి "సీతారామకళ్యాణం" విడుదలయిన మరునాడు 7వ తేదీ అక్కినేని చిత్రం "వెలుగునీడలు" విడుదలయింది. ఈ రెండు చిత్రాలు వారి స్వంత చిత్రాలవడం, రెండూ విజయవంతం అవటం విశేషం! ఈ చిత్రాన్ని తమిళంలో కూడా ఏక కాలంలో "తూయ ఉళ్ళం" పేరిట నిర్మించారు. వెలుగు...

Friday, 7 January 2011

వికవికల కవితలు !!

ఆయన -(ఆ) విడా కులు ! ప్రేమించి పెళ్ళాడిన ఆ ఇద్దరికీ ప్రతి రాత్రీ ఒకే పడక ! భోజనానికి పగలూ రాత్రీ ఒకే ఆకు !! ఇప్పుడా ఇద్దరికీ పగలూ రాత్రీ పడక "పగలు" పెరిగి కలహాల భోజనాలతో తీసుకున్నారులే విడాకులు!! >>>>>>>>>>><<<<<<<<<<<< ...
  • Blogger news

  • Blogroll

  • About